టాలీవుడ్‌ హీరోయిన్ ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు వైరల్! | Grand Marriage Occassion Goes Viral In Tollywood Heroine Home | Sakshi
Sakshi News home page

Karthika Nair: నాగచైతన్య హీరోయిన్ ఇంట్లో శుభకార్యం.. ప్రమోషన్ కొట్టేసిన బ్యూటీ!

Published Thu, Feb 1 2024 4:21 PM | Last Updated on Thu, Feb 1 2024 4:57 PM

Grand Marriage Occassion Goes Viral In Tollywood Heroine Home - Sakshi

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ ముద్దుగుమ్మ కార్తీక నాయర్. 2009లో జోష్ చిత్రంలో టీచర్ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్‌లో దమ్ము, బ్రదర్ ఆఫ్‌ బొమ్మాళి చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. 2015లో ఆమె తన చివరిసారిగా తమిళ చిత్రం 'పురంపోక్కు ఎంగిర పొదువుడమై'లో కనిపించింది. ఆ తర్వాత 2017లో 'ఆరంభ్'అనే సీరియల్‌లో ఆమె దేవసేన పాత్రను పోషించింది.

అయితే సీనియర్ నటి, హీరోయిన్ రాధ కూతురిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన కార్తీక గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో రోహిత్ మీనన్‌ను పెళ్లాడింది. నవంబర్ 19న జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, జాకీ ష్రాఫ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అయితే తాజాగా కార్తీక నాయర్ ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. ఈ విషయాన్ని హీరోయిన్ తల్లి రాధ నాయర్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవలే కొత్త కోడలిగా అడుగుపెట్టిన నా కూతురికి అప్పుడే ప్రమోషన్ కూడా వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. తన కుమార్తె కార్తీక పెద్ద కోడలిగా ప్రమోట్ అయిందని ఇన్‌స్టాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement