Radha Nair Shares Her Daughter Karthika Nair Childhood Pics - Sakshi
Sakshi News home page

నాగచైతన్య సరసన ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా?

Published Tue, Jun 27 2023 6:35 PM | Last Updated on Tue, Jun 27 2023 7:11 PM

Radha Nair Shares Her Daughter Karthika Nair Childhood Pics - Sakshi

తన సినీ ఆరంగేట్రం టాలీవుడ్‌లోనే మొదలైంది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకుంది. 2009లో అక్కినేని నాగచైతన్య  సరసన   జోష్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జీవా  సరసన తమిళంలో తెరకెక్కిన మూవీ రంగం ద్వారా మరింత ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్‌తో పాటు మలయాళం,  తమిళంలోనూ నటించింది.

(ఇది చదవండి: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కూతురు!)

ఇంతకీ ఆ ఫోటోలోని చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదండీ.. సీనియర్ నటి రాధ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక నాయర్. ఇవాళ తన బర్త్‌డేను పురస్కరించుకుని రాధ షేర్ చేసిన ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

తాజాగా ఇవాళ కార్తీకా బర్త్‌డే కావడంతో కూతురికి స్పెషల్ విషెస్ చెప్పింది సీనియర్ నటి రాధ. తన కూతురి చిన్ననాటి ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా.. రాధ కార్తీకతో పాటు తన పిల్లలైన తులసి, విఘ్నేశ్ ఫోటోలను పంచుకుంది. కార్తీక 1992 జూన్ 27న చెన్నెలో జన్మించింది. ఇవాళ 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బాల్యంలో కార్తీక ఫోటోలు చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: ఆదిపురుష్‌.. సెన్సార్‌ బోర్డుపై హైకోర్టు ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement