Josh
-
బిగ్ బాస్ అశ్విని శ్రీకి ఇంత గొప్ప అవార్డా? (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ ముద్దుగుమ్మ కార్తీక నాయర్. 2009లో జోష్ చిత్రంలో టీచర్ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. 2015లో ఆమె తన చివరిసారిగా తమిళ చిత్రం 'పురంపోక్కు ఎంగిర పొదువుడమై'లో కనిపించింది. ఆ తర్వాత 2017లో 'ఆరంభ్'అనే సీరియల్లో ఆమె దేవసేన పాత్రను పోషించింది. అయితే సీనియర్ నటి, హీరోయిన్ రాధ కూతురిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన కార్తీక గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో రోహిత్ మీనన్‌ను పెళ్లాడింది. నవంబర్ 19న జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, జాకీ ష్రాఫ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే తాజాగా కార్తీక నాయర్ ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. ఈ విషయాన్ని హీరోయిన్ తల్లి రాధ నాయర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవలే కొత్త కోడలిగా అడుగుపెట్టిన నా కూతురికి అప్పుడే ప్రమోషన్ కూడా వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. తన కుమార్తె కార్తీక పెద్ద కోడలిగా ప్రమోట్ అయిందని ఇన్‌స్టాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?
తన సినీ ఆరంగేట్రం టాలీవుడ్లోనే మొదలైంది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకుంది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన జోష్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జీవా సరసన తమిళంలో తెరకెక్కిన మూవీ రంగం ద్వారా మరింత ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్‌తో పాటు మలయాళం, తమిళంలోనూ నటించింది. (ఇది చదవండి: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కూతురు!) ఇంతకీ ఆ ఫోటోలోని చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదండీ.. సీనియర్ నటి రాధ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక నాయర్. ఇవాళ తన బర్త్‌డేను పురస్కరించుకుని రాధ షేర్ చేసిన ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఇవాళ కార్తీకా బర్త్‌డే కావడంతో కూతురికి స్పెషల్ విషెస్ చెప్పింది సీనియర్ నటి రాధ. తన కూతురి చిన్ననాటి ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా.. రాధ కార్తీకతో పాటు తన పిల్లలైన తులసి, విఘ్నేశ్ ఫోటోలను పంచుకుంది. కార్తీక 1992 జూన్ 27న చెన్నెలో జన్మించింది. ఇవాళ 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బాల్యంలో కార్తీక ఫోటోలు చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్) View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
WTC ఫైనల్ లో ఆస్ట్రేలియాకి కోలుకోలేని దెబ్బ స్టార్ పేసర్ అవుట్
-
వీడియో: ధోనీ రాకతో దద్దరిల్లిన స్టేడియం
-
అది చూసి బాధనిపించింది, థియేటర్‌కు వెళ్లడం మానేశా: చై
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమా ద్వారా నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాలరాజుగా కీలక పాత్రలో కనిపించిన చై తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని చెప్పిన చె కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతో బాధపెట్టిందని తెలిపాడు. 'నా ఫస్ట్ మూవీ జోష్ విడుదలైనప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ చూడాలన్న ఉద్దేశంతో ఎంతో ఉత్సాహాంగా ఫస్ట్‌డే ఓ థియేటర్‌కి వెళ్లా. సినిమా మొదలైనప్పుడు బానే ఉంది కానీ ఇంటర్వెల్‌కి వచ్చేసరికి చాలామంది ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్లిపోవడం చూశా. అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. అప్పుడు చాలా బాధనిపించింది. అప్పటి నుంచి నేనెప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఆరోజు జరిగిన సంఘటన నా మైండ్లోంచి ఇంకా పోలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటాన్నా' అని చై చెప్పుకొచ్చాడు. -
ఉద్వేగం.. ఉత్సాహం: వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో జోష్
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: జలయజ్ఞ ప్రదాత, మహానేత వైఎస్సార్ వారసుడిగా, జనం కోసం ఇచ్చిన మాటపై నిలబడి వారి సంక్షేమానికే కట్టుబడి పరిపాలనలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు ప్రత్యక్షంగా వినాలని ఎందరో వృద్ధులు ప్లీనరీకి తరలివచ్చారు. ఏక ఛత్రాధిపత్యానికి చరమగీతం పాడుతూ, రాష్ట్ర చరిత్రలో సంచలనాలకు వేదికగా నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పండుగను కనులారా వీక్షించాలని, వయోభారాన్ని, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎందరో కార్యకర్తలు ప్లీనరీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. కార్యకర్తల్లో భావోద్వేగం నిండిన ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. మూడు చక్రాల బండికి పార్టీ జెండాలను కట్టుకుని.. సిసలైన కార్యకర్తల్లా కొందరు దివ్యాంగులు బారులు తీరిన భారీ వాహనాలను దాటుకుని సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. మరికొందరు వైఎస్సార్ చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చారు. -
ఒక్క నిమిషం వీడియో.. ఆస్కార్ ఆవకాశం
సాక్షి,సిటీబ్యూరో: సినిమానే జీవితాశయంగా మార్చుకుని, సినిమా రంగంలో అవకాశాల కోసం వినూత్న శైలిలో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్న నేటి తరం సినిమా ప్రేమికులు ఎందరో... కానీ అలాంటి ఔత్సాహికుల కళను, ఆసక్తిని ప్రదర్శించే వేదిక ఇప్పటి వరకు లేదు. అలాంటి వారి కోసమే దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాల వేదికగా ప్రఖ్యాతిగాంచిన జోష్ యాప్ ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో ఓ వేదికను రూపొందించింది. ఈ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ ఏకంగా ఆస్కార్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడమేకాకుండా అక్కడి సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగం కానుంది. (చదవండి: భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య) చిన్న సినిమా.. పెద్ద వేదిక... ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా కేవలం ఒకే ఒక్క నిమిషం నిడివి గల షార్ట్ ఫిల్మ్ రూపొందించాలి. దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహాకులు తెలిపారు. రోమ్కామ్, మ్యూజికల్, కామెడీ, యాక్షన్, ఫ్యాషన్ మరేదైనా కథాంశంతో షార్ట్ ఫిల్మ్ రూపొందించి, నవంబర్ 1వ తేదీలోపు జోష్ యాప్‌లో సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఎంట్రీలలోని ఉత్తమమైన షార్ట్ ఫిల్మ్‌ను ఎంపిక చేయడానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తారలు ఫరాఖాన్, కునాల్ కోహ్లీ, ప్రభుదేవాలు వ్యవ్హరిస్తున్నారు. నవంబర్ 12న గోవాలో జరిగే గ్రాండ్ ఫినాలేలో బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌ను ప్రకటించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ తారలు వివేక్ ఒబేరాయ్, ఉర్వశి రౌతేల హోస్ట్‌గా.., సునీల్ శెట్టి, అలయా ఎఫ్, డినో మోరియా, సోనియా మెహరా, సోనాలి రౌత్ తదితరులు అతిథులుగా విచ్చేయనున్నారు. ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్ ఆస్కార్ సెలబ్రేషన్స్‌కు వెలుతుందని, అక్కడ జరిగే సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగమవుతుందని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహాకులు తెలిపారు. (చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్!) -
టిక్‌టాక్‌పై వేటు.. లోకల్ ‘జోష్’!
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌పై నిషేధంతో దేశీయ స్టార్టప్‌లకు ఊహించని అవకాశం తలుపుతట్టినట్టయింది. టిక్‌టాక్‌కు ఉన్న భారీ యూజర్లను సొంతం చేసుకునేందుకు చాలా సంస్థలు వేగంగా ఈ మార్కెట్ వైపు అడుగులు వేశాయి. షార్ట్ వీడియో మేకింగ్ యాప్‌లను (స్వల్ప కాల నిడివితో కూడిన వీడియోలను సృష్టించి ఇతర యూజర్లతో పంచుకునే వేదికలు) తీసుకురావడమే కాదు.. వీటిల్లో కొన్ని విజయాన్ని సాధించడం 2020లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవాలి. దేశీయ వినియోగదారుల డేటా రక్షణ, దేశ భద్రతతోపాటు, చైనా ద్వంద్వ వ్యవహారశైలికి తగిన చెక్ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం వందలాది చైనా మద్దతు కలిగిన యాప్‌లను ఈ ఏడాది నిషేధ జాబితాలో పెట్టేసింది. అందులో భాగంగానే టిక్‌టాప్‌పై జూన్‌లో వేటు పడింది. టిక్‌టాక్‌కు యూజర్లు భారీగా జత కూడుతున్న తరుణంలో ఈ నిషేధం ఆ సంస్థకు మింగుడుపడలేదు. కానీ, ఇది కొత్త వేదికలకు ప్రాణం పోసింది. డైలీహంట్‌కు చెందిన ‘జోష్’ యాప్ సహా దేశీయ షార్ట్ వీడియో యాప్‌లు 40% వాటాను ఇప్పటికే సొంతం చేసుకున్నట్టు బెంగళూరుకు చెందిన కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఓ నివేదికలో వెల్లడించింది. నాలుగు రెట్ల వృద్ధి.. 2020 జూన్‌లో నిషేధం విధించే నాటికి చైనాకు చెందిన టిక్‌టాక్ (బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్లాట్‌ఫామ్)కు 16.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కానీ, సరిగ్గా అంతకు రెండేళ్ల క్రితం నాటికి 2018 జూన్ వరకు.. ఈ సంస్థకు 8.5 కోట్ల వినియోగదారులే ఉండడం గమనార్హం. రెండేళ్లలోనే యూజర్లను రెట్టింపు చేసుకుని వేగంగా దూసుకుపోతున్న టిక్‌టాక్‌కు బ్రేక్ పడింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికల కోసం యూజర్ల అన్వేషణ మొదలైంది. ఈ క్రమంలో జోష్, ఎమ్ఎక్స్ టకాటక్, రోపోసో, చింగారి, మోజ్ మైట్రాన్, ట్రెల్ ఇలా ఎన్నో వేదికలు పుట్టుకొచ్చాయి. షార్ట్ వీడియో మార్కెట్‌పై దిగ్గజ సంస్థలైన ఫేస్బుక్, గూగుల్ కూడా ఆశపడ్డాయి. ఫలితంగా రీల్స్ పేరుతో ఫేస్బుక్, షార్ట్స్ పేరుతో యూట్యూబ్ సంస్థలు కొత్త వేదికలను తీసుకొచ్చాయి. టిక్‌టాక్ మార్కెట్ వాటాలో 40 శాతాన్ని భారత ప్లాట్‌ఫామ్‌లు సొంతం చేసుకున్నట్టు రెడ్‌సీర్ సంస్థ తెలిపింది. ఇందులో జోష్ ముందంజలో ఉందని.. నాణ్యమైన కంటెంట్, విస్తృతమైన కంటెంట్ లైబ్రరీ జోష్ బలాలుగా పేర్కొంది. ‘‘భారత సంస్థలు ప్రతి రోజూ తాజా నాణ్యమైన సమాచారాన్ని ఆఫర్ చేయగలవు. దీంతో షార్ట్ వీడియో మార్కెట్ వచ్చే ఐదేళ్లలో నాలుగు రెట్లకు పైగా వృద్ధి చెందుతుంది’’ అని రెడ్‌సీర్ సీఈవో అనిల్ కుమార్ ప్రకటించారు. విస్తరణపై చూపు.. ఇన్‌మొబి గ్రూప్ సబ్సిడరీ సంస్థ, రొపోసో యజమాని అయిన గ్లాన్స్ ఈ వారంలోనే 145 మిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్, మిత్రిల్ క్యాపిటల్ నుంచి సమీకరించడం ద్వారా మరింత విస్తరించే ప్రణాళికలతో ఉండడం గమనార్హం. గ్లాన్స్, రోపోసో ప్లాట్ఫామ్ల్లో మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడంతోపాటు ఆర్టిïఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. రొపోసోను గ్లాన్స్ గత ఏడాది బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. ‘‘భారత్‌లో ప్రస్తుతానికి ఇంటర్నెట్ వినియోగించే వారు 60 కోట్ల మంది ఉండగా.. ఇందులో షార్ట్ వీడియో కంటెంట్‌ను 45 శాతం మంది (27 కోట్లు) వినియోగిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఇంటర్నెట్ యూజర్లు 60 కోట్ల నుంచి 97 కోట్లకు పెరగనున్నారు. స్వల్పకాల నిడివితో కూడిన కంటెంట్ మార్కెట్ 4 రెట్లు వృద్ది చెందుతుంది. ప్రస్తుతం నెలవారీగా 110 బిలియన్ నిమిషాలను వీటిపై వెచ్చిస్తుండగా.. 400–500 బిలియన్ నిమిషాలకు విస్తరిస్తుంది’’ అంటూ రెడ్‌సీర్ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. ఒకవేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసినట్టయితే పరిస్థితుల విషయంలో పలు ప్రశ్నలు ప్రశ్నలు మిగిలే ఉన్నాయని రెడ్‌సీర్ పేర్కొంది. -
అక్కడ అసమ్మతి రాగం, ఇక్కడ ఆత్మవిశ్వాసం
సాక్షి, పాడేరు: సార్వత్రిక ఎన్నికల తేదీని ప్రకటించడంతో పాడేరు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. 2019 ఎన్నికల బరిలో నిలిచేందుకు వైఎస్సార్ సీపీ,టీడీపీ బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి గిరిజన సంక్షేమ మంత్రి పదవిని కూడా నిర్వహించిన పసుపులేటి బాలరాజు 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి అనూహ్యంగా జనసేన పార్టీలో చేరి పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేం దుకు సిద్ధం కావడం తాజా పరిణామం. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఈ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లోకులగాంధీ ఈ సారి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం బీజేపీ సీనియర్ నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, నందోలి ఉమామహేష్ కూడా దరఖాస్తు చేశారు. మాజీ మంత్రి బాలరాజు కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరిన నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఇందులో ముఖ్యంగా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చెందిన తమర్భ కృష్ణవేణి, సీదరి మంగ్లన్నదొరతో పాటు మరో సీనియర్ నాయకుడు స్వాముల సుబ్రహ్మణ్యం పాడేరు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసి బరిలో దిగేందుకు నిరీక్షిస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరా యించిన సిటింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేరును పాడేరు టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. గానీ అధికారికంగా ప్రకటించలేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఖరారు చేయవలసి ఉంది. రాజకీయ ముఖచిత్రం : నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభంజనం సృష్టించిన వైఎస్సార్సీపీదే నియోజకవర్గంలో పైచేయిగా ఉంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లోనూ బూత్‌స్థాయిలో ఈ పార్టీ బలోపేతంగా ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 26వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన గిడ్డి ఈశ్వరి పార్టీఫిరాయించిటీడీపీలో చేరి నప్పటికి కేడర్ పార్టీకి దూరం కాలేదు. ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల్లో వైఎస్సార్సీపీ కేడర్ విస్తరించి ఉంది. 15 ఏళ్ల తర్వాత టీడీపీ పోటీ : పాడేరు నియోజకవర్గంలో 15ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని బరిలో దింపుతోంది. 2009లో నియోజకవర్గం పునర్విభజన తర్వాత కూడా పాడేరు నుంచి టీడీపీ అసెంబ్లీకి ఇప్పుడే పోటీ చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆరుసార్లు పోటీ చేయగా మూడుసార్లు గెలుపు, మూడు సార్లు ఓటమి చెందారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత పాడేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు వరుసగా 1983, 1989, 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందగా 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో సీపీఐ పొత్తుతోను, 2014లో బీజేపీతో పొత్తుతోను టీడీపీ ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో గత 15 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థులు బరిలో లేకపోవడంతో నియోజకవర్గంలో ఈ పార్టీ బలహీనపడింది. ఫిరాయింపు ఎమ్మెల్యేతో మరింత అసమ్మతి : వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలోని నియోజకవర్గ ముఖ్య నేతల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారితో పాటు నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిలుగా ఉన్న సీనియర్ నాయకులు బొర్రా నాగరాజు, ప్రస్తుత జీసీసీ చైర్మన్ ఎంవీవీఎస్ ప్రసాద్ కూడా పాడేరు టీడీపీ టికెట్‌ను ఆశించారు. దీంతో ఈ ముగ్గురు సీనియర్లు అధి ష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో కూడా సీపీఐ, బీజేపీ పొత్తుతో సీట్లు దక్కక నిరాశతో ఉన్న ఈ నేతలకు ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మూలంగా భంగపాటు తప్పలేదు. సీటు దక్కకపోవడంతో నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు వద్ద, మంత్రుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో అలకపాన్పు ఎక్కారు. అలాగే మరికొందరు సీనియర్ నేతలు కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలో చేరి సాధించిన అభివృద్ధి ఏమి లేకపోగా, పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో టీడీపీ అభ్యర్థి పరిస్థితి అయోమయంగా ఉంది. జనసేన పార్టీ అభ్యర్ధి పసుపులేటి బాలరాజుకు పవన్ కళ్యాణ్ అభిమానులు తప్ప నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్మాణాత్మకంగా విస్తరించకపోవడం ప్రతీకూల అంశంగా ఉంది. మిత్రపక్షమైన సీపీఐ మద్దతుతో నెగ్గుకు రావచ్చునని బాలరాజు బరిలో నిలిచారు. ప్రధాని మోదీ ప్రధాన ఆకర్షణగా బీజేపీ నేతలు కేంద్రప్రభుత్వ పథకాల్ని ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి ఆ పార్టీ నేతల్లో ఉన్న అసమ్మతి, సామాజిక వర్గంలో తగ్గిన ఆదరణ, పార్టీ ఫిరాయింపు వల్ల ఓటర్లలో ఏర్పడిన వ్యతిరేకత, అభివృద్ధిలో వివక్ష ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ప్రధానపార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోరు సాగనుంది. -
‘ఉపాధి’ జోరు
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకానికీ అనుసంధానం చేస్తోంది. ఎక్కడ చూసిన ఉపాధి.. ఏ పథకం ప్రవేశపెట్టినా ఉపాధి హామీ పథకం కిందనే చేపడుతోంది. ఇలా ప్రతి దానికి ఈ పథకాన్ని అనుసంధానం చేయడంతో కూలీలకు చేతినిండా పని లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వ్యవసాయం, హరితహారం, మిషన్‌కాకతీయ, రోడ్ల నిర్మాణం, పశువుల పాకలు, ఫారంఫండ్లు.. డంపింగ్‌యార్డు, పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు.. ఇలా ప్రతీ దాన్ని ఉపాధి హామీ పథకంలో చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశమంతటా ఈ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతాఇంత కాదు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు. దీంతో ఉపాధి కూలీలకు చేతినిండా పనులు దొరుకుతున్నాయి. ఆ పథకం కింద సుమారు 52 రకాల పనులు చేస్తున్నారు. జిల్లాలో 1,51,583 మంది జాబ్‌కార్డులు ఉండగా.. 3,22,000 వేల మంది కూలీలు ఉన్నారు. గత ఏడాది 60 లక్షల పని దినాలు లక్ష్యం కాగా.. 31.22లక్షల పని దినాలు కల్పించారు. తాజాగా సంతల ఏర్పాటు.. గ్రామాల్లో సంతలు(అంగళ్లు) నిర్వహించుకోవడానికి వీలుగా గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానికుల అవసరాలు తీర్చడంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తినుబండరాలు, సామగ్రి తదితర వాటిని విక్రయించుకునేందుకు వసతులు కల్పించనుంది. ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, దాతలు చొరవ తీసుకుంటే త్వరగా అంగళ్ల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైన మౌలిక వసతులను రెండు కేటగిరీల్లో కల్పించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 20 గదులు, 30 గదుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసుకునేలా అవకాశం ఇచ్చారు. గ్రామ జనాభా, స్థలం, నిధుల లభ్యత తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రామ పంచాయతీలే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 30 గదులకు రూ.15 లక్షలు, 20 గదులకు రూ.10 లక్షలు కేటాయించనున్నారు. వీటిని ప్లాట్‌ఫాం, నీటి వసతి, మూత్రశాలలు, డ్రైనేజీలు, పార్కింగ్ స్థల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంగళ్ల నిర్వహణ ద్వారా గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. వేలం పాట స్థలం కేటాయింపు లేదా అంగళ్లలో విక్రయించే వారి నుంచి పన్నులు కూడా వసూలు చేసుకోవచ్చు. వ్యవసాయ పనులకు.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రవేశపెట్టే దేశ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తోంది. గ్రామీణులకు ఉన్న ఊర్లోనే పనిచేసుకుని జీవించేందుకు రూపొందించిన ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చుతోంది. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడం వల్ల బీడు భూములు సాగులోకి రావడంతోపాటు పాడిపరిశ్రమ, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పాకల నిర్మాణాలు చేపడుతోంది. ఊటకుంటలు, ఫారంఫండ్లు, నీటి నిల్వ కుంటలు ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో భూమిని సారవంతం చేసుకొని వర్మీకంపోస్టు యూనిట్లు తయారు చేసుకోవచ్చు. పశువుల తొట్టెలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. హరితహారంలో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో హరితహార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే హరితహారం కింద నాటే మొక్కలు ఉపాధి పనులతోనే చేయిస్తున్నారు. జిల్లాలోని వివిధ నర్సరీల్లో ఉపాధి కూలీలతో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది కోటి మొక్కల లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. మొక్కలు నాటడం, వాటి రక్షణ చర్యలకు సైతం ఉపాధి పనుల్లోనే వినియోగిస్తున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. సీసీ రోడ్లకు 90 శాతం నిధులు ఈ పథకం నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని చాలా గ్రామాల్లో ఉపాధి కింద వేసిన రోడ్లు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ కింద చేపట్టే పనులు సైతం చేపడుతున్నారు. చెరువులో తీయడం ఈ పథకం కింద చేస్తున్నారు. అటవీ భూముల్లో.. ఉపాధి పథకం కింద అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. పెద్ద ఎత్తున నీటి, ఊటకుంటల తవ్వకాలు చేపడుతున్నారు. అటవీభూములు ఆక్రమణలకు గురికాకుండా సరిహద్దు చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. దీని ద్వారా బయట నుంచి భూమిని కాపాడుకోవచ్చు. ఈ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టికోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఈ ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి. ఫలితంగా హరిత శాతం పెరగడంతోపాటు వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి కూలీలకు పని కల్పించడంతోపాటు రైతులకు సంబంధించిన నిర్మాణాలు ఈ పథకం కింద చేపడుతున్నాం. ఎక్కువగా వ్యవసాయ పనులకు అనుసంధానం చేయడం, నీటి లభ్యతను పెంచే నిర్మాణాలు చేపడుతున్నాం. – రాథోడ్ రాజేశ్వర్, డీఆర్డీవో -
చెల్లెలిగానా... నో అన్నాను!
‘‘నేనేం కారెక్టర్ ఆర్టిస్ట్‌ని కాదు. హీరోయిన్గా చేస్తున్నా. అయినా కూడా చెల్లెలి పాత్ర చేశానంటే.. ఆ పాత్ర ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు’’ అని కార్తీక అన్నారు. ‘జోష్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’లో ‘అల్లరి’ నరేశ్‌కి చెల్లిగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరూ కవలలు. బి. చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక మట్లాడుతూ- ‘‘చిన్నిగారు సిస్టర్ కేరక్టర్ చేయాలనగానే అమ్మ, నేను ‘నో’ అనేశాం. కానీ, కథ విన్న తర్వాత నిర్ణయం తీసుకోమన్నారు. విన్నాం.. బాగా నచ్చింది అందుకే ఒప్పుకున్నాం. ఏదనుకుంటే అది చేయాలని, తన సోదరుణ్ణి ఆడుకోవాలని, ఎవరైనా రెచ్చిపోతే రఫ్ఫాడించాలని.. అనుకునే కారెక్టర్ నాది. సినిమాలో నా మీద ‘జేమ్స్ బాండ్’ అనే పాట ఉంది. దీన్నిబట్టి నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘అరుంధతి’లాంటి సినిమా అయితే కథానాయికకు నటనకు అవకాశం దొరుకుతుంది. కానీ, లేడీ ఓరియంటెడ్ కాని ఈ చిత్రంలో నాకు నటనకు అవకాశం దొరకడం ఆనందంగా ఉంది. కొత్తగా వచ్చే హీరోలు తమ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉండాలి? ఎలాంటి రిస్కీ ఫైట్స్ ఉండాలి? అని కలలు కంటారో.. అలాంటివన్నీ నాకు ఈ సినిమాలో ఉన్నాయి. వాస్తవానికి నా పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది కాబట్టి, నరేశ్ తల్చుకుంటే దర్శకుడితో చెప్పి, నా సీన్స్ కట్ చేయించొచ్చు. కానీ, అలా చేయకపోవడం తన గొప్పతనం. ఈ సినిమాకి బ్రదర్, సిస్టర్ ఇద్దరూ హీరోలే. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఇద్దరు హీరోల సినిమా’’ అన్నారు. తన తల్లి రాధతో తనను పోల్చవద్దని చెబుతూ- ‘‘మా అమ్మ మంచి నటి. ఓ లెజెండ్‌తో ఇప్పుడిప్పుడే నటిగా పైకొస్తున్న నన్ను పోల్చడం సరికాదు. ఆవిడంత పేరు తెచ్చుకోవడానికి నాకు టైమ్ పడుతుంది. అప్పట్లో చిరంజీవిగారు మంచి డాన్సర్. ఎంత కష్టమైనా ఫర్వాలేదు.. నేను కూడా ఆ స్టెప్స్ వేస్తా అని అమ్మ అడిగి మరీ చేసేదట. చిరంజీవిగారు కూడా సపోర్ట్ చేసేవారట. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’లో కొన్ని డాన్స్ మూమెంట్స్‌ని నేను రోప్ లేకుండా చేశాను. నరేశ్, చిన్ని సహకారం లేకపోతే చేయగలిగేదాన్ని కాదు’’ అన్నారు. సినిమా సినిమాకి గ్యాప్ తీసుకోవడం గురించి చెబుతూ- ‘‘సినిమానే బతుకుదెరువు అనుకునే స్థితిలో నేను లేను. అందుకే, మనసుకి నచ్చినవాటినే చేస్తున్నాను. గ్యాప్ వచ్చినా చింతించను’’ అని చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన కనుబొమలు బాగా లేవనేవారని కార్తీక చెబుతూ - ‘‘నా ‘రంగం’ సినిమా విడుదలైన తర్వాత చాలామంది అమ్మాయిలు బ్యూటీ పార్లర్లో ‘కార్తీకలాంటి కనుబొమలు కావాలి’ అని అడుగుతున్నారట. అప్పుడు మైనస్ అన్నవాళ్లు ఇప్పుడు నా ఐబ్రోసే నాకు ప్లస్ అంటున్నారు. అందుకే విమర్శలకు కంగారుపడను. ఇప్పుడు బాగాలేదనిపించినది భవిష్యత్తులో బాగుంటుందని సర్దిచెప్పుకుంటా’’ అన్నారు. -
' ఓ ప్రయత్నం చేసి చూద్దామని'
జోష్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఒకనాటి అందాల తార తనయ కార్తీక ...తనకు నటనే ముఖ్యం కాదంటోంది. అమ్మ బాటలోనే పిల్లలు కార్తీక, తులసి పయనిస్తున్నారు. అయితే వారిద్దరి కెరియర్ ఆశించినంత వేగంగా లేదు. కో చిత్రం కార్తీకకు తమిళంలో మంచి హిట్ అందించింది. తర్వాత వచ్చిన అన్నకొడి నిరాశపరచింది. ప్రస్తుతం అరుణ్ విజయ్ సరసన డీల్ చిత్రంలో నటిస్తోంది. తన కెరియర్ వేగంగా లేకపోవడంపై కార్తీక స్పందించింది. ఆమె మాట్లాడుతూ నటిని అవ్వాలని తాను కోరుకోలేదని తెలిపింది. తాను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటుండగా తెలుగులో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఓ ప్రయత్నం చేసి చూద్దామని సినీ రంగంలోకి వచ్చానంది. తమిళంలో నటించిన కో చిత్రం విజయం సాధించడంతో నటిగా కొనసాగుతున్నానని వెల్లడించింది. చివరి వరకు నటిగానే ఉండాలని కోరుకోవడం లేదని, తనకు వేరే ప్రణాళిక ఉందని వివరించింది. అదేమిటన్నది ప్రస్తుతానికి చెప్పనని అంది. త్వరలో డీల్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు పేర్కొంది. అంతకంటే ముందు తమ సొంతూరు కేరళలో జరుగుతున్న ఓనం పండుగలో పాల్గొంటున్నట్లు కార్తీక తెలిపింది. ఇక రాధ చిన్న కూతురు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'కడలి' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయినా .... ఆ చిత్రం ఆమెను నిరాశపరిచింది. ఆ తర్వాత తులసికి మరే చిత్రంలోనూ అవకాశం రాలేదు. అయితే తొలి నుంచి దర్శకత్వంపై మక్కువ చూపుతున్న తులసి ఆ దిశగా తన కెరీర్ ను మలుచుకుంటున్నట్లు సమాచారం.