
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమా ద్వారా నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాలరాజుగా కీలక పాత్రలో కనిపించిన చై తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని చెప్పిన చె కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతో బాధపెట్టిందని తెలిపాడు.
'నా ఫస్ట్ మూవీ జోష్ విడుదలైనప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ చూడాలన్న ఉద్దేశంతో ఎంతో ఉత్సాహాంగా ఫస్ట్‌డే ఓ థియేటర్‌కి వెళ్లా. సినిమా మొదలైనప్పుడు బానే ఉంది కానీ ఇంటర్వెల్‌కి వచ్చేసరికి చాలామంది ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్లిపోవడం చూశా. అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. అప్పుడు చాలా బాధనిపించింది.
అప్పటి నుంచి నేనెప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఆరోజు జరిగిన సంఘటన నా మైండ్‌లోంచి ఇంకా పోలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటాన్నా' అని చై చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment