ఆమిర్ ఖాన్ లీడ్ రోల్‌లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య బాలరాజుగా కనిపించనున్నాడు. ఇటీవల చైకి సంబంధించిన లుక్ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీతోనే నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో చై పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా అందరి అంచనాలకు తగ్గట్టుగానే ‘లాల్ సింగ్ చద్దా’లో చై పాత్ర ఉండబోతుందని ఇటీవల చిత్ర బృందం వదిలిన స్పెషల్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది.
చదవండి: వారి కుక్కలకు కూడా స్పెషల్ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్ కామెంట్స్
ఈ మూవీలో తన పాత్ర కోసం చై ఎలా మేకోవర్ అయ్యాడు, షూటింగ్ సెట్‌లో ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో ఆమిర్ ఖాన్, డైరెక్టర్, ఇతర మూవీ సిబ్బంది చైని పొగడ్తలతో ముంచేస్తారు. ఈ వీడియో ప్రారంభంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడ నా పాత్ర పేరు బాల అని చెప్పారు. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తాను. చాలా మంది పేర్లకు ముందు వారి ఇంటిపేరుగా ఊరి పేర్లు కూడా జత చేసి ఉంటాయి.
అలా నా పేరు బాలరాజు బోడిపాలెం అని ఇంటిపేరు పెట్టాం. ఈ పేరును ఆమిర్ సర్‌తో సహా చిత్ర బృందం మొత్తం ఫైనల చేసింది. ఇదే పేరుతో తాతాగారి సినిమా పేరు బాలారాజు ఉండటం విశేషం’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మూవీ షూటింగ్ అయిపోయిందని డైరెక్టర్ చెప్పడంతో చాలా బాధపడ్డాను. షూటింగ్ జరిగినన్ని రోజులు నన్ను నేను మర్చిపోయా. కొత్త ప్రపంచాన్ని చూశాను. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం’ అని ఆనందం వ్యక్తం చేశాడు. నాగ చైతన్యతో కలిసి పనిచేయడంపై ఆమిర్ మాట్లాడుతూ.. ‘చైతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.
చదవండి: నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్
ఎప్పుడూ యూనిట్‌తో కలిసి పని చేస్తాడు. ఎప్పుడైన, ఎలాంటి పరిస్థితులోనైనా, ఏ షాట్లోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటాడు’ అంటూ ప్రశంసించాడు. డైరెక్టర్ అద్వైత్ చందన్ మాట్లాడుతూ.. ‘చై చాలా మంచి నటుడు. తన డైలాగ్ డెలివరి అద్భుతం. కొన్నిసార్లు హిందీ నటులు కూడా ఇబ్బంది డైలాగ్‌ను అతడు సింగిల్ షాట్‌లో చెప్పి ఆశ్చర్యపరుస్తాడు. చై చాలా హంబుల్ పర్సన్’ అని అన్నాడు. ఇక మిగతా క్రూడ్‌లో మాట్లాడుతూ.. నాగ చైతన్య లాంటి నటుడుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, చాలా మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. ఎప్పడు విసుక్కొడని, చాలా సహనంతో ఉంటాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment