' ఓ ప్రయత్నం చేసి చూద్దామని' | Actress Karthika says acting was not her first choice | Sakshi
Sakshi News home page

' ఓ ప్రయత్నం చేసి చూద్దామని'

Published Sat, Sep 14 2013 8:24 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

' ఓ ప్రయత్నం చేసి చూద్దామని' - Sakshi

' ఓ ప్రయత్నం చేసి చూద్దామని'

జోష్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఒకనాటి అందాల తార తనయ కార్తీక ...తనకు నటనే ముఖ్యం కాదంటోంది. అమ్మ బాటలోనే పిల్లలు కార్తీక, తులసి పయనిస్తున్నారు. అయితే వారిద్దరి కెరియర్ ఆశించినంత వేగంగా లేదు. కో చిత్రం కార్తీకకు తమిళంలో మంచి హిట్ అందించింది. తర్వాత వచ్చిన అన్నకొడి నిరాశపరచింది. ప్రస్తుతం అరుణ్ విజయ్ సరసన డీల్ చిత్రంలో నటిస్తోంది. తన కెరియర్ వేగంగా లేకపోవడంపై కార్తీక స్పందించింది.

ఆమె మాట్లాడుతూ నటిని అవ్వాలని తాను కోరుకోలేదని తెలిపింది. తాను హోటల్ మేనేజ్‌మెంట్ చేయాలనుకుంటుండగా తెలుగులో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఓ ప్రయత్నం చేసి చూద్దామని సినీ రంగంలోకి వచ్చానంది. తమిళంలో నటించిన కో చిత్రం విజయం సాధించడంతో నటిగా కొనసాగుతున్నానని వెల్లడించింది. చివరి వరకు నటిగానే ఉండాలని కోరుకోవడం లేదని, తనకు వేరే ప్రణాళిక ఉందని వివరించింది. అదేమిటన్నది ప్రస్తుతానికి చెప్పనని అంది. త్వరలో డీల్ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు పేర్కొంది.

అంతకంటే ముందు తమ సొంతూరు కేరళలో జరుగుతున్న ఓనం పండుగలో పాల్గొంటున్నట్లు కార్తీక తెలిపింది. ఇక రాధ చిన్న కూతురు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'కడలి' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయినా .... ఆ చిత్రం ఆమెను నిరాశపరిచింది. ఆ తర్వాత తులసికి మరే చిత్రంలోనూ అవకాశం రాలేదు. అయితే తొలి నుంచి దర్శకత్వంపై మక్కువ చూపుతున్న తులసి ఆ దిశగా తన కెరీర్ ను మలుచుకుంటున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement