కోకాపేట ఆంటీ గుర్తుందా? పట్టుచీర కట్టుకుని ఒంటినిండా నగలు వేసుకుని తను చాలా రిచ్ అని చెప్పకనే చెప్తుండేది. తులసి సినిమా చూసిన అందరికీ ఆమె ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో కోకాపేట ఆంటీ పాత్రను ఝాన్సీ పోషించింది. ఈ మూవీలోని ఓ డైలాగ్‌లో ఆమె మాట్లాడుతూ.. 'కోకాపేటలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏడ పెట్టుకోవాలో తెలీనంత డబ్బు వచ్చింది. అందులకేంచి పది లక్షలు తీసి ఈ కోక, నగలన్నీ కొన్నడు మా ఆయన' అని చెప్తుంది. ఇప్పుడీ డైలాగ్ మరోసారి వైరలవుతుంది.
ఎకరానికి వంద కోట్లు
కారణం.. కోకాపేటలో పెరిగిన భూమి ధరలు. హైదరాబాద్ శివారులో ఉన్న కోకాపేటలో భూముల ధర ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఎకరం ఏకంగా వంద కోట్లు దాటింది. అయితే కోకాపేట అంటే ఎప్పటినుంచో రిచ్ అంటూ తులసి సినిమాలోని ఝాన్సీ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. 'కోకాపేట ఆంటీ చెప్పిందంటే అది నిజమే మరి', 'కోకాపేట అంటే మామూలుగా ఉండదు' అని కామెంట్లు చేస్తున్నారు.
కోకాపేటలో రికార్డు ధరలు
కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూములు అంచనాలకు మించి పలుకుతున్నాయి. నిధుల సమీకరణలో భాగంగా హెచ్‌ఎండీఏ గురువారం నాడు మరోసారి భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది. నియోపోలీస్ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు గురువారం వేలం వేసింది. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.25 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్‌కే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment