రహస్యంగా రాధ కూతురు 'కార్తీక' నిశ్చితార్థం.. ఫోటో వైరల్‌ | Actress Karthika Engagement Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Karthika: రహస్యంగా హీరోయిన్‌ 'కార్తీక' నిశ్చితార్థం.. ఫోటో వైరల్‌

Published Fri, Oct 20 2023 11:56 PM | Last Updated on Sat, Oct 21 2023 8:48 AM

Actress Karthika Engagement Photo Viral - Sakshi

టాలీవుడ్‌ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు 'కార్తీక' జోష్‌ సినిమాతో తెలుగువారికి దగ్గరైంది. అందులో నాగచైతన్యకు జోడీగా ఆమె మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించిన కార్తీకకు 'రంగం' సినిమా ఆమె కెరీయర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పవచ్చు. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఏకంగా జూ. ఎన్టీఆర్‌ 'దమ్ము' చిత్రంలో ఆమెకు అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్‌ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.

సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కార్తీక తాజాగా ఒక ఫోటోను షేర్‌ చేసింది. అందులో ఆమె  ఓ వ్యక్తిని కౌగిలించుకోవడమే కాకుండా.. నవ్వులు చిందిస్తూ కనిపించింది. అలాగే ఆమె చేతికి ఓ ఖరీదైన రింగును ధరించింది. ఫోటోలో వారిద్దరి ఫేస్‌ లుక్స్‌ కంటే ఆ ఉంగారాన్నే ఎక్కువగా హైలెట్‌ చేస్తూ ఉంది. ఆ ఫోటోను తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఆమె.. నెగెటివ్‌ ఎనర్జీ తమపై పడకూడదనే  ‘ఈగల్‌ ఐ’ ఎమోజీని జత చేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ ఫోటో చూసిన వారందరూ కార్తీక నిశ్చితార్థం చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఆమె ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: హాస్పిటల్‌ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్‌..  మళ్లీ అలాంటి డ్రామానేనా?)

కొద్దిరోజుల క్రితమే కార్తీక ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆమె నిశ్చితార్థం గురించి ఆ వివరాలను అధికారికంగా  త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నట్లు సమాచారం. అల్లరి నరేష్‌తో 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' వంటి చిత్రాల్లో నటించిన కార్తీక.. 2015 తర్వాత నుంచి వెండితెరకు దూరంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement