Rangam fame
-
రహస్యంగా రాధ కూతురు 'కార్తీక' నిశ్చితార్థం.. ఫోటో వైరల్
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు 'కార్తీక' జోష్ సినిమాతో తెలుగువారికి దగ్గరైంది. అందులో నాగచైతన్యకు జోడీగా ఆమె మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించిన కార్తీకకు 'రంగం' సినిమా ఆమె కెరీయర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పవచ్చు. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఏకంగా జూ. ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రంలో ఆమెకు అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కార్తీక తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె ఓ వ్యక్తిని కౌగిలించుకోవడమే కాకుండా.. నవ్వులు చిందిస్తూ కనిపించింది. అలాగే ఆమె చేతికి ఓ ఖరీదైన రింగును ధరించింది. ఫోటోలో వారిద్దరి ఫేస్ లుక్స్ కంటే ఆ ఉంగారాన్నే ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంది. ఆ ఫోటోను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఆమె.. నెగెటివ్ ఎనర్జీ తమపై పడకూడదనే ‘ఈగల్ ఐ’ ఎమోజీని జత చేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ ఫోటో చూసిన వారందరూ కార్తీక నిశ్చితార్థం చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: హాస్పిటల్ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్.. మళ్లీ అలాంటి డ్రామానేనా?) కొద్దిరోజుల క్రితమే కార్తీక ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆమె నిశ్చితార్థం గురించి ఆ వివరాలను అధికారికంగా త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నట్లు సమాచారం. అల్లరి నరేష్‌తో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి చిత్రాల్లో నటించిన కార్తీక.. 2015 తర్వాత నుంచి వెండితెరకు దూరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Karthika Nair (@karthika_nair9) -
సమసమాజం కోసం...
అవినీతి లేని సమాజాన్ని చూడాలనేది ఆ యువకుడి ఆశయం. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు అవినీతిని అంతమొందిస్తారన్నది అతని ఆశ. కానీ, అతని ఆశ నెరవేరే పరిస్థితి కనిపించదు. చివరకు తనే నడుం బిగిస్తాడు. తను అనుకున్నట్లుగానే అవినీతిని సమూలంగా అంతమొందించడానికి ఏం చేసాడు? అనే శక్తిమంతమైన కథాంశంతో చైతన్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘నేను మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివాను. సమాజంలో ఒకడిగా సమాజాన్ని చదివి సమసమాజం కోసం ప్రయోగాత్మకంగా ఈ సినిమా చేస్తున్నాను. ఐఏయస్, ఐపీయస్, ఐఆర్‌యస్ శాఖల్లో ఉన్నవారే అవినీతిని నియంత్రించలేకపోవడంతో, సోషల్ అర్కిటెక్గా మారిన ఓ సివిల్ ఇంజనీర్ రాజకీయ వ్యవస్థపై ఎలా పోరాటం చేస్తాడు? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. సందేశ్, ఆరుషి, పంచిబొర, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, నాజర్, నాగేంద్రబాబు, ఆహుతిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: సురేందర్‌రెడ్డి, కథ-కథనం-మాటలు-నిర్మాత-దర్శకత్వం: భాస్కరరావు వేండ్రాతి.