
హీరోయిన్ శ్రియ సరన్ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటింది. అయితే 2018లో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడిన శ్రియ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచిన శ్రియ ఇటీవలె తన చిన్నారి రాధను అభిమానులకు పరిచయం చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియ ఇప్పటివరకు కూతురు రాధ ఫేస్‌ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే తాజాగా ఆమె తండ్రి బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రియ అందులో రాధ ఫేస్‌ని రివీల్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు రాధ ఎంతో క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment