తెలుగు హీరోలు చాలామంది తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తారు గానీ కూతుళ్లని హీరోయిన్లని చేయడానికి ఇష్టపడరు. మిగతా విభాగాల్లో పనిచేసే విషయమై కూడా పెద్దగా ప్రోత్సహించారు. కానీ రవితేజ మాత్రం అలా కాదని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఇతడి కూతురు దర్శకత్వం నేర్చుకుంటోందట.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)
సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోందట.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్స్ తీస్తున్న ఓ సినిమాకు రవితేజ కూతురు మోక్షద.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుందట. గతంలో రవితేజ కూడా ఇలానే సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత నటుడు అయ్యాడు. బహుశా మోక్షద కూడా ఇలా మొదట దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని, నటి అవుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ')
Comments
Please login to add a commentAdd a comment