కలిసిరాని గ్లామర్
గ్లామర్ పాత్రలు కలిసి రాకపోవడంతో నటి కార్తీక అప్‌సెట్ అయ్యారు. దీంతో క్యారెక్టర్ పాత్రలకు మారారు. ‘కో’ చిత్రం ద్వారా పరిచయమయ్యారు కార్తీక. తర్వాత ‘అన్నకొడి’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ‘డీల్’, ‘పురంబోకు’ వంటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆరంభంలో గ్లామర్ హీరోయన్‌గా రాణించేందుకు ప్రయత్నాలు సాగించిన ఈ ముద్దుగుమ్మకు కాలం కలిసి రాలేదు. అన్నకొడిలో గ్రామీణ యువతిగా నటించారు.
ఆ తర్వాతి చిత్రాల్లో కూడా నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలనే ఎంచుకున్నారు. తెలుగులో ఇదివరకే రెండు చిత్రాల్లో గ్లామర్ హీరోయిన్‌గా నటించారు. అయితే ఊహించినంతగా విజయం చేకూరనందున నిరాశకు గురయ్యారు. తదుపరి చిత్రానికి ఎదురుచూస్తున్న తరుణంలో అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రంలో చెల్లెలుగా ఆమెకు క్యారెక్టర్ పాత్ర అవకాశం వచ్చింది. పాత్ర లభించడమే పదిలంగా భావించిన ఆమె వెంటనే ఆ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యూరు.