puramboku
-
కలిసిరాని గ్లామర్
గ్లామర్ పాత్రలు కలిసి రాకపోవడంతో నటి కార్తీక అప్సెట్ అయ్యారు. దీంతో క్యారెక్టర్ పాత్రలకు మారారు. ‘కో’ చిత్రం ద్వారా పరిచయమయ్యారు కార్తీక. తర్వాత ‘అన్నకొడి’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ‘డీల్’, ‘పురంబోకు’ వంటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆరంభంలో గ్లామర్ హీరోయన్‌గా రాణించేందుకు ప్రయత్నాలు సాగించిన ఈ ముద్దుగుమ్మకు కాలం కలిసి రాలేదు. అన్నకొడిలో గ్రామీణ యువతిగా నటించారు. ఆ తర్వాతి చిత్రాల్లో కూడా నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలనే ఎంచుకున్నారు. తెలుగులో ఇదివరకే రెండు చిత్రాల్లో గ్లామర్ హీరోయిన్గా నటించారు. అయితే ఊహించినంతగా విజయం చేకూరనందున నిరాశకు గురయ్యారు. తదుపరి చిత్రానికి ఎదురుచూస్తున్న తరుణంలో అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రంలో చెల్లెలుగా ఆమెకు క్యారెక్టర్ పాత్ర అవకాశం వచ్చింది. పాత్ర లభించడమే పదిలంగా భావించిన ఆమె వెంటనే ఆ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యూరు. -
పురంబోకు హీరోయిన్గా కార్తీక
నటి కార్తీక పురంబోకు చిత్రానికి హీరోయిన్ అయ్యింది. ఒక నాటి అందాల తార రాధ పెద్ద కూతురు కార్తీక అన్నది తెలిసిందే. మలయాళం, తెలుగు, తమిళం మూడు భాషల్లోనూ పరిచయం అయిన ఈ బ్యూటీకి తమిళ చిత్రం కో సక్సెస్ నందించింది. ఆ తరువాత నటించిన అన్నకొడి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఆ చిత్ర పరాజయం కార్తీకకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో డీల్ అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. తాజాగా దర్శకుడు ఎస్.పి.జననాథన్ దృష్టి ఈ భామపై పడింది. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పురంబోకు చిత్రంలో హీరోయిన్గా నటించడానికి సిద్ధం అవుతోంది. ఆర్య, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకే హీరోయిన్ ఉం టుందని దర్శకుడు ముం దే చెప్పారు. ఈ పాత్రకు రెండు, మూడు చిత్రాలు చేసిన యువ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఈ పాత్ర ఫైట్స్ కూడా చేయూల్సి ఉంటుం దని చెప్పారు.