పురంబోకు హీరోయిన్‌గా కార్తీక
పురంబోకు హీరోయిన్‌గా కార్తీక
Published Mon, Dec 16 2013 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
నటి కార్తీక పురంబోకు చిత్రానికి హీరోయిన్ అయ్యింది. ఒక నాటి అందాల తార రాధ పెద్ద కూతురు కార్తీక అన్నది తెలిసిందే. మలయాళం, తెలుగు, తమిళం మూడు భాషల్లోనూ పరిచయం అయిన ఈ బ్యూటీకి తమిళ చిత్రం కో సక్సెస్ నందించింది. ఆ తరువాత నటించిన అన్నకొడి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఆ చిత్ర పరాజయం కార్తీకకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో డీల్ అనే ఒకే ఒక్క చిత్రం ఉంది.
తాజాగా దర్శకుడు ఎస్.పి.జననాథన్ దృష్టి ఈ భామపై పడింది. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పురంబోకు చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి సిద్ధం అవుతోంది. ఆర్య, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకే హీరోయిన్ ఉం టుందని దర్శకుడు ముం దే చెప్పారు. ఈ పాత్రకు రెండు, మూడు చిత్రాలు చేసిన యువ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఈ పాత్ర ఫైట్స్ కూడా చేయూల్సి ఉంటుం దని చెప్పారు.
Advertisement
Advertisement