మంచి అన్నయ్య...గయ్యాళి చెల్లెలు! | Karthika, Naresh new movie | Sakshi
Sakshi News home page

మంచి అన్నయ్య...గయ్యాళి చెల్లెలు!

Published Tue, Jul 29 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

మంచి అన్నయ్య...గయ్యాళి చెల్లెలు!

మంచి అన్నయ్య...గయ్యాళి చెల్లెలు!

‘‘ఈ తరం అన్నాచెల్లెళ్లు ఎలా ఉంటున్నారు? వారి అనుబంధం ఎలా సాగుతోంది? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథ నచ్చి నా చెల్లెలిగా నటించడానికి కార్తీక అంగీకరించింది. తను గయ్యాళి చెల్లెలు. రిస్కీ ఫైట్స్‌ని అద్భుతంగా చేసింది. చిన్ని దర్శకత్వం వహించిన ‘వీడు తేడా’ నచ్చి, ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం చేస్తున్నాను’’ అని ‘అల్లరి’ నరేశ్ చెప్పారు. ఆయన హీరోగా ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో సిరి మీడియా పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది.
 
మోనాల్ గజ్జర్ నాయికగా అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి. చిన్ని దర్శకుడు. ఈ చిత్రంలో నరేశ్ కొత్తగా కనిపిస్తారని, ఇది మంచి కుటుంబ కథా చిత్రమని దర్శకుడు తెలిపారు. కార్తీక మాట్లాడుతూ -‘‘ఇందులో నా పాత్ర పేరు లక్కీ. నరేశ్ మంచి కో-స్టార్’’ అన్నారు. టాకీపార్ట్ పూర్తయిందని, ఆగస్ట్ 10న టైటిల్ ప్రకటిస్తామని అమ్మిరాజు తెలిపారు. ఇంకా అడుసుమిల్లి విజయ్‌కుమార్, విక్రమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement