Monal Gajjar
-
ఫ్రెండ్ పెళ్లిలో 'బిగ్‌బాస్' ఫేమ్ మోనాల్ గజ్జర్ (ఫొటోలు)
-
Monal Gajjar: వర్షంలో బిగ్‌బాస్ బ్యూటీ ఆటలు (ఫోటోలు)
-
నేను బతికే ఉన్నా : హీరోయిన్
అహ్మదాబాద్ : సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో అల్లరి నరేశ్‌తో జతకట్టిన అందాల భామ మోనాల్ గజ్జర్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మోనాల్ తన స్నేహితుడు డాక్టర్ రోహిత్ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్‌పుర్ వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్‌పుర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా పాడైపోయింది. దీంతో మోనాల్ మృతిచెందినట్టు వార్తలు రావడంతో ఆమె బుధవారం ఫేస్ బుక్ లైవ్‌కి వచ్చారు. తాను మరణించానని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. తనతో పాటూ అందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని పేర్కొన్నారు. తన మెడ బెణకడంతో నొప్పి ఉందని, అందుకే బెల్ట్ ధరించినట్టు తెలిపారు. మోనాల్ చివరగా గుజరాతీ చిత్రం రేవాలో నటించారు. ప్రస్తుతం ఆమె గుజరాతీ చిత్రం ఫ్యామిలీ సర్కస్‌లో నటిస్తున్నారు. తెలుగుతో పాటూ గుజరాతీ, హింది, తమిళ్, మళయాల చిత్రాల్లో మోనాల్ నటించారు. -
ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాను
-
హీరోయిన్ కారు ముందు మూత్రం పోశాడు
-
హీరోయిన్ కారు ముందు మూత్రం పోశాడు
అహ్మదాబాద్ : నటి మోనాల్ గుజ్జర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్న ఆమె.. అతని చేతిలో తిట్లు తింది. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేయగా.. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధోలీవుడ్(గుజరాత్ ఇండస్ట్రీ) తార మోనాల్ రెండు రోజుల క్రితం సాయంత్రం గుల్బై టెక్రాలోని ఓ కాఫీ షాప్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె పార్కింగ్ చేసిన కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్నాడు. వెంటనే అది గమనించిన ఆమెలో కూర్చుని కారు హారన్ కొడుతూ అతన్ని వారించింది. అయినా ఆ వ్యక్తి తన పని కానిచ్చేసి ఆమె వైపుగా వచ్చాడు. హారన్ ఎందుకు కొట్టావంటూ మోనాల్‌తో వాగ్వాదానికి దిగాడు. అలా చెయ్యటం ఆమె తప్పని చెబుతుండగా.. అసభ్యపదజాలంతో తిట్టడం ప్రారంభించాడు. ఆ వ్యవహారమంతా ఆమె తన ఫోన్లో వీడియో తీసింది. మరుసటి రోజు గుజరాత్ యూనివర్సిటీ పోలీసులకు మోనాల్ ఫిర్యాదు చేసింది. అతన్ని అదుపులోకి తీసుకోగా.. తన కాంప్లెక్స్‌లో బాత్రూమ్లు పాడైపోయాయని.. అందుకే అలా చేశానని చెప్పుకొచ్చాడు. మోనాల్ సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ చిత్రాలతో తెలుగువారికి పరిచయస్తురాలే. -
ధనుష్‌తో రొమాన్స్ కు రెడీ
నటుడు ధనుష్ హీరోయిన్లకు రీఎంట్రీ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు విజయ్ను ప్రేమించి, పెళ్లాడి నటనకు దూరమైన నటి అమలాపాల్‌కు తన అమ్మా కణక్కు చిత్రం ద్వారా రీఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుసగా అవకాశాలను కల్పిస్తున్నారు. తాజాగా తమిళ తెరకు తెరమరుగైన మోనాల్ గజ్జర్‌కు రీఎంట్రీ కల్పిస్తున్నారు. సంచలన నటి నమిత తరువాత గుజరాత్ నుంచి వచ్చిన నటి మోనాల్‌గజ్జర్. ఈ అమ్మడు హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో నటించారు. కోలీవుడ్‌లోనూ ఆ మధ్య విక్రమ్‌ప్రభుకు జంటగా శిఖరం తొడు, కృష్ణ సరసన వానవరాయన్ వల్లవరాయన్ చిత్రాల్లో మెరిసింది. అయినా సరైన బ్రేక్ రాకపోవడంతో కోలీవుడ్‌కు దూరమైంది. అలాంటి నటిని ధనుష్ తాజాగా తన వీఐపీ–2 చిత్రంలో అవకాశం కల్పిస్తున్నట్లు తాజా సమాచారం. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రలో ఇప్పటికే అమలాపాల్ ఒక హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. మరో నాయకి పాత్రకు నటి మోనాల్ గజ్జర్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో సురభి పోషించిన పాత్రను దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కబాలి చిత్ర నిర్మాత కలైపులి.ఎస్ థానుతో కలిసి ధనుష్ తన వండర్ బార్ పతాకంపై నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనైనా నటి మోనాల్ గజ్జర్ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని మరిన్ని తమిళ అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి. -
'పున్నమి రాత్రి' లో మోనాల్ గుజ్జర్
-
ఒక్క చాన్స్ ఇవ్వరూ...
తమిళసినిమా: ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వరూ....? ఖడ్గం చిత్రంలో సంగీత నటించిన సన్నివేశం గుర్తు కొస్తుందా? నిజ జీవితంలోను చాలామంది నటీమణులు ఆ స్థాయి నుంచి వచ్చిన వారే. అందుకే జీవితాల్లోంచి పుట్టిందే సినిమా అంటారు. ఇక విషయానికొస్తే సరైన విజయం లేకపోతే ఎలాంటి హీరోయిన్ అయినా అవకాశాలు అడుక్కోవాల్సిందే. ప్రస్తుతం నటి మోనాల్ గజ్జర్ పరిస్థితి అలాంటిదే. ఆమె చిరునామా లేని నటేమి కాదు. తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్గా నటించారు. ఆ మధ్య తెలుగులో అల్లరి నరేష్ సరసన సుడిగాడు వంటి సక్సెస్ఫుల్ చిత్రంలోను ఇటీవల తమిళంలో విక్రమ్‌ప్రభుకు జంటగా శిఖరం తొడు వంటి ప్రజాదరణ పొందిన చిత్రంలోనూ నటించారు. అయినా ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రమే కారణం ఏమైనా మోనాల్ గజ్జర్ ప్రస్తుతం తమిళంలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నారు. దీంతో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలా అవకాశాల వేటలో ప్రముఖ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ ఆమె దృష్టిలో పడ్డారు. వెంటనే కోడంబాక్కం వచ్చి ఆయన్ని కలిసి మీ దర్శకత్వంలో నటించాలన్నది నా చిరకాల కోరిక అంటూ ఒక్క చాన్స్ ఇవ్వరూ! అంటూ అడిగేశారు. మీరు అవకాశం ఇస్తేచాలు పారితోషికం కూడా అక్కరలేదు అంటూ బోనస్ మాటలతో ఏఆర్ మురుగదాస్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారని తెలిసింది. అయితే ప్రస్తుతం హిందీ చిత్రంలో బిజీగా ఉన్న ఎ ఆర్ మురుగదాస్ తదుపరి తమిళ చిత్రంలో అవసరమైతే తప్పకుండా అవకాశం కల్పించే విషయం ఆలోచిస్తానని అన్నారట. -
సినిమా రివ్యూ: బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
తారాగణం: ‘అల్లరి’ నరేశ్, కార్తీక, మోనాల్ గజ్జర్, కథ: విక్రమ్రాజ్, సంగీతం: శేఖర్ చంద్ర, కూర్పు: గౌతంరాజు, నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ బలాలు: అలవాటైన నరేశ్ శైలి వినోదం కార్తీక తెర నిండా కనపడే కమెడియన్లు వ్యంగ్య ధోరణి కథనం ఫస్టాఫ్ పాత సినీ శైలి పాట బలహీనతలు: కథ పెద్దగా లేకపోవడం ఉన్న కొద్ది పాటి కథను ఆసక్తిగా చెప్పలేకపోవడం నిడివి పెంచుతూ సీన్లు సీన్లుగా నడవడం సెకండాఫ్ ఎడిటింగ్ దర్శకత్వం వినోదమంటే ఒకప్పటి నిర్వచనాల మాటేమో కానీ, ప్రస్తుతం తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు సందర్భ శుద్ధి, సన్నివేశ అవసరం, పాత్రోచిత ప్రవర్తన ఉన్నా, లేకున్నా కాసేపు నవ్వించడమే. గమనిస్తే, ఇటీవలి కాలపు తెలుగు చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్ అంటే ప్రధానంగా ఇలాగే సాగుతోంది. ఆ పద్ధతిలో ప్రతి విషయాన్నీ వ్యంగ్యంగా చూపి, ప్రతి పాత్రనూ పంచ్ డైలాగులతో నింపే చిత్రాల ధోరణిలో తాజా చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ కూడా సాగింది. కథ ఏమిటంటే... రామకృష్ణ అలియాస్ రాంకీ (‘అల్లరి’ నరేశ్), మహాలక్ష్మి అలియాస్ లక్కీ (కార్తీకా నాయర్)లు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి అన్న రాంకీని సైతం ఆటాడించే చెల్లెలు ఫైట్లకు సైతం సిద్ధపడే ధీర వనిత. శ్రుతి (మోనికా గజ్జర్)ను చూసీచూడగానే ప్రేమలో పడతాడు అన్న. చెల్లి పెళ్ళయితే కానీ, పెళ్ళి చేసేది లేదంటారు అతని తల్లితండ్రులు. తీరా చూస్తే, చెల్లి అప్పటికే హర్ష (హర్షవర్ధన్ రాణే) అనే యువకుణ్ణి ప్రేమిస్తుంటుంది. అతగాడికేమో మరో అమ్మాయితో పెళ్ళి కుదురుతుంది. ఈ క్రమంలో హీరో తన బృందంతో సాక్షాత్తూ ఆ పెళ్ళి ఇంటికే వెళ్ళి ఏం చేశాడు? చెల్లెలి పెళ్ళి ఎలా జరిపించాడు? తన పెళ్ళికి మార్గం ఎలా సుగమం చేసుకున్నాడన్నది మిగతా సినిమా. ఎలా నటించారంటే... కొద్దికాలంగా సరైన హిట్ లేని ‘అల్లరి’ నరేశ్ ఈ సారి పూర్వ వైభవం సంపాదించుకోవడం కోసం తన మార్కు వినోదాన్ని ఆశ్రయించారు. ఎప్పటి లానే తన ఎనర్జీ స్థాయితో అలరించడానికి యత్నించారు. సినిమాలో పేరుకు హీరోయిన్ ఉన్నా, హీరోకు జంటగా పాటల కోసమే తప్ప మోనాల్ గజ్జర్ పోషించిన పాత్ర నుంచి పెద్దగా ఆశించడానికి ఏమీ లేదు. కథకు కీలకమైన హీరో చెల్లెలుగా కార్తీక (నటి రాధ కుమార్తె) ఫైట్స్ సైతం చేసే దిలాసా యువతిగా పాత్రలో ఇమిడిపోవడానికి కృషి చేశారు. బ్రహ్మానందం, అలీ, ఫస్టాఫ్‌లో ‘వెన్నెల’ కిశోర్ - ఇలా చాలామంది కమెడియన్లే సినిమాలో ఉన్నారు. ఎలా ఉందంటే... హీరో ప్రేమ గోల, దానికి చెల్లెలిచ్చే సలహాలతో ఫస్టాఫ్ గడిచిపోతుంది. తీరా సెకండాఫ్‌లో క్యాటరర్ కోన (బ్రహ్మానందం), దొంగ పాత్రధారి అలీ తదితరులతో కలసి హీరో సాగించే డ్రామా సుదీర్ఘమనిపిస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో రచయిత కోన వెంకట్ రాసిన పెళ్ళింట్లో గందరగోళపు కామెడీకి కొనసాగింపే అదంతా. అదీ ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. గతంలో నిఖిల్ ‘వీడు తేడా’కి దర్శకత్వం వహించిన బి. చిన్నికృష్ణకు ఇది మరో ప్రయత్నం. కానీ, మరింత సమర్థంగా పాత్రలనూ, సన్నివేశాలనూ తీర్చిదిద్దుకోవాల్సింది. ఎక్కువ మంది రచయితలున్న ఈ సినిమా అంతా నాన్‌స్టాప్‌గా పాత్రలు మాట్లాడేస్తుంటాయి. వరుసగా మీదకొచ్చి పడుతున్న పంచ్ డైలాగ్స వర్షం నుంచి తప్పించుకోవడం కష్టమవుతుంది. మొత్తం మీద ఏ సీనుకు ఆ సీనుగా నడిచే ఈ సినిమా - కథ, కథనం లాంటివి పట్టించుకోకుండా కాలక్షేపం కోరే వారికి ఫరవాలేదనిపిస్తుంది. టీవీల్లో బాగా ఆడే సినిమా ఇది! -- రెంటాల జయదేవ Follow @sakshinews -
నేను, కార్తీక పోటీపడి నటించాం : ‘అల్లరి’ నరేశ్
‘‘నరేశ్ మినిమమ్ గ్యారంటీ హీరో. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’. ‘అల్లరి’ నరేశ్, మోనాల్ గజ్జర్ జంటగా బి. చిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర పాటలు స్వరపరిచారు. తొలి సీడీని శాసనసభ్యుడు, నిర్మాత మాగంటి బాబు ఆవిష్కరించి బోయపాటి శ్రీనుకి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని బోయపాటి ఆవిష్కరించారు. ఈవీవీ తనకు మంచి మిత్రుడని, ఆయన లేకపోవడం బాధాకరమని, నరేశ్, రాజేష్ తండ్రి పేరుని నిలబెడుతున్నారని మాగంటి బాబు అన్నారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ - ‘‘కథానాయికగా కొనసాగుతున్నప్పటికీ కార్తీక ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చేసి, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. మేమిద్దరం పోటీ పడి నటించాం. ఈ చిత్రం తర్వాత చిన్ని బిజీ డెరైక్టర్ అవుతాడు’’ అని తెలిపారు. దర్శకునిగా ఒకే ఒక్క సినిమా చేసిన తనతో 47 సినిమాలు చేసిన నరేశ్ సినిమా చేయడం గొప్ప విషయమని, విజయవంతమైన సినిమా చేయడానికి అందరం కృషి చేశామని చిన్ని అన్నారు. ఇందులో ఉన్న అన్నా, చెల్లెలి సెంటిమెంట్ అందరికీ నచ్చుతుందని అమ్మిరాజు చెప్పారు. శేఖర్‌చంద్ర, కార్తీక, మోనాల్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు. -
బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ మూవీ స్టిల్స్
-
బొమ్మాళీ తమ్ముడు
‘అల్లరి’ నరేశ్ హీరోగా బి.చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ అనే టైటిల్’ను ఖరారు చేశారు. మోనాల్ గజ్జర్, కార్తీక తదితరులు నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రాయే...రాయే.. మనసును లాగకే...
అందమైన సాయంత్రం... అందునా సముద్ర తీరం. ఎదురుగా మోనాల్ గజ్జర్ లాంటి పాలరాతి బొమ్మ... ఇక ఏ అబ్బాయి అయినా సాంగ్ సింగకుండా ఉంటాడా? అల్లరి నరేశ్ అదే చేశాడు. ‘రాయే... రాయే... మనసును లాగకే, లాగకే... మాయచేసి నన్ను చంపకే’ అంటూ ఓ పాటేసుకున్నాడు. ఏంటి? ఇదంతా నిజం అనుకుంటున్నారా! సినిమా కోసమే. ‘వీడు తేడా’ఫేం చిన్ని దర్శకత్వంలో అల్లరి నరేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సిరి మీడియా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం పాట చిత్రీకరణ వైజాగ్ సముద్ర తీరంలో జరిగింది. శేఖర్‌చంద్ర స్వరసారథ్యంలో, భాస్కరభట్ల ఈ పాట రాశారు. ఈ పాటతో షూటింగ్ దాదాపు పూర్తయిందనీ, ఈ నెల చివరివారంలో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సెప్టెంబర్ తొలివారంలో పాటల్ని విడుదల చేస్తామనీ నిర్మాత చెప్పారు. అల్లరి నరేశ్ చెల్లెలుగా నాటి అందాల తార రాధ కుమార్తె కార్తీక నటించారు. ఈ చిత్రానికి కథ: విక్రమ్‌రాజు, కెమెరా: విజయకుమార్ అడుసుమల్లి, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ. -
సిరి సినిమా వారి ప్రోడక్షన్ నెం.2 స్టిల్స్
-
మోనాల్ ప్రేమ తంటాలు
ప్రేమ సన్నివేశంలో నటించేందుకు నటి మోనాల్ గజ్జర్ 17 టేక్‌లు తీసుకున్నట్లు దర్శకుడు గౌరవ్ తెలిపారు. విక్రమ్ ప్రభు, మోనాల్ గజ్జర్, సత్యరాజ్, కోవై సరళతో సహా పలువురు నటిస్తున్న చిత్రం ‘శిఖరం తొడు’. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గౌరవ్ మాట్లాడుతూ మనం ప్రతిసారీ ఏటీఎంలో నగదు డ్రా చేసే సమయంలో, మనకు తెలియకుండానే అనేక పొరపాట్లు జరుగుతాయన్నారు. మనకు తెలియకుండానే ఏమేరకు నగదు సంఘ విద్రోహుల వశమౌతోంది, దీన్ని నిరోధించేందుకు మార్గాలు ఏమిటనే విషయం ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో సత్యరాజ్ విక్రమ్ ప్రభు తండ్రిగా నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు పోలీసు పాత్రలో నటిస్తున్నందున దానికి తగిన విధంగా కష్టపడ్డారని తెలిపారు. విక్రమ్ ప్రభు, మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఎంతో హుందాగా వుంటాయని, ఒక ప్రేమ సన్నివేశంలో మోనాల్ గజ్జర్ సరిగా నటించలేక 17 టేకులు తీసుకుందన్నారు. సత్యరాజ్ బహుముఖ ప్రజ్ఞకు ఈ చిత్రం దీటుగా నిలుస్తుందని, తాను కూడా ఒక ముఖ్య పాత్రలో నటించానని అన్నారు, వచ్చేవారం ఈ చిత్రం తెరమీదికి వస్తుందన్నారు. -
అల్లరి నరేష్ ఆటా పాటా
యారాడ బీచ్‌లో సినిమా షూటింగ్ విశాఖపట్నం: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ఆదివారం యారాడ పరిసర ప్రాంతాలలో జరిగింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను సిరి సినిమా పతాకంపై నిర్మాత అమ్మిరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు వుండగా, ఆఖరి పాటను విశాఖలో చిత్రీకరిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ నృత్య రీతులు సమకూర్చిన ఈ పాటను యారాడతోపాటు రుషికొండ, గంగవరం తీరాల్లో షూట్ చేస్తున్నారు. సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, కార్తీ కవలలుగా నటిస్తున్నారు. స్వామిరారా దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఆడియో ఈనెలాఖరున విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమాకి పాటలు భాస్కరభట్ల రాయగా, కెమెరా-విజయకుమార్, ఫైట్స్-రామ్‌లక్ష్మణ్ సమకూరుస్తున్నారు. వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ తల్లిదండ్రులుగా సురేఖావాణి, కాశీవిశ్వనాధ్‌లు నటిస్తున్నారు. -
ఆకాశమే హద్దురా మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
మంచి అన్నయ్య...గయ్యాళి చెల్లెలు!
‘‘ఈ తరం అన్నాచెల్లెళ్లు ఎలా ఉంటున్నారు? వారి అనుబంధం ఎలా సాగుతోంది? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథ నచ్చి నా చెల్లెలిగా నటించడానికి కార్తీక అంగీకరించింది. తను గయ్యాళి చెల్లెలు. రిస్కీ ఫైట్స్‌ని అద్భుతంగా చేసింది. చిన్ని దర్శకత్వం వహించిన ‘వీడు తేడా’ నచ్చి, ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం చేస్తున్నాను’’ అని ‘అల్లరి’ నరేశ్ చెప్పారు. ఆయన హీరోగా ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో సిరి మీడియా పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. మోనాల్ గజ్జర్ నాయికగా అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి. చిన్ని దర్శకుడు. ఈ చిత్రంలో నరేశ్ కొత్తగా కనిపిస్తారని, ఇది మంచి కుటుంబ కథా చిత్రమని దర్శకుడు తెలిపారు. కార్తీక మాట్లాడుతూ -‘‘ఇందులో నా పాత్ర పేరు లక్కీ. నరేశ్ మంచి కో-స్టార్’’ అన్నారు. టాకీపార్ట్ పూర్తయిందని, ఆగస్ట్ 10న టైటిల్ ప్రకటిస్తామని అమ్మిరాజు తెలిపారు. ఇంకా అడుసుమిల్లి విజయ్‌కుమార్, విక్రమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.