ఒక్క చాన్స్ ఇవ్వరూ... | Please only one Chance says monal gajjar | Sakshi
Sakshi News home page

ఒక్క చాన్స్ ఇవ్వరూ...

Published Mon, Apr 13 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

ఒక్క చాన్స్ ఇవ్వరూ...

ఒక్క చాన్స్ ఇవ్వరూ...

తమిళసినిమా: ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వరూ....? ఖడ్గం చిత్రంలో సంగీత నటించిన సన్నివేశం గుర్తు కొస్తుందా? నిజ జీవితంలోను   చాలామంది నటీమణులు ఆ స్థాయి నుంచి వచ్చిన వారే. అందుకే జీవితాల్లోంచి పుట్టిందే సినిమా అంటారు. ఇక విషయానికొస్తే సరైన విజయం లేకపోతే ఎలాంటి హీరోయిన్ అయినా అవకాశాలు అడుక్కోవాల్సిందే. ప్రస్తుతం నటి మోనాల్ గజ్జర్ పరిస్థితి అలాంటిదే. ఆమె చిరునామా లేని నటేమి కాదు.
 
 తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్‌గా నటించారు. ఆ మధ్య తెలుగులో అల్లరి నరేష్ సరసన సుడిగాడు వంటి సక్సెస్‌ఫుల్ చిత్రంలోను ఇటీవల తమిళంలో విక్రమ్‌ప్రభుకు జంటగా శిఖరం తొడు వంటి ప్రజాదరణ పొందిన చిత్రంలోనూ నటించారు. అయినా ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రమే కారణం ఏమైనా మోనాల్ గజ్జర్ ప్రస్తుతం తమిళంలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నారు. దీంతో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలా అవకాశాల వేటలో ప్రముఖ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ ఆమె దృష్టిలో పడ్డారు.
 
  వెంటనే కోడంబాక్కం వచ్చి ఆయన్ని కలిసి మీ దర్శకత్వంలో నటించాలన్నది నా చిరకాల కోరిక అంటూ ఒక్క చాన్స్ ఇవ్వరూ! అంటూ అడిగేశారు. మీరు అవకాశం ఇస్తేచాలు పారితోషికం కూడా అక్కరలేదు అంటూ బోనస్ మాటలతో ఏఆర్ మురుగదాస్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారని తెలిసింది. అయితే ప్రస్తుతం హిందీ చిత్రంలో బిజీగా ఉన్న ఎ ఆర్ మురుగదాస్ తదుపరి తమిళ చిత్రంలో అవసరమైతే తప్పకుండా అవకాశం కల్పించే విషయం ఆలోచిస్తానని అన్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement