బుల్లితెరపై... | On the small screen ... | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై...

Published Fri, Jun 26 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

బుల్లితెరపై...

బుల్లితెరపై...

తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న కథానాయిక అమలాపాల్‌ను త్వరలో మనం బుల్లితెరపై చూడనున్నాం.

తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న కథానాయిక అమలాపాల్‌ను త్వరలో మనం బుల్లితెరపై చూడనున్నాం. చిత్ర దర్శకుడు విజయ్‌ను వివాహం చేసుకున్న అమలాపాల్ దాదాపుగా సినిమాలు తగ్గించేశారు.
 
 ఆమె నటించిన తమిళ చిత్రం ‘హైకూ’ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత మరే సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు తన దృష్టిని బుల్లితెర వైపు మళ్లించారు. ఓ తమిళ చానల్‌లో రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు.
 
 డాన్స్ నేపథ్యంలో సాగే ఈ రియాలిటీ షోకు స్వతహాగా డాన్సర్ అయిన అమలాపాల్ అయితే బాగుంటుందని, నిర్వాహకులు అనుకున్నారట. కాన్సెప్ట్ కూడా నచ్చి, ఆమె వెంటనే అంగీకరించారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement