అల్లరి నరేష్ ఆటా పాటా | allari naresh new movie shoting in visakhapatnam | Sakshi
Sakshi News home page

అల్లరి నరేష్ ఆటా పాటా

Published Mon, Aug 11 2014 2:30 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

అల్లరి నరేష్ ఆటా పాటా - Sakshi

అల్లరి నరేష్ ఆటా పాటా

  • యారాడ బీచ్‌లో సినిమా షూటింగ్
  • విశాఖపట్నం:  అల్లరి నరేష్  హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ఆదివారం యారాడ పరిసర ప్రాంతాలలో జరిగింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను సిరి సినిమా పతాకంపై నిర్మాత అమ్మిరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు వుండగా, ఆఖరి పాటను విశాఖలో చిత్రీకరిస్తున్నారు.

    డ్యాన్స్ మాస్టర్ శేఖర్ నృత్య రీతులు సమకూర్చిన ఈ పాటను యారాడతోపాటు రుషికొండ, గంగవరం తీరాల్లో షూట్ చేస్తున్నారు. సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, కార్తీ కవలలుగా నటిస్తున్నారు. స్వామిరారా దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఆడియో ఈనెలాఖరున విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు.

    ఈ సినిమాకి పాటలు భాస్కరభట్ల రాయగా, కెమెరా-విజయకుమార్, ఫైట్స్-రామ్‌లక్ష్మణ్ సమకూరుస్తున్నారు. వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ తల్లిదండ్రులుగా సురేఖావాణి, కాశీవిశ్వనాధ్‌లు నటిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement