హీరో ‘అల్లరి’ నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వచ్చిన ‘నాంది’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్‌లో తాజాగా ‘ఉగ్రం’ సినిమా షురూ అయింది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు కనకమేడల, లోకేశ్వరి కనకమేడల స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందజేశారు. ‘‘న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సిధ్.
Comments
Please login to add a commentAdd a comment