ధనుష్‌తో రొమాన్స్ కు రెడీ | Monal Gajjar Ready to romance with Dhanush | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో రొమాన్స్ కు రెడీ

Published Mon, Jan 9 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

ధనుష్‌తో రొమాన్స్ కు రెడీ

ధనుష్‌తో రొమాన్స్ కు రెడీ

నటుడు ధనుష్‌ హీరోయిన్లకు రీఎంట్రీ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి, పెళ్లాడి నటనకు దూరమైన నటి అమలాపాల్‌కు తన అమ్మా కణక్కు చిత్రం ద్వారా రీఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుసగా అవకాశాలను కల్పిస్తున్నారు. తాజాగా తమిళ తెరకు తెరమరుగైన మోనాల్‌ గజ్జర్‌కు రీఎంట్రీ కల్పిస్తున్నారు. సంచలన నటి నమిత తరువాత గుజరాత్‌ నుంచి వచ్చిన నటి మోనాల్‌గజ్జర్‌. ఈ అమ్మడు హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో నటించారు. కోలీవుడ్‌లోనూ ఆ మధ్య విక్రమ్‌ప్రభుకు జంటగా శిఖరం తొడు, కృష్ణ సరసన వానవరాయన్ వల్లవరాయన్  చిత్రాల్లో మెరిసింది.

అయినా సరైన బ్రేక్‌ రాకపోవడంతో కోలీవుడ్‌కు దూరమైంది. అలాంటి నటిని ధనుష్‌ తాజాగా తన వీఐపీ–2 చిత్రంలో అవకాశం కల్పిస్తున్నట్లు తాజా సమాచారం. సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రలో ఇప్పటికే అమలాపాల్‌ ఒక హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. మరో నాయకి పాత్రకు నటి మోనాల్‌ గజ్జర్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో సురభి పోషించిన పాత్రను దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కబాలి చిత్ర నిర్మాత కలైపులి.ఎస్‌ థానుతో కలిసి ధనుష్‌ తన వండర్‌ బార్‌ పతాకంపై నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనైనా నటి మోనాల్‌ గజ్జర్‌ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని మరిన్ని తమిళ అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement