VIP -2
-
పెట్టిన ఎఫర్ట్‌కు రిజల్ట్ వచ్చింది
తమిళసినిమా: పెట్టిన ఎఫర్ట్‌కు తగ్గ రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇదీ వీఐపీ–2 చిత్రం గురించి ఆ చిత్ర కథకుడు, మాటల రచయిత, కథానాయకుడు ధనుష్ వ్యక్తం చేసిన అభిప్రాయం. కలైపులి ఎస్.థానుతో కలిసి ఆయన వండర్‌బార్ ఫిలింస్ సంస్థ నిర్మించిన చిత్రం వీఐపీ–2. ఇంతకు ముందు ధనుష్ నటించి నిర్మించిన వేలైఇల్లా పట్టాదారి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్యరజనీకాంత్ దర్శకురాలు. వీఐపీ–2 చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం స్థానిక అన్నాశాలైలోని ఒక నక్షత్రహోటల్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ వీఐపీ–2 చిత్రం తాము ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధిస్తోందన్నారు. ఇప్పటికే తమిళనాడులో రూ.50 కోట్ల వసూళ్లు సాధించిందని తెలిపారు.అదే విధంగా కేరళలో ఇప్పటి వరకూ ధనుష్ చిత్రాల కలెక్షన్లను అధిగమించిదని తెలిపారు. వీఐపీ–2 చిత్రాన్ని తమిళంలో పాటు, తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కించిన విషయం తెలిసిందేనని, అయితే హిందీ వెర్షన్‌ను కొనుగోలు చేసిన పీవీఆర్ సంస్థ ముందు తమిళంలో విడుదల చేయండి, ఆ తరువాత హిందీలో రిలీజ్ చేస్తామని అన్నారని తెలిపారు. ఇప్పుడు ఈ చిత్ర వసూళ్లను చూసిన ఆ సంస్థ నిర్వాహకులు మొదట ఉత్తరాదిలో 450 థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకుని, ఇప్పుడు 1200 థియేటర్లలో ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారని, అదే విధంగా తెలుగులో ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కథానాయకిగా సౌందర్యరజనీకాంత్ అనంతరం నటుడు వివేక్ మాట్లాడుతూ రజనీకాంత్ వారసురాలిగా రంగప్రవేశం చేసిన ఈ చిత్ర దర్శకురాలు సౌందర్య ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. త్వరలో కథానాయకిగా పరిచయం అవ్వడానికి కథలు వింటున్న సౌందర్యకు శుభాకాంక్షలు అందిస్తున్నానని అన్నారు. తమిళంలో స్టైలిష్ కథానాయికలను చూసి చాలా కాలమైందని, సౌందర్యతో ఆ లోటు తీరనుందని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు ధనుష్ మాట్లాడుతూ వీఐపీ–2 చిత్ర కథను వినిపించగానే తాను బ్రహ్మాండంగా ఉందని అన్నారన్నారు. తమ ఎఫర్ట్‌కు దక్కిన రిజల్ట్ వీఐపీ–2 అని పేర్కొన్నారు. వీఐపీ–3 చిత్రం కూడా ఉంటుందని, కథ రెడీ అయిన తరువాత దానికి ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుందనిపిస్తే వారు చేస్తారని చెప్పారు. -
పర్సనల్ విషయాలు అడగొద్దు
నన్ను నటుడు ధనుష్‌ను చాలా టార్చర్ పెట్టారని నటి అమలాపాల్ అంటోంది. మైనా చిత్రంతో ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన ఈ కేరళ కుట్టి అతి కొద్ది కాలంలోనే తమిళనాటి కోడలైంది. అంతే వేగంగా ఆ బంధాన్ని తెగ తెంపులు చేసుకుని కేరళకు తిరుగు టపా కట్టింది. నటిగా మాత్రం తమిళ సినిమాలనే ఎక్కువగా నమ్ముకున్న అమలాపాల్‌పై ప్రచారం అవుతున్న వదంతులు ఇటీవల ఏ నటిపైనా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ బ్యూటీ ధనుష్‌తో రొమాన్స్ చేసిన తాజా చిత్రం వీఐపీ–2 ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా అమలాపాల్ భేటీ చూద్దాం. ⇒ నటుడు ధనుష్‌తో వరుసగా నటిస్తున్నారే? ♦ మీరలా అంటున్నారు గానీ, నేను అలా అనుకోవడం లేదు. ధనుష్‌కు జంటగా తొలిసారిగా వేలైఇల్లా పట్టాదారి చిత్రంలో నటించాను. ఆ తరువాత ఆయన నిర్మించిన అమ్మాకణక్కు చిత్రంలో నటించాను. ఇప్పుడు వీఐపీ 2లో నటించాను. ఆ మధ్య వడచెన్నై చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా అంగీకరించలేకపోయాను. నిజం చెప్పాలంటే ధనుష్‌తో నటిస్తే నాకు మంచి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఆయన చాలా హార్డ్ వర్కర్. ఏ పని చేసినా దానిపై చాలా క్రేజీగా ఉంటారు. నటించేటప్పుడు చాలా మోటివేషన్‌గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. నాకు మంచి ఫ్రెండ్. నటనలో నాకు ధనుష్‌కు మధ్య పోటీ ఉంటుంది. అది ఆరోగ్యకరంగా ఉంటుంది. ⇒ మీ వ్యక్తిగతం గురించి జరుగుతున్న ప్రచారం గురించి? ♦ సారీ. నా పర్సనల్ విషయాల గురించిన ప్రస్థావన వద్దు. అదంతా ముగిసి పోయిన కథ. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా బాధ పడను. ⇒ కోలీవుడ్లోకి నటిగా రంగప్రవేశం చేసి ఆపై తమిళనాట కోడలయ్యారు. ఇప్పుడు మళ్లీ కేరళాకెళ్లి పోయారు.మళ్లీ చెన్నైలో మకాం పట్టే అవకాశం ఉందా? ♦ మీరే అర్థంతో ఆ ప్రశ్న అడిగారో నాకర్థం కాలేదు. అయితే నేను మళ్లీ చెన్నైలో సెటిల్ అవ్వలేను. చెన్నైలో షూటింగ్ ఉంటే మాత్రం నేను ఎప్పుడూ ఉండే అపార్ట్మెంట్లోనే బస చేస్తున్నాను. ఇక చెన్నైలో సొంతంగా నివాసమేర్పచుకునే ఆలోచన లేదు. ⇒ సుశీ లీక్స్ విషయంలో ఏమైంది? ధనుష్‌తో కలుపుతూ మీపై వదంతులు వరదలా ప్రచారం అవుతున్నాయి? ♦ నిజంలేని ప్రచారానికి నిలకడ ఉండదు. ఎంత వేగంగా వచ్చాయే అంతగా గాలిలో కలిసి పోతాయి. నిజం చెప్పాలంటే గాయనీ సుచిత్ర నాకు మంచి స్నేహితురాలు. తను నేను కలిసి యోగా చేశాం. సుచిత్ర భర్త కార్తీక్కుమార్తో కలిసి నేను దైవతిరుమగళ్ చిత్రంలో నటించాను.అలాంటి అనూహ్యంగా నాపై వదంతులు ప్రచారం అయ్యాయి. ఆరా తీస్తే సుశీలీక్స్ విషయంలో సుచిత్రకు సంబంధం లేదని తెలిసింది. ఎవరో ఆమె పేరును మిస్ యూజ్ చేశారు. ఈ విషయంలో నన్ను,నటుడు ధనుష్‌ను చాలా టార్చర్‌కు గురి చేశారు. మా గురించి ఏదో వీడియో వస్తుందని అన్నారు. అది ఇంకా ప్రసారం కాలేదని చాలా బాధగా ఉంది. ⇒ మళ్లీ పెళ్లి ఆలోచన ఉందా? ♦ ఇప్పుడు ఆ విషయం గురించి అవసరమా? నేను చదువుకునేటప్పుడు నటినవుతానని ఊహంచలేదు. నటి అయిన తరువాత ఒకరిని ప్రేమిస్తానని అనుకోలేదు. ప్రేమించినప్పుడు పెళ్లి జరుగుతుందని భావించలేదు. ఆ తరువాత అందరకీ తెలిసిందే. నా జీవితం గురించి నేనెలాంటి ప్లాన్ చేసుకోలేదు. అంతా అలా జరిగిపోయింది.అందువల్ల ఇకపై కూడ భవిష్యత్తు గురించి చింత లేదు. రేపేం జరుగుతుందో తెలియదు.ఈ రోజేమి జరుగుతుందో అదే నిజం. నేనూ అదే చూస్తాను. -
కొచ్చాడయాన్ ఎందుకు ఆడలేదంటే..
తమిళసినిమా: కోలీవుడ్‌లో తండ్రి బాటలో పయనిస్తున్న అతి కొద్ది మంది తనయురాళ్లలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతుర్లు ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ ఒకరు. వీరిద్దరూ తండ్రి చాటు పిల్లలుగా కాకుండా తమ కంటూ ప్రత్యేక గు ర్తింపును పొందుతూ స్వతంత్రంగా సినీరంగంలో ఎదుగుతున్నారు. రజనీకాంత్ పెద్ద కూతురు తన భర్త ధనుష్ కథానాయకుడుగా 3 చిత్రం చేసి ప్రాచుర్యం పొందారు. ఆ చి త్రంలోని వై దిస్ కొలై వెరి డీ పాట ప్రపంచ సినీ ప్రేక్షకులనే మైమరపించింది.ఇక రెండవ కూతురు సౌందర్య ఏకంగా తన తండ్రినే కథానాయకుడిగా ఎంచుకుని కొచ్చాడయాన్ అనే క్యాప్చరింగ్ మోషన్ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ మహిళా దర్శకురాలు తన బావ ధనుష్ కథా నాయకుడిగా వీఐపీ–2 చిత్రాన్ని తె రకెక్కించారు. నటుడు ధనుష్ కథ, మాటలు అందించడంతో పాటు వి.క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్.థానుతో కలిసి నిర్మిస్తుండడం విశేషం. ఇందులో బాలీవుడ్ క్రేజీ నటి కాజోల్ ముఖ్య భూమికను పోషించడం మరో విశేషం. అమలాపాల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి షాన్‌రోల్డన్ సంగీత బాణీలను అందించారు. తమిళంతో పా టు,తెలుగు,హిందీభాషల్లోనూ తెరకెక్కిన వీఐపీ–2 చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 28న మూడు భాషల్లోనూ ఏక కా లంలో విడుదలకు ముస్తాబవుతోం ది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర దర్శకురాలు విలేకరులతో ముచ్చటించారు. ప్ర: వీఐపీ 2 చిత్రం గురించి? జ: వీఐపీ 2 చిత్రం చేయడం మంచి అనుభవం. ఇందులోని నటీనటులు, సాంకేతిక వర్గం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ప్ర: ఇందులో ప్రధాన పాత్రకు బాలీవుడ్ నటి కాజోల్నే ఎంచుకోవడానికి కారణం? జ: ధనుష్ ఈ కథను తయారు చేసినప్పుడే ఇందులోని వసుంధర పాత్రకు కాజోల్ అయితే బాగుం టుందని భావించాం. తమ అభిప్రాయాన్ని నిర్మాత కలైపులి.ఎస్ థానుకు చెప్పగా ఆయన చాలా పాజిటీవ్‌గా స్పందించారు. ఆ తరువాత ఒక రోజు ధనుష్ ఫోన్ చేసి కాజోల్ ఓకే అన్నారు అని చెప్పారు. దీంతో వీఐపీ–2 చిత్రానికి మరింత హైప్ వచ్చేసింది ప్ర: కాజోల్ చిత్రంలో ప్రతినాయకిగా నటిస్తున్నారనే ప్రచారం గురించి? జ: నిజం చెప్పాలంటే కాజోల్‌ది ప్రతినాయకి పాత్ర కాదు. చిత్రంలో రఘువరన్ పాత్రకు వసుంధర పాత్రకు మధ్య క్లాష్ నడుస్తుంది. ఆ మె స్టైలిష్ నటన చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి. ప్ర: పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర తరహాలో ఉంటుందా ఇందులో కాజోల్ పాత్ర? జ: ఆ పాత్రకు పోల్చడం సరి కాదు. అయితే కాజోల్ పాత్ర వేరే విధంగా ఉంటుంది. తను చాలా కాన్ఫిడెంట్‌గా నటించారు. సాధారణంగా తెలియని భాషలో నటించడం చాలా కష్టం. అయితే తాను ఆంగ్లంలో చెప్పిన సంభాషణలను కాజోల్ చక్కగా అవగాహన చేసుకుని నటించారు. ప్ర: వీఐపీ 2 చిత్రాన్ని రజనీకాంత్ చూశారా? జ: ఇంకా చూడలేదు. చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్ర: మీ తండ్రి రజనీకాంత్ కథానాయకుడిగా మళ్లీ చిత్రం చేస్తారా? జ: అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను ప్ర: కొచ్చాడయాన్ చిత్రం ప్రేక్షకాదరణ పొందకపోవడానికి కారణం ఏమిటంటారు? జ: అప్పట్లో యానిమేషన్ గురించి ప్రేక్షకులకు సరిగా అర్థం కాకపోవడమే. నాన్నను అభిమానులు లైవ్‌గా చూడాలని కోరుకుంటారు. యానిమేషన్ చిత్రం కావడంతో వారికి అర్థం కాలేదు. అయితే ఆ చిత్ర ప్రత్యేకత దానిదే. ప్ర: మీ తండ్రి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న కోరికను నటుడు కమలహాసన్ కూతురు శ్రుతీహాసన్ వ్యక్తం చేశారు. అదే విధంగా కమలహాసన్ మీ తండ్రి రాజకీయ రంగప్రవేశం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని గురించి మీ అభిప్రాయం? జ: కమల్ అంకుల్ అభిప్రాయాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అవి అర్థవంతంగా ఉంటాయి కూడా. నాన్న, కమల్ అంకుల్ చిరకాల మిత్రులు. వారిద్దరూ బాగుండాలి. ప్ర: మీ సోదరి ఐశ్వర్య, మీరు ఇద్దరూ దర్శకత్వంపైనే దృష్టి పెట్టారు. నటనపై మొగ్గు చూపకపోవడానికి కారణం? జ: ఎమో అలాంటి ఆలోచన రాలే దు. నేను మొదట గ్రాఫిక్స్, యాని మేషన్ నేర్చుకున్నాను. ఆ తరువా త దర్శకత్వంపై దృష్టిసారించాను. ప్ర: ఇప్పడు నటించే అవకాశం ఉందా? జ: అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా. ఎలాంటి పాత్రఅన్నది వచ్చే అవకాశాలను బట్టి ఉంటుంది. ప్ర: కొత్త తరహాలో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారా? జ: హారీపోటర్ చిత్రం తరహాలో దక్షిణా చిత్రాలు రాలేదు. బాలల ఇతివృత్తంతో అలాంటి చిత్రం చేయాలనుంది. కచ్చితంగా చేస్తాను. ప్ర: అందులో మీ అబ్బాయి వేద్ నటించే అవకాశం ఉందా? జ: తప్పకుండా ఉంది ప్ర: తెలుగులో దర్శకత్వం వహిస్తారా? జ: అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. -
బావగారూ... బీ కేర్‌ఫుల్!
అసలే బావగారు... పైగా, హిట్ సిన్మాల హీరో. రీసెంట్గా తమిళ సిన్మా ‘పవర్ పాండి’తో డైరెక్టర్‌గానూ దుమ్ము దులిపేశారు. ఇటు చూస్తే మరదలిగారికి డైరెక్టర్‌గా అనుభవం లేదు. తండ్రి రజనీకాంత్ ‘కొచ్చాడియాన్’ని తెరకెక్కించిన అనుభవం మాత్రమే ఉంది. పైగా అది యానిమేషన్ మూవీ. అందుకే బావగారిదే డామినేషన్ అని చాలామంది అనుకుంటారు. పైగా కథ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్ రాసి మరదలి చేతిలో పెట్టి సినిమా తీయమన్నారు. ఇటువంటి సిచ్యుయేషన్స్లో అప్పర్ హ్యాండ్ హీరోగారిదే అనుకోవడం సహజమే కదా. కానీ, ‘విఐపి–2’ సెట్స్‌లో సీన్ కంప్లీట్ రివర్స్‌లో ఉంటుందట! బావగారు ధనుష్ హీరోగా రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘విఐపి 2’. రఘువరన్ ఈజ్ బ్యాక్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్ ధనుష్వే అయినా... సెట్లో శివగామి మాత్రం సౌందర్యేనట. సీన్ వివరించిన తర్వాత యాక్టర్స్ అందరికీ ఎలా నటించాలో, కెమెరా ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో సౌందర్య క్లియర్ కట్‌గా చెబుతారట! సో, బావగారు ఎప్పుడూ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. ఈ సినిమా షూటింగ్ చివరికొచ్చేసింది. అన్నట్టు... హిందీ హీరోయిన్ కాజోల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తారట. -
ప్చ్! బ్యాడ్ లక్!
ఆదివారం కోసం అందరూ ఎదురు చూస్తాం. ఎంజాయ్ చేయడం కోసం. కానీ, అమలాపాల్ ఓ సండే కోసం ఎదురు చూడ్డానికి ఇది కారణం కాదు. వేరే రీజన్ ఉంది. కొన్ని రోజుల క్రితం సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్లో సుచిలీక్స్ పేరుతో పలువురు సెలబ్రిటీల అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఇవి పెద్ద దుమారాన్నే రేకెత్తించాయి. అయితే, వీటికీ, మాకూ ఎలాంటి సంబంధం లేదని, సుచిత్ర ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ఆమె భర్త కార్తీక్ పేర్కొన్నారు. కాగా, ఇదే ట్విట్టర్లో ఓ ఆదివారం ధనుష్–అమలాపాల్‌కి సంబంధించిన వీడియో ప్రత్యక్షమవుతుందనే వార్త కనిపించింది. ధనుష్ సరసన నటిస్తున్న ‘వి.ఐ.పి–2’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అమాలాపాల్ ఈ విషయంపై సెటైర్లు వేశారు. ‘‘ఒక ఆదివారం నాకు చెందిన ఓ వీడియో ఒకటి బయటకు రాబోతుందని ఎవరో చెబితే తెలిసింది. నేను కూడా ఆ వీడియోకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశాను. కానీ ఆ అకౌంట్ ఆ ఆదివారమే క్లోజ్ అయిందని తెలిసింది. మై బ్యాడ్ లక్. ఆ వీడియోలో ఏముందో తెలుసుకోలేకపోయాను’’ అన్నారు అమలాపాల్. -
ఆ ఒక్కటీ అడగొద్దు
ఆ ఒక్కటీ అడగొద్దు అంటోంది బాలీవుడ్ భామ కాజోల్. ఒకప్పుడు బాలీవుడ్లో కలలరాణిగా యువతను గలిగింతలు పెట్టిన కాజోల్ మిన్సారకణవు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. 1997లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించి కాజోల్‌ను కోలీవుడ్ గుర్తుంచుకునేలా చేసింది. కాగా 30ఏళ్ల తరువాత తాజాగా నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న వీఐపీ–2 చిత్రంలో మెరవనుంది. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య దర్శకురాలు. కాగా వీఐపీ–2లో నటించి భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న కాజోల్ వీఐపీ–2 చిత్రంలో మీ పాత్ర ఏమిటమ్మా అన్న ప్రశ్నకు టక్కున ఆ ఒక్కటీ అడగొద్దు అని అంది. ఏం అంత గోప్యంగా ఉంచుతున్నారు? అని అడగ్గా వీఐపీ–2 చిత్రం గురించి గాని, అందులో తన పాత్ర గురించి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టొద్దని ఆ చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ షరతులు విధించారని చెప్పింది. అయితే ఇందులో ఈ భామ ప్రతినాయకురాలిగా నటించిందనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
జిల్.. జిల్.. జిగా...
మ్యాగ్జిమమ్ సినిమాల్లో హీరో–విలన్ మధ్య ఫైటింగ్స్ తప్ప రొమాన్స్, సరదా సాంగులు గట్రా కనిపించవు. విలన్ లేడీ అయితే, అందులోనూ మంచి అందగత్తె అయితే మన హీరోలు రిబేటు ఇస్తారు. కథలో కాస్త చోటు కల్పించి ఓ సాంగేసుకుంటారు. ఇప్పుడు రజనీకాంత్ అల్లుడు ధనుష్ అదే పని చేస్తున్నారు. రజనీ చిన్న కుమార్తె, మరదలు సౌందర్య దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘వీఐపీ–2’లో హిందీ హీరోయిన్ కాజోల్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో వీళ్లిద్దరిపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. జిల్ జిల్ జిగా అంటూ జోరుగా ఈ హీరోగారు.. లేడీ విలన్‌గారు చిందేస్తున్నారట. -
అప్పా... పొన్ను... మాపిళ్లయ్!
పుత్రుడు జన్మించినప్పుడు కాదు... ప్రజలు అతణ్ణి మెచ్చుకున్నప్పుడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందని సుమతీ శతకంలో చెప్పారు. రజనీకాంత్‌కి పుత్రులు లేరు. ఐశ్వర్య, సౌందర్య... ఇద్దరూ అమ్మాయిలే. వాళ్లను పుత్రులకు ఏమాత్రం తక్కువ కాదనే రీతిలో పెంచి పెద్ద చేశారు. అక్కాచెళ్లెళ్లు ఇద్దరూ మెగాఫోన్ పట్టారు. రజనీ పెరియ మాపిళ్లయ్ (పెద్ద అల్లుడు) ధనుష్ హీరోగా చిన్న పొన్ను (అమ్మాయి) సౌందర్య దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘వీఐపీ–2’ రూపొందుతోంది. పిల్లలు ప్రయోజకులు అయితే కళ్లారా చూడాలని ఏ తండ్రికి ఉండదు! అమ్మాయి ఎలా దర్శకత్వం వహిస్తుందో చూడాలని అప్పా (తండ్రి) రజనీ మనసు కోరుకుంది. ‘వీఐపీ–2’ షూటింగ్ గురించి వాకబు చేస్తే... శనివారమే చిత్రీకరణ చివరిరోజని ఆయనకు తెలిసింది. వెంటనే సెట్‌కి వెళ్లారు. ఆయన్ను చూసి యూనిట్ అంతా సర్ప్రైజ్ అయ్యారు. స్టార్ట్... కెమేరా... యాక్షన్... అని సౌందర్య చెబుతుంటే రజనీ దగ్గరుండి గమనించారు. అంతే కాదండోయ్... సౌందర్య తీసిన ప్రతి ఫ్రేమ్నూ విశ్లేషించి, ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని నిర్మాత తెలిపారు. అన్నట్టు... ఈ చిత్రానికి నిర్మాత ఎవరో కాదు... రజనీతో ‘కబాలి’ తీసిన కలైపులి ఎస్. థాను. -
ధనుష్‌తో రొమాన్స్ కు రెడీ
నటుడు ధనుష్ హీరోయిన్లకు రీఎంట్రీ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు విజయ్ను ప్రేమించి, పెళ్లాడి నటనకు దూరమైన నటి అమలాపాల్‌కు తన అమ్మా కణక్కు చిత్రం ద్వారా రీఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుసగా అవకాశాలను కల్పిస్తున్నారు. తాజాగా తమిళ తెరకు తెరమరుగైన మోనాల్ గజ్జర్‌కు రీఎంట్రీ కల్పిస్తున్నారు. సంచలన నటి నమిత తరువాత గుజరాత్ నుంచి వచ్చిన నటి మోనాల్‌గజ్జర్. ఈ అమ్మడు హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో నటించారు. కోలీవుడ్‌లోనూ ఆ మధ్య విక్రమ్‌ప్రభుకు జంటగా శిఖరం తొడు, కృష్ణ సరసన వానవరాయన్ వల్లవరాయన్ చిత్రాల్లో మెరిసింది. అయినా సరైన బ్రేక్ రాకపోవడంతో కోలీవుడ్‌కు దూరమైంది. అలాంటి నటిని ధనుష్ తాజాగా తన వీఐపీ–2 చిత్రంలో అవకాశం కల్పిస్తున్నట్లు తాజా సమాచారం. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రలో ఇప్పటికే అమలాపాల్ ఒక హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. మరో నాయకి పాత్రకు నటి మోనాల్ గజ్జర్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో సురభి పోషించిన పాత్రను దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కబాలి చిత్ర నిర్మాత కలైపులి.ఎస్ థానుతో కలిసి ధనుష్ తన వండర్ బార్ పతాకంపై నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనైనా నటి మోనాల్ గజ్జర్ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని మరిన్ని తమిళ అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి. -
లైకా ఖాతాలో ధనుష్ రెండు చిత్రాలు
ధనుష్ నటుడిగా, నిర్మాతగా రెండు పడవలపై పయనిస్తున్నారు. అయితే ఈ రెండింటి పైనా సక్సెస్‌ఫుల్‌గా స్వారీ చేయడం విశేషం. హీరోగా వీఐపీ-2తో త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్న ధనుష్ నిర్మాతగా విచారణై, నానూ రౌడీదాన్ చిత్రాలను ఏకకాలంలో నిర్మిస్తున్నారు. వండర్ మార్ ప్రయివెట్ లిమిటెడ్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటి వరకు 3, ఎదిర్‌నీశ్చల్, వెలై ఇల్లా పట్టాదారి, కాక్కముట్టై వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. వీటిలో 3 చిత్రం వాణిజ్య పరంగా లభాలను తెచ్చిపెట్టకపోయినా అందులోని వై దిస్ కొలవెర్రి డీ పాట ఆ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇక వెలై ఇల్లా పట్టాదారి ఘన విజయం సాధించింది. కాక్కముట్టై కమర్శియల్‌గా జాతీయ అవార్డుల పరంగానూ అనూహ్య ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. దీంతో సాధారణంగానే ధనుష్ వండర్ బార్ సంస్థ నుంచి చిత్రం వస్తుందంటేనే ఒక క్రేజ్ ఉంటుంది. కాగా తాజాగా ఆయన నిర్మిస్తున్న విచారణై చిత్రానికి విడుదలకు ముందే అంతర్జాతీయ గుర్తింపు వచ్చేసింది. కారణం ఈ చిత్రం వెన్నీస్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పోటీకి ఎంపికైంది. సముద్రకని, దినేష్, నందిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకుడు. ఈ చిత్ర ప్రపంచ విడుదల హక్కుల్ని కత్తి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్ సంస్థ పొందింది. అలాగే ధనుష్ నిర్మిస్తున్న మరో చిత్రం నానూ రౌడీదాన్ తమిళనాడు విడుదల హక్కుల్ని లైకా సంస్థ సొంతం చేసుకుంది. విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం పైనా మంచి అంచనాలున్నాయి.