బావగారూ... బీ కేర్‌ఫుల్‌! | Kajol kicks off her first trilingual with Dhanush and Soundarya | Sakshi
Sakshi News home page

బావగారూ... బీ కేర్‌ఫుల్‌!

Published Sun, Jul 9 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

‘విఐపి–2’ లొకేషన్‌లో ధనుష్, సౌందర్య, కాజోల్‌

‘విఐపి–2’ లొకేషన్‌లో ధనుష్, సౌందర్య, కాజోల్‌

అసలే బావగారు... పైగా, హిట్‌ సిన్మాల హీరో. రీసెంట్‌గా తమిళ సిన్మా ‘పవర్‌ పాండి’తో డైరెక్టర్‌గానూ దుమ్ము దులిపేశారు. ఇటు చూస్తే మరదలిగారికి డైరెక్టర్‌గా అనుభవం లేదు. తండ్రి రజనీకాంత్‌ ‘కొచ్చాడియాన్‌’ని తెరకెక్కించిన అనుభవం మాత్రమే ఉంది. పైగా అది యానిమేషన్‌ మూవీ. అందుకే బావగారిదే డామినేషన్‌ అని చాలామంది అనుకుంటారు. పైగా కథ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్‌ రాసి మరదలి చేతిలో పెట్టి సినిమా తీయమన్నారు. ఇటువంటి సిచ్యుయేషన్స్‌లో అప్పర్‌ హ్యాండ్‌ హీరోగారిదే అనుకోవడం సహజమే కదా.

కానీ, ‘విఐపి–2’ సెట్స్‌లో సీన్‌ కంప్లీట్‌ రివర్స్‌లో ఉంటుందట! బావగారు ధనుష్‌ హీరోగా రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘విఐపి 2’. రఘువరన్‌ ఈజ్‌ బ్యాక్‌... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్‌ ధనుష్‌వే అయినా... సెట్‌లో శివగామి మాత్రం సౌందర్యేనట. సీన్‌ వివరించిన తర్వాత యాక్టర్స్‌ అందరికీ ఎలా నటించాలో, కెమెరా ఫ్రేమింగ్‌ ఎలా ఉంటుందో సౌందర్య క్లియర్‌ కట్‌గా చెబుతారట! సో, బావగారు ఎప్పుడూ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ చివరికొచ్చేసింది. అన్నట్టు... హిందీ హీరోయిన్‌ కాజోల్‌ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ఈ సినిమాను హిందీలో డబ్‌ చేస్తారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement