రాయే...రాయే.. మనసును లాగకే... | Allari Naresh now in Biscuit Raja | Sakshi
Sakshi News home page

రాయే...రాయే.. మనసును లాగకే...

Published Sun, Aug 17 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

రాయే...రాయే.. మనసును లాగకే...

రాయే...రాయే.. మనసును లాగకే...

 అందమైన సాయంత్రం... అందునా సముద్ర తీరం. ఎదురుగా మోనాల్ గజ్జర్ లాంటి పాలరాతి బొమ్మ... ఇక ఏ అబ్బాయి అయినా సాంగ్ సింగకుండా ఉంటాడా? అల్లరి నరేశ్ అదే చేశాడు. ‘రాయే... రాయే... మనసును లాగకే, లాగకే... మాయచేసి నన్ను చంపకే’ అంటూ ఓ పాటేసుకున్నాడు. ఏంటి? ఇదంతా నిజం అనుకుంటున్నారా! సినిమా కోసమే. ‘వీడు తేడా’ఫేం చిన్ని దర్శకత్వంలో అల్లరి నరేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సిరి మీడియా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం పాట చిత్రీకరణ వైజాగ్ సముద్ర తీరంలో జరిగింది. శేఖర్‌చంద్ర స్వరసారథ్యంలో, భాస్కరభట్ల ఈ పాట రాశారు.
 
  ఈ పాటతో షూటింగ్ దాదాపు పూర్తయిందనీ, ఈ నెల చివరివారంలో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సెప్టెంబర్ తొలివారంలో పాటల్ని విడుదల చేస్తామనీ నిర్మాత చెప్పారు. అల్లరి నరేశ్ చెల్లెలుగా నాటి అందాల తార రాధ కుమార్తె కార్తీక నటించారు. ఈ చిత్రానికి కథ: విక్రమ్‌రాజు, కెమెరా: విజయకుమార్ అడుసుమల్లి, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement