మోనాల్ ప్రేమ తంటాలు
ప్రేమ సన్నివేశంలో నటించేందుకు నటి మోనాల్ గజ్జర్ 17 టేక్‌లు తీసుకున్నట్లు దర్శకుడు గౌరవ్ తెలిపారు. విక్రమ్ ప్రభు, మోనాల్ గజ్జర్, సత్యరాజ్, కోవై సరళతో సహా పలువురు నటిస్తున్న చిత్రం ‘శిఖరం తొడు’. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గౌరవ్ మాట్లాడుతూ మనం ప్రతిసారీ ఏటీఎంలో నగదు డ్రా చేసే సమయంలో, మనకు తెలియకుండానే అనేక పొరపాట్లు జరుగుతాయన్నారు. మనకు తెలియకుండానే ఏమేరకు నగదు సంఘ విద్రోహుల వశమౌతోంది, దీన్ని నిరోధించేందుకు మార్గాలు ఏమిటనే విషయం ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఇందులో సత్యరాజ్ విక్రమ్ ప్రభు తండ్రిగా నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు పోలీసు పాత్రలో నటిస్తున్నందున దానికి తగిన విధంగా కష్టపడ్డారని తెలిపారు. విక్రమ్ ప్రభు, మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఎంతో హుందాగా వుంటాయని, ఒక ప్రేమ సన్నివేశంలో మోనాల్ గజ్జర్ సరిగా నటించలేక 17 టేకులు తీసుకుందన్నారు. సత్యరాజ్ బహుముఖ ప్రజ్ఞకు ఈ చిత్రం దీటుగా నిలుస్తుందని, తాను కూడా ఒక ముఖ్య పాత్రలో నటించానని అన్నారు, వచ్చేవారం ఈ చిత్రం తెరమీదికి వస్తుందన్నారు.