కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య జంటగా నటించిన ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రైడ్. దర్శకుడు ముత్తయ్య మాటలను అందించిన ఈ చిత్రం ద్వారా.. ఆయన శిష్యుడు కార్తీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం.స్డూడియోస్, ఓపెన్ స్క్రీన్ పిక్చర్స్, జీ.పిక్చర్స్ సంస్థల అధినేతలు కే.కనిష్క్, జీకే, జీ.మణికన్నన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి పండగ సందర్భంగా ఈనెల 10న థియేటర్లలో థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా ఈ చిత్రం గురించి నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. 'దర్శకుడు కార్తీ రైడ్ చిత్ర కథ చెప్పినప్పుడే అందులో యాక్షన్, ఎమోషనల్, లవ్, డాన్స్ అంటూ ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్ చేసే అన్ని అంశాలు ఉన్న విషయాన్ని గ్రహించా. తాను కమర్షియల్ కథా చిత్రాల గురించి ఎక్కువగా ఆలోచిస్తా. మూవీ ఫైనల్ కాపీ చూసిన తరువాత దర్శకుడు నన్ను కమర్షియల్ హీరోగా చూపించడం సంతోషంగా అనిపించిందని' అన్నారు.
రైడ్ సామాజిక సమస్యతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు కార్తీ చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసుకున్నప్పుడే కథానాయకుడి పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉండాలని భావించానన్నారు. అదే సమయంలో మాస్ హీరోగానూ కనిపించాలని అనుకున్నానని అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా విక్రమ్‌ప్రభు కరెక్ట్ అని యూనిట్ అంతా ముక్తకంఠంతో చెప్పారన్నారు. ఈ పాత్రకు విక్రమ్‌ప్రభు పూర్తి న్యాయం చేశారన్నారు. దర్శకుడు ముత్తయ్య సంభాషణలు ఈ చిత్రానికి వాణిజ్యపరంగా పక్కా బలంగా నిలిచాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment