ఇటీవల ఇరుగప్పట్రు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో విక్రమ్ ప్రభు. ఆయన తాజాగా నటించిన చిత్రం రైడ్. ముత్తయ్య మాటలు రాసిన ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యుడు, మేనల్లుడు కార్తీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథనం, దర్శకత్వం బాధ్యతలను కార్తీ నిర్వహించగా ఎం.స్టూడియోస్ పతాకంపై ఎస్.కె.కనిష్క్ జీకే జి.మణికన్నన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్ శ్రీ దివ్య నాయకిగా నటించిన ఇందులో నటి అనంతిక, సెల్వ, దర్శకుడు వేలు ప్రభాకరన్, సౌందరరాజన్, రిషి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
కదిరవన్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రానికి సంభాషణలు అందించిన దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ కుంభం మరుదు వంటి గ్రామీణ కథా చిత్రాలు చేసిన తరువాత సిటీ నేపథ్యంలో చిత్రాన్ని చేయాలని భావించారన్నారు. అలా శివరాజ్ కుమార్ కథానాయకుడుగా నటించిన తగరు చిత్ర రీమేక్ హక్కులను పొందానని చెప్పారు.
ఆ సమయంలో విక్రమ్ ప్రభు నటించిన ఠాణాక్కారన్ చిత్రం ప్రేక్షకులకు రీచ్ అయిందని, దీంతో తగరు ఆయనకు చూపించగా ఇందులో నటించడానికి సమ్మతించారన్నారు. అయితే ఆ సమయంలో తాను దర్శకత్వం వహిస్తున్న విరుమాన్ చిత్ర కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో అల్లుడు కార్తీకి బాధ్యతలను అప్పగించానన్నారు. విక్రమ్ ప్రభు మాట్లాడుతూ ఈ చిత్రాలు ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించానని తెలిపారు. ఇది కమర్షియల్ అంశాలతొ కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. నటి శ్రీదివ్యతో చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించడం సంతోషకరమైన విషయం అని విక్రమ్ ప్రభు పేర్కొన్నారు.
చదవండి: Ananya Panday: ఆదిత్యతో డేటింగ్ రూమర్స్.. సిగ్గుపడుతూ ఒప్పేసుకున్న హీరోయిన్!
Comments
Please login to add a commentAdd a comment