అమ్మ చెప్పిన చిత్రాల్లోనే నటిస్తా | I act only my mother decided movies | Sakshi
Sakshi News home page

అమ్మ చెప్పిన చిత్రాల్లోనే నటిస్తా

Mar 27 2014 12:24 AM | Updated on Sep 2 2017 5:12 AM

అమ్మ చెప్పిన  చిత్రాల్లోనే నటిస్తా

అమ్మ చెప్పిన చిత్రాల్లోనే నటిస్తా

తన తల్లి చెప్పిన చిత్రాల్లోనే నటిస్తానని వర్ధమాన నటి తులసి చెబుతున్నారు. 1980 దశకంలో నటీమణుల ద్వయం అంబికా, రాధ ఇరువురు తమ తల్లి మాటకు కట్టుబడి పనిచేశారు

తన తల్లి చెప్పిన చిత్రాల్లోనే నటిస్తానని వర్ధమాన నటి తులసి చెబుతున్నారు. 1980 దశకంలో నటీమణుల ద్వయం అంబికా, రాధ ఇరువురు తమ తల్లి మాటకు కట్టుబడి పనిచేశారు. ప్రస్తుతం ఆ అలవాటు కార్తిక, తులసి కూడా కొనసాగిస్తున్నారు. కుమార్తెలు ఇరువురూ షూటింగులకు వెళ్లాలన్నా, దర్శకుల వద్ద కథా చర్చలు చేపట్టాలన్నా తల్లి రాధ వెంట ఉండాల్సిందే. కొత్త దర్శకుల చిత్రాలైతే అన్ని వేళలా షూటింగ్ స్పాట్లలో వారిని వెన్నంటి ఉంటారు.

భారతీరాజా దర్శకత్వంలో అన్నకొడి చిత్రంలో కార్తిక, మణిరత్నం దర్శకత్వంలో కడల్ చిత్రంలో తులసి నటించిన సమయంలో మాత్రమే దర్శకుల బాధ్యతకు కుమార్తెలను విడిచిపెట్టారు. ఈ చిత్రాల షూటింగ్‌లలో కుమార్తెల కోసం వెళ్లిందే లేదట. ప్రస్తుతం కార్తికా, తులసి మళ్లీ అమ్మ కంట్రోల్‌కు వచ్చారు. అందులోను చిన్న కుమార్తె తులసి దీన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. కడల్ చిత్రం తర్వాత యాన్ చిత్రంలో తులసి నటిస్తోంది. ప్రస్తుతం ఆమెకు చిత్ర వాతావరణం అలవాటైందట. గతంలో కంటే ప్రస్తుతం స్వతంత్రంగా నటించడం ఆరంభించారు.

కొత్త చిత్రాలు ఒప్పుకోవడానికి ముందు దర్శకులు ఎవరైనప్పటికీ అమ్మ రాధ వద్ద ఓకే తీసుకున్న తర్వాతనే అగ్రిమెంట్‌పై తులసి సంతకం చేస్తారు. దీని గురించి ఆమె వద్ద ప్రశ్నించగా ఏ క్యారెక్టర్ తనకు సరిపడుతుందనేది అమ్మకు తెలుసని, అందుకే ఆమె నిర్ణయం మేరకు నడుచుకుంటున్నాన న్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement