కొత్త రకం డ్యాన్స్ చేశా | Karthika learns tap dance for Purampokku | Sakshi
Sakshi News home page

కొత్త రకం డ్యాన్స్ చేశా

Published Thu, Jan 9 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

కొత్త రకం డ్యాన్స్ చేశా

కొత్త రకం డ్యాన్స్ చేశా

తమిళ తెరపై ఇంతకుముందెప్పుడూ చూడనటువంటి డాన్స్‌ను, నా నుంచి చూడబోతున్నారంటోంది యువ నటి కార్తీక. కో చిత్రం తరువాత ఈ బ్యూటీ సరైన సక్సెస్‌ను అందుకోలేదు. అవకాశాలు కూడా అంతంత మాత్రమే. అయితే తాజాగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో కార్తీక ఉందట. ఈ ముద్దుగుమ్మ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న పొరంబోకు చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో ఈమె పాత్రతో పాటు డాన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. దీని కోసం కార్తీక ఇప్పటి నుంచే డ్యాన్స్ రిహార్శల్స్ చేస్తోందట.
 
 దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ పొరంబోకు చిత్రంలో తనకు ఆర్యకు మధ్య చాలా డిఫరెంట్ సాంగ్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పింది. కొరియోగ్రఫీ కూడా చాలా టెక్నికల్‌గా ఉంటుందని వివరించింది. ఇలాంటి డాన్స్‌ను ఇంతకుముందు తమిళ తెరపై చూసి ఉండరని అంది. అలాంటి డాన్స్ కోసం తాను కొన్ని రోజులుగా రిహార్శిల్స్ చేస్తున్నట్టు తెలిపిం ది. చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ చిత్రంలో ఆర్య, విజయసేతుపతి, శ్యామ్ ముగ్గురు హీరో లున్నారన్నారు. హీరోయిన్ మాత్రం తానేనని చెప్పింది. ఇక తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చునంది.
 
 తన పాత్ర గురించి దర్శకుడు స్కెచ్‌లతో సహా వివరించినప్పుడు హీరో పాత్ర కంటే ఎక్కువగా ఉన్నట్లు భావించానంది. ఇది యాక్షన్ చిత్రం అని పేర్కొంది. దీని కోసం ైబైక్ రైడింగ్ కూడా నేర్చుకున్నానని చెప్పింది. చిత్రంలో తనకు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని అంది. ప్రస్తుతం ‘వా డీల్’చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. పొరంబోకు చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుందని తెలి పింది. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, అయితే ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తుండటంతో కొత్త అవకాశాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నట్లు కార్తీక పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement