Jananathan
-
ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం
సాక్షి, చెన్నై: తమిళ దర్శకుడు జననాథన్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జననాథన్ సోదరి లక్ష్మి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ (మార్చి ,14న) అకాల మరణంతో షాక్‌లో ఉన్న వారి కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయింది. (ప్రముఖ దర్శకుడు కన్నుమూత) లక్ష్మి హఠాన్మరణంపై మూవీ ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో ఇద్దరు మరణించడం విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా 'లాభం' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జననాథన్ తీవ్ర అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసిన సంగతి తెలిసిందే. -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సాక్షి, చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ఎస్సీ జననాథన్ ఆదివారం కన్నుమూశారు. జననాథన్ అకాలమరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు, ఇతర నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన రోల్ మోడల్, కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ వర్ధంతి రోజే ఆయనకూడా కన్నుమూశారంటూ గుర్తు చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డైరెక్టర్ జననాథన్ ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారని మరో డైరెక్టర్ ఆర్ముగకుమార్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. (అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి) హీరోయిన్ శృతిహాసన్ జననాథన్ మృతిపై సంతాపం ప్రకటించారు. భారమైన హృదయంతో గుడ్‌బై చెబుతూ ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంది. తన ఆలోచనలలో ఎప్పుడూ బతికే ఉంటారంటూ శృతి నివాళులర్పించారు. సినిమా ఎడిటింగ్ పనిలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లారు. అయితే జననాథన్ ఎక్కువసేపు తిరిగి రాకపోవడంతో, సిబ్బంది తనిఖీ చేయగా, అపస్మారక స్థితిలో పడి ఉండగా గుర్తించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. బ్రెడ్ అయినట్టుగా తెలిపిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆయన తుది శ్వాస తీసుకున్నట్లుగా ఆదివారం ప్రకటించారు. కాగా విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లాబాం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు జననాథన్. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ మూవీని ఈ సంవత్సరం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జననాథన్ 2004 సంవత్సరంలో అయ్యర్కై సినిమాకు తమిళంలో జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకున్నారు. It is with the heaviest Heart that We say good bye to #SPJananathan sir - it was a pleasure working with you sir Thankyou for your wisdom and kind words you will always be in my thoughts ! My deepest condolences to his family 🙏 pic.twitter.com/Ox1Ag0EEYE — shruti haasan (@shrutihaasan) March 14, 2021 #Laabam director #SPJananathan , is no more... Incidentally he passed away on the death anniversary of social revolutionary #KarlMarx , who was his role model.We miss you sir.#RIP pic.twitter.com/Zl8qF0mokD — D.IMMAN (@immancomposer) March 14, 2021 -
కొత్త రకం డ్యాన్స్ చేశా
తమిళ తెరపై ఇంతకుముందెప్పుడూ చూడనటువంటి డాన్స్‌ను, నా నుంచి చూడబోతున్నారంటోంది యువ నటి కార్తీక. కో చిత్రం తరువాత ఈ బ్యూటీ సరైన సక్సెస్‌ను అందుకోలేదు. అవకాశాలు కూడా అంతంత మాత్రమే. అయితే తాజాగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో కార్తీక ఉందట. ఈ ముద్దుగుమ్మ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న పొరంబోకు చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ చిత్రంలో ఈమె పాత్రతో పాటు డాన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. దీని కోసం కార్తీక ఇప్పటి నుంచే డ్యాన్స్ రిహార్శల్స్ చేస్తోందట. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ పొరంబోకు చిత్రంలో తనకు ఆర్యకు మధ్య చాలా డిఫరెంట్ సాంగ్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పింది. కొరియోగ్రఫీ కూడా చాలా టెక్నికల్‌గా ఉంటుందని వివరించింది. ఇలాంటి డాన్స్‌ను ఇంతకుముందు తమిళ తెరపై చూసి ఉండరని అంది. అలాంటి డాన్స్ కోసం తాను కొన్ని రోజులుగా రిహార్శిల్స్ చేస్తున్నట్టు తెలిపిం ది. చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ చిత్రంలో ఆర్య, విజయసేతుపతి, శ్యామ్ ముగ్గురు హీరో లున్నారన్నారు. హీరోయిన్ మాత్రం తానేనని చెప్పింది. ఇక తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చునంది. తన పాత్ర గురించి దర్శకుడు స్కెచ్‌లతో సహా వివరించినప్పుడు హీరో పాత్ర కంటే ఎక్కువగా ఉన్నట్లు భావించానంది. ఇది యాక్షన్ చిత్రం అని పేర్కొంది. దీని కోసం ైబైక్ రైడింగ్ కూడా నేర్చుకున్నానని చెప్పింది. చిత్రంలో తనకు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని అంది. ప్రస్తుతం ‘వా డీల్’చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. పొరంబోకు చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుందని తెలి పింది. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, అయితే ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తుండటంతో కొత్త అవకాశాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నట్లు కార్తీక పేర్కొంది.