ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం | Another big loss in Janathans family | Sakshi

ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం

Mar 17 2021 4:08 PM | Updated on Mar 17 2021 5:47 PM

Another big loss inJanathans family - Sakshi

తమిళ దర్శకుడు జననాథన్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది.

సాక్షి, చెన్నై: తమిళ దర్శకుడు జననాథన్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జననాథన్‌ సోదరి లక్ష్మి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ (మార్చి ,14న) అకాల మరణంతో షాక్‌లో ఉన్న వారి కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయింది.  (ప్రముఖ దర్శకుడు కన్నుమూత)

లక్ష్మి హఠాన‍్మరణంపై మూవీ ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో ఇద్దరు మరణించడం విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా 'లాభం' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జననాథన్‌ తీవ్ర అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement