
తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య మృతి చెందారు. గత కొన్ని రోజులుగా లివర్ (కాలేయ) సమస్యలతో బాధపడుతున్న ఈయన.. శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇతడి ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ శరణ్ ధ్రువీకరించారు.
(ఇదీ చదవండి: )
2017లో 'ఒరు కిడైయిన్ కరు మను' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు.. గతేడాది 'సత్య సొతనై' అనే మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం కమెడియన్ యోగిబాబుతో ఓటీటీ సినిమా కూడా తీశాడు.
అయితే గత కొన్నాళ్లుగా లివర్ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డైరెక్టర్ సురేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: )