
ఓ తమిళ దర్శకుడు తనను అందరిముందే కొట్టాడంటోంది హీరోయిన్ పద్మప్రియ జానకిరామన్. కేరళలోని కోజికోడ్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ఓ దర్శకుడు షూటింగ్ పూర్తయ్యాక సెట్‌లో అందరిముందే నాపై చేయి చేసుకున్నాడు.

అసత్య ప్రచారం
కానీ నేనే అతడిని కొట్టానని మీడియాలో తప్పుగా ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆ దర్శకుడిపై సినిమా అసిసోయేషన్‌కు నేనెందుకు ఫిర్యాదు చేస్తాను? అతడు చేసిన తప్పును నాపై రుద్దాలని ప్రయత్నించారు. కానీ నా ఫిర్యాదు వల్ల ఆ దర్శకుడిని 6 నెలలపాటు సినిమాలు చేయకుండా నిషేధించారు.

ఇదే సమస్య
తప్పు ఎవరివైపు ఉందని కూడా ఆలోచించకుండా ఆడవారినే దోషులుగా నిలబెట్టాలని చూస్తారు.. ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సమస్య ఇదే అని చెప్పుకొచ్చింది. కాగా పద్మప్రియ.. మలయాళంలో టాప్ హీరోయిన్. సీను వాసంతి లక్ష్మి అనే తెలుగు చిత్రంతో 2004లో కెరీర్ మొదలుపెట్టింది. అందరి బంధువయ, పటేల్ సర్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈమె తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.
చదవండి: మోసం చేశారంటూ తృప్తి డిమ్రీపై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!
Comments
Please login to add a commentAdd a comment