Padmapriya
-
పెళ్లయి 21 ఏళ్లు.. తల్లి కావాలనుంది: పద్మప్రియ
పద్మప్రియ (Padmapriya Janakiraman).. ఒకప్పుడు మలయాళంలో టాప్ హీరోయిన్. తెలుగులో శీను వాసంతి లక్ష్మి (Seenu Vasanthi Lakshmi Movie), అందరి బంధువయ, పటేల్ సర్ చిత్రాల్లోనూ నటించింది. ఈమె తన చిరకాల మిత్రుడు జాస్మిన్ షాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లై రెండు దశాబ్దాలవుతున్నా వీరికి ఇంతవరకు సంతానం లేదు. ఆ ఒక్క ముచ్చట కూడా తీరిపోయుంటే తన జీవితం మరింత సంతోషమయమై ఉండేదంటోంది పద్మప్రియ.ఎన్నో చేయాలనుకున్నా..తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ముచ్చట్లను పంచుకుంది. పద్మప్రియ మాట్లాడుతూ.. ఎన్నో సినిమాలు చేయాలనుకున్నాను. కానీ అదే సమయంలో బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నటిగా నా ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పటికీ మంచి అవకాశాలు అంత త్వరగా వచ్చేవి కావు. అందుకే బ్రేక్ తీసుకున్నాను. అంతేకాదు.. ముప్పై దాటిందంటే హీరోయిన్లు కనుమరుగవుతూ ఉంటారు. అందుకే నా అంతట నేనే సైడ్ అయిపోయా!పిల్లలు కావాలనుందిఅయినా ఇలాంటి బ్రేక్స్ తీసుకోవడం యాక్టర్స్‌కు అవసరం అని నా అభిప్రాయం. ఇప్పుడైతే నాకు పిల్లలు కావాలనుంది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉంది. ఒకప్పుడు పెళ్లే వద్దనుకున్నాను.. కానీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాను. సినీ ఇండస్ట్రీలోకి రాకూడదనుకున్నాను.. కానీ వచ్చాను. బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా మళ్లీ సినిమాలు చేయొద్దనుకున్నాను కానీ చేశాను. అందుకే జీవితం ఎప్పుడు? ఎలా? ఎటువైపు మలుపు తిరుగుతుందో మనం చెప్పలేం అంటోంది పద్మప్రియ.సినిమాఈమె అమృతం, కరుత పక్షికల్, మిరుగం, పళస్సి రాజాచ తమాషు, ఒరు తెక్కన్ తల్లు కేస్ వంటి మలయాళ చిత్రాలతో పాటు తంగ బీన్కల్, క్రాస్‌రోడ్ వంటి తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. 2014లో జాస్మిన్ షాను పెళ్లాడింది.చదవండి: ఎప్పటికీ నీతోనే.. నమ్రతకు మహేశ్ లవ్ నోట్ -
తమిళ డైరెక్టర్ అందరిముందు నన్ను కొట్టాడు: హీరోయిన్
ఓ తమిళ దర్శకుడు తనను అందరిముందే కొట్టాడంటోంది హీరోయిన్ పద్మప్రియ జానకిరామన్. కేరళలోని కోజికోడ్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ఓ దర్శకుడు షూటింగ్ పూర్తయ్యాక సెట్లో అందరిముందే నాపై చేయి చేసుకున్నాడు. అసత్య ప్రచారంకానీ నేనే అతడిని కొట్టానని మీడియాలో తప్పుగా ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆ దర్శకుడిపై సినిమా అసిసోయేషన్కు నేనెందుకు ఫిర్యాదు చేస్తాను? అతడు చేసిన తప్పును నాపై రుద్దాలని ప్రయత్నించారు. కానీ నా ఫిర్యాదు వల్ల ఆ దర్శకుడిని 6 నెలలపాటు సినిమాలు చేయకుండా నిషేధించారు. ఇదే సమస్యతప్పు ఎవరివైపు ఉందని కూడా ఆలోచించకుండా ఆడవారినే దోషులుగా నిలబెట్టాలని చూస్తారు.. ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సమస్య ఇదే అని చెప్పుకొచ్చింది. కాగా పద్మప్రియ.. మలయాళంలో టాప్ హీరోయిన్. సీను వాసంతి లక్ష్మి అనే తెలుగు చిత్రంతో 2004లో కెరీర్ మొదలుపెట్టింది. అందరి బంధువయ, పటేల్ సర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈమె తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.చదవండి: మోసం చేశారంటూ తృప్తి డిమ్రీపై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్! -
ఆప్తమిత్రవాక్యం
కథలూ, నవలలూ ఆకర్షించినంత సహజంగా వ్యాసాలు పాఠకులను అలరించటం అరుదు. బ్రిటిష్ రచయిత్రి జేడీ స్మిత్ రాసిన ఆరు చిన్న వ్యాసాల నాజూకు సంపుటి ‘ఇంటిమేషన్స్’ జూలైలో విడుదలైన విశిష్ట రచన. ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా పరిస్థితుల తక్షణతే ఈ వ్యాసాల్లోని ప్రథమాకర్షణ. మనుషులనీ, ప్రపంచాన్నీ నిష్పక్షపాతంగా గమనిస్తున్న తలపోతలు, తీర్పులు కావు; ప్రవర్తకస్థాయి సమాలోచనలు. లాక్డౌన్లో అనూహ్యంగా దొరికిన సమయాన్ని రకరకాల పనులతో అందరూ నింపడాన్ని చర్చిస్తారు ‘సమ్‌థింగ్ టు డూ’ వ్యాసంలో. కానీ కాలహరణం కోసం రూపొందే కళ వేరు, అనుభూతుల్లోనుంచి సర్వోత్కృష్టమైన కళావిర్భావం జరగడం వేరు. ఆ రెండోరకానికి చెందిన సృజనకారులు అరుదు. ‘సఫరింగ్ లైక్ మెల్ గిబ్సన్’ ఆర్ద్రమైన వ్యాసం. మనోవేదన వ్యక్తిగతమే కాదు; వ్యక్తిస్థాయిలో అనియంత్రితం, చర్చాతీతం. లాక్డౌన్ సమయంలో స్నేహితులని కలవలేని బాధతో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి వేదన అలాంటిదే. ఎవరి బాధలూ వేరొకరితో పోల్చదగ్గవి కానప్పటికీ అవి మినుపుడములను ఆక్రమించి, చీకట్లను నింపకూడదని వ్యాసాంతరార్థం. లాక్డౌన్ ప్రకటించేలోగా న్యూయార్క్ విడిచి లండన్ వెళ్లాలనుకుంటున్న సమయంలో రచయిత్రిని ఓచోట విరిసిన తులిప్ పువ్వులు ఆపేస్తాయి. ఫలదీకరణని స్ఫురింపచేసిన ఆ మొక్కలూ పూలూ ఆమెకు అస్తిత్వంతో చేసిన స్వీయపోరాటాన్ని గుర్తుచేస్తాయి. శరీరంలో కలిగే మార్పులు, సామాజిక నిబంధనలు– రెండింటీకీ స్త్రీ బందీయే. మగవాడిలా కాకుండా బాహ్యాంతర ప్రభావాలకి ఆమె అస్తిత్వం– వివాహిత, అవివాహిత, తల్లి, గొడ్రాలుగా రూపాంతరం చెందుతుంటుంది. స్వీయనియంత్రణాపేక్షతో జీవితాన్ని నిర్దేశించుకోవాలనుకునే రచయిత్రిని తాను రాస్తున్న, జీవిస్తున్న విలువల మధ్య అంతరాలు కలవరపెడుతుంటాయి. నిజానికి, చుట్టూ వినిపిస్తున్న మానవవేదన ముందు ఇలాంటి భావసంఘర్షణలన్నీ అర్థరహితాలే అంటారు ‘పియొనీస్’ వ్యాసంలో. ‘‘చావు ఇంతలా సాధారణం కాని పాతకాలం తిరిగొస్తే బావుండు. అప్పటి జీవితమూ, దేశ ఆర్థికపరిస్థితి బావుండేవి,’’ అన్న ట్రంప్ మాటలలోని మొదటిభాగంతో మాత్రమే ఏకీభవిస్తానంటూ మొదలవుతుంది ‘ద అమెరికన్ ఎక్స్పెక్టేషన్’ వ్యాసం. ఈ ‘శోకభీకర తిమిరంపు’ మరణాల్లోనూ అసమానతలున్నాయి. వైద్యవిధానాలు జనబాహుళ్యానికి సమరీతిలో అందడంలేదు. ఇన్నిరకాలైన జీవనపోరాటాల అనంతరం ప్రజల ఆంతర్యాలు మునుపటిలా ఉండవు; జీవితానికి అవసరమైనదేదో అవగతమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా మాయాజాలాలు చేస్తున్న పాలకులను గమనించే ప్రజలు చూసినదాన్ని మర్చిపోతారనీ, నూతనాధ్యాయాల్లోకి ఆ పాలకులనే పునఃస్వాగతిస్తారనీ అనుకోలేం. ‘స్క్రీన్గ్రాబ్స్’ వ్యాసం నిజానికి వ్యాసమాలిక. చిరువ్యాపారుల నిస్సహాయమైన ఇక్కట్లు ఒకదాంట్లో ప్రతిఫలిస్తే, కరోనా నుంచి దూరంగా తొలగిపోతున్నవారిని చూసి ఏమీలేని అభాగ్యుడు ‘‘నేనిక్కడనుంచి పారిపోను, నేనింతకంటే దారుణమైన జీవితాన్నే చూశాను,’’ అని బిగ్గరగా నవ్వడం మరో జీవనచిత్రం. విద్యార్థుల భవిష్యత్తు తాత్కాలికంగా స్తంభించిపోవడం మరో ప్రస్తావన. చివరన వచ్చే ‘పోస్ట్‌స్క్రిప్ట్’ వ్యాసం– శ్వేతజాతీయుల్లో కరోనాకంటే భయంకరంగా జీర్ణించుకుపోయిన జాతివిద్వేషం ‘కంటెప్ట్ యాజ్ ఎ వైరస్’ గురించి. నల్లజాతి ఉనికినే గుర్తించడానికి ఇష్టపడనంత, శ్వాస ఆగిపోయేదాకా మెడపై బూటుకాలు తొక్కిపెట్టగలిగేంత జాతివిద్వేషం. పేదరికంలో, చాలీచాలని వేతనాలమధ్య, వైద్యసౌకర్యాలు అందక వ్యాధుల బారిన పడితే, వారిని జుగుప్సతో వ్యాధివ్యాప్తిదారులుగా చూడటం సబబేనా? వీరి జీవితాల్లో ఇప్పుడేకాదు, ఎప్పుడూ ఐసోలేషనే అంటారు స్మిత్. రాజ్యం బలమంతా అస్తిత్వాల వెతుకులాటలో సమూహాలుగా చీలి బలహీనపడ్డ ప్రజలే! ఏదోనాటికి ఈ జాతివిద్వేష వైరస్‌కి వ్యాక్సిన్ వస్తుందన్న ఆశ మృగ్యమైపోతోంది. చివరివ్యాసం ‘డెట్స్ అండ్ లెసన్స్’ రచయిత్రి జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులను, వారినుంచి నేర్చుకున్న విలువలనూ హృద్యంగా పరిచయం చేస్తుంది. ముగింపుగా రచయిత్రి మాటలు: ‘‘నేనెప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో అలాగే పుట్టాను– ఒక చారిత్రక ఘట్టంలో భాగాన్నై. నా శారీరక, మానసిక బలాలకిది పరీక్షాకాలం.’’ వ్యాసాలన్నీ స్వకీయ స్వగతాలైనప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోగల నిజాయితీ, విషయంలో గంభీరతా, వచనంలో సారళ్యతా, విరళంగా ఉటంకించిన వాస్తవ సంఘటనలూ రచయిత్రి చెప్పదలుచుకున్న విషయాన్ని సునాయాసంగా ఆవిష్కరించాయి. అమెరికన్ సందర్భానికి రాసిన వ్యాసాలే అయినా, చర్చించిన సమస్యలు మాత్రం మనందరివీ. పద్మప్రియ పుస్తకం: ఇంటిమేషన్స్ రచన: జేడీ స్మిత్ ప్రచురణ: పెంగ్విన్ బుక్స్; 2020 -
ఇరాన్ అశాంతివనాలు
సంక్షుభితమైన గతాన్నీ, అది నేర్పిన పాఠాల్నీ మర్చిపోవటం సబబేనా? కేవలం నలభై ఏళ్ల క్రితం జరిగిన ఇరాన్ సంఘర్షణా భరిత చరిత్రను అప్పుడే మర్చిపోయి, ఏమీ జరగనట్టు జీవిస్తున్న తరానికి ఆ చరిత్రను గుర్తుచేయటం అవసరమనుకుని రాసిన నవల ఇది అంటారు ‘ది ఎన్లైటెన్మెంట్ ఆఫ్ ద గ్రీన్‌గేజ్ ట్రీ’ రచయిత్రి షొకుఫే అజా. మనిషి తనలోపలికి ప్రయాణిస్తేనే సత్యం బోధపడుతుందని చెప్పే ఆమె తొలి నవలే బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్ షార్ట్‌లిస్ట్‌లో చోటుచేసుకోవటం విశేషం. టెహరాన్‌లోని సంపన్న కుటుంబానికి చెందిన హూషాంగ్, రోజాని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. వారి పిల్లలు –సోరాబ్, బీటా, బహార్. 1979లో ఇరాన్లో పాహ్లావీ సామ్రాజ్యపు ఆఖరి రాజుని, రాచరికపు వ్యవస్థని ఇస్లామిక్ రివల్యూషన్ కూల్చేసి ఆయతుల్లా ఖొమేనీ మతరాజ్య వ్యవస్థని ఏర్పాటు చేయడానికి సరీగ్గా రెండు రోజుల ముందు జరిగిన అల్లర్లలో తిరుగుబాటుదారులు వచ్చి హూషాంగ్ ఇంటిని తగలబెట్టేస్తారు. పుస్తకాలూ, సంగీత పరికరాలతో పాటు పదమూడేళ్ల కూతురు బహార్ కూడా ఆ మంటలకు ఆహుతైపోతుంది. ఆత్మ రూపంలో కుటుంబంతో కలిసి ఉండే బహార్ ఈ నవలలోని కథకురాలు. దేశాన్ని అలుముకున్న మతతత్వవాదం రుచించని హుషాంగ్, చుట్టూ ఉన్న అరాచకత్వానికి దూరంగా కుటుంబంతో సహా టెహరాన్ వదిలి వెళ్లిపోతాడు. తమని వ్యతిరేకించేవారు ద్రోహులని నమ్మే మతతత్వవాదులు కొడుకు సోరాబ్‌ని రాజకీయ ఖైదీని చేస్తారు. అణచివేతలూ, స్వేచ్ఛారహిత పరిస్థితులతో విరక్తి చెంది గ్రీన్‌గేజ్ అనే పళ్లచెట్టెక్కి కూర్చుని మూడు పగళ్లూ రాత్రులూ గడిపిన రోజా మనుషులు తమ వర్తమానపు క్షణాలని నిర్లక్ష్యంగా నాశనం చేసుకుంటూ ముందుకెళుతున్నారనుకుంటుంది. సరిగ్గా ఆ క్షణంలోనే సోరాబ్‌ని కాల్చి చంపేశారు అని మొదలవుతుంది నవల. కూతురు బీటా మత్స్యకన్యగా మారటం లాంటి వింత మలుపులు, ముగిసిన జీవితాలతో కథ నడిచి, ఆ కుటుంబంలోని అయిదుగురూ విచిత్రంగా గ్రీన్‌గేజ్ పళ్లచెట్టులోకి లీనమైపోవటంతో నవల ముగుస్తుంది. ఆత్మలూ బ్రతికున్నవారూ కలిసిమెలిసి ఉండటం, జీనీ భూతాలూ, మత్స్యకన్యలూ, మార్మిక వనాలూ – పర్షియన్ సాహిత్యంలో కనిపించే మాజిక్ రియలిజాల ప్రపంచం ఒకవైపు; ఇస్లామిక్ రివల్యూషన్, నియంతృత్వ ధోరణులూ, మారణహోమాలూ, విచ్ఛిన్నమైన జీవితాల బరువైన కథనమూ ఇంకో వైపు సమతుల్యం చేస్తూ కవితాత్మక శబ్దాన్ని జారవిడవకుండా రాసిన నవలలో ఇరానియన్ సాహిత్యమూ సంస్కృతితో బాటు, అరబ్బులకంటే ముందునాళ్ల జోరాష్ట్రియన్ సంస్కృతి కలగలసిపోయి ఉంటుంది. రచయిత్రి సామాజిక పరిస్థితులను చిత్రీకరించిన తీరూ, భాషామాధుర్యం, చిత్రమైన పరిస్థితులూ, పాత్రల మధ్య పరస్పర ప్రేమానురాగాల నేపథ్యంలో వాళ్లు చవిచూసిన విషాదాలూ– ఇవన్నీ కథకున్న బలాలు. మతానికి సంబంధించని సాహిత్యమంతా రాజ్యానికి వ్యతిరేకమనీ నమ్మే మతతత్వవాదులు హుషాంగ్ వాళ్లింట్లో పుస్తకాలన్నింటినీ తగలబెట్టినప్పుడు చుట్టూ ఉన్న జనాల మౌనాన్ని చూసి ‘‘మనుషులకి ప్రేమా, సత్యమూ, చరిత్రా, జ్ఞానమూ ఇవేమీ అవసరం లేదా? భద్రతనిచ్చే కాస్తంత చోటుంటే చాలా?’’అనే బహార్ ప్రశ్నలో విజ్ఞానం లేని జాతి ఎలా ఎదుగుతుంది అన్న వేదన ధ్వనిస్తుంది. ఇరానియన్ స్త్రీలు అనుభవించిన అణచివేత, స్వేచ్ఛకోసం వారు పడిన తపనని ప్రతిబింబించే బీటా మత్స్యకన్యగా నిస్సహాయంగా ఉన్నప్పుడు, ఆ మత్స్యకన్యను సైతం బలాత్కరించడానికి ప్రయత్నించి చంపేయడం సమాజపు దౌర్జన్యం. సంఘర్షణల నుంచి తప్పుకున్న పలాయనవాదినేమోనన్న మీమాంసతో హుషాంగ్ పడే బాధ సగటు మనిషి బాధ. నవల చివర్లో ‘‘మనకెవరికీ పిల్లలు లేకపోవడం అదృష్టం. ఎందుకంటే, ఈ ప్రపంచంలో పిల్లలకి రక్షణ లేదు,’’ అన్న సోరాబ్ మాటలు భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోందనడానికి సూచన. రచయిత్రి తన దేశాన్నుంచి రాజకీయ శరణార్థిగా ఆస్ట్రేలియాకి వెళ్లవలసి రావడం, అనువాదకుడు తన పేరు చెప్పడానికి నిరాకరించడం కూడా అలాంటి సూచనలే. కానీ– ఇలాంటి నవలలు ఎలాగోలా ప్రజల మధ్యకి రావడం మాత్రం వాంఛనీయం! నవల: ది ఎన్లైటెన్మెంట్ ఆఫ్ ద గ్రీన్‌గేజ్ ట్రీ రచయిత్రి: షొకుఫే అజా పార్సీ నుంచి ఇంగ్లిష్: ‘అనామకుడు’ ప్రచురణ: 2017 పద్మప్రియ -
నటి కిడ్నాప్ కేసు; అతడిని సస్పెండ్ చేయాల్సిందే!
తిరువనంతపురం : నటుడు దిలీప్ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా అన్న అంశమై తుది నిర్ణయాన్ని అక్టోబర్ 9లోగా చెప్పాలని నటి రేవతి అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)కు లేఖ రాశారు. ప్రముఖ వర్ధమాన నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని అసోసియేషన్ నుంచి తొలగించాలంటూ పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ విషయమై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రేవతి, పద్మప్రియ, పార్వతిలు అసోసియేషన్‌కు లేఖ రాశారు. ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించే వరకు అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి : ‘మలయాళ వెండితెర’పై మరక!) ఈ క్రమంలో దిలీప్ విషయంలో కమిటీ నిర్ణయాన్ని తప్పుపట్టిన రేవతి.. గతంలో ఇలా క్రమశిక్షణలు ఉల్లంఘించిన వారిని సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దిలీప్ కేసు విషయమై నిర్ణయాన్ని తెలపాలంటూ ఇది వరకు రెండు సార్లు లేఖ రాసినా సమాధానం రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నటి కిడ్నాప్, వేధింపుల కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను ‘అమ్మ’లో తిరిగి చేర్చుకోవడాన్ని అసోసియేషన్‌కు చెందిన పలువురు బహిరంగంగానే విమర్శించారు. నటికి సాయం చేయాలన్నా, ఆమెకు నిజంగా న్యాయం జరగాలంటే దిలీప్‌ను అసోసియేషన్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని పలువురు సెలబ్రిటీలు కోరినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా రేవతి లేఖతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
పులి వేటాడినట్టే!
పటేల్ ఓ పది మందిని కొడితే... అచ్చం అడవిలో జింకలను పులి వేటాడినట్టే ఉంటుంది. ఏదో క్రూరమృగం దాడి చేసినట్టు పదిమంది శవాలు చెల్లాచెదురుగా పడతాయి. అటువంటి పటేల్ ఓ చిన్నారి పిలిచేసరికి చిన్న పిల్లాడిలా మారతాడు. చిన్నారితో ఆటలు ఆడతాడు, ప్రేమను పంచుతాడు. ఇతడి కథను ఈ నెల్లోనే చూపిస్తామంటున్నారు దర్శకుడు వాసు పరిమి. ఆయన దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన సినిమా ‘పటేల్ సార్’.వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మాణ సార«థ్యంలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ స్టైలిష్ రివెంజ్ డ్రామాలో జగపతిబాబు ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. సాయి కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో జగపతిబాబు లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలుస్తాయి. వాసు పరిమి టేకింగ్ సూపర్. సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్‌ను యూట్యూబ్‌లో 27 లక్షల మంది చూశారంటే సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పద్మప్రియ, తాన్యా హోప్, ‘బేబీ’ డాలీ, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, ‘శుభలేఖ’ సుధాకర్, కబీర్ సింగ్, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వసంత్. -
నటనపై ఆకలిగా ఉన్నా!
తమిళసినిమా: నటనపై ఆకలిగా ఉన్నానని, ఎలాంటి పాత్రయినా చేడానికి రెడీ అని అంటోంది నటి పద్మప్రియ. పెళ్లి తరువాత రీఎంట్రీ అయిన నటి జ్యోతిక, అమలాపాల్, మంజువారియర్ వంటి నటీమణులు కథానాయికలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంతకు ముందు తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో నాయకిగా రాణించిన నటి పద్మప్రియ కెరీర్లో తవమాయ్ తవమిరిందు, మృగం, పట్టియల్ వంటి సక్సెస్ఫుల్ తమిళ చిత్రాలు ఉన్నాయి. 2014లో జాస్మిన్షా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. అప్పట్లో గ్లామర్ తన వంటికి నప్పదు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఈ అమ్మడికి తాజాగా మళ్లీ నటనపై ఆశ పుట్టిందట. అంతే కాదు ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం అని అంటోంది. ప్రస్తుతం పటేల్‌సర్ అనే తెలుగు చిత్రంలో జగపతిబాబుతో కలిసి నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.ఆయనకు జంటగా 15 ఏళ్ల క్రితమే నటించే అవకాశం వచ్చిందని, అప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయానని, మళ్లీ ఇప్పుడు అవకాశం రావడం సంతోషంగా ఉందని అంది. ఇకపై నటనపై దృష్టిసారించి ఎక్కువ చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పద్మప్రియ చెప్పింది. -
ఆ విషయం చెప్పను
వ్యక్తిగత విషయాలను ఎందుకు చెప్పాలి అంటున్నారు నటి పద్మప్రియ. స్నేహం వేరు, కుటుంబం వేరు. నా కుటుంబ సభ్యుల గురించి, సొంత వ్యవహారాల గురించి ఎవరికీ చెప్పే ప్రసక్తే లేదని, అలా చెప్పడం నాకు ఇష్టం ఉండదని ఈ మలయూళీ భామ స్పష్టం చేసింది. అసలు విషయం ఏమిటంటే, ఈమె ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లికి తమను ఆహ్వానంచ లేదని కొందరు సినీ స్నేహితులు కినుకు వహించారట. దీంతో స్పందించిన పద్మ ప్రియ నా ప్రేమ, పెళ్లి, భర్త తదితర విషయాలను ఎవరికీ చెప్పదలచుకోలేదన్నారు. ఈ మధ్య అమెరికా నుంచి చెన్నైకు తిరిగి వచ్చిన పద్మప్రియ మాట్లాడుతూ, తాను వివాహమైన వారంలోనే పై చదువుల కోసం అమెరికా వెళ్లానన్నారు. మే 28న పట్టా అందుకోనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతానని తెలిపారు. ఇప్పటికే తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అవకాశాలు వస్తున్నాయని వివరించారు. అయితే, ప్రస్తుతానికి ఏ ఒక్క అవకాశాన్ని అంగీకరించ లేదని తెలిపారు. సినిమాల్లో నటించడానికి తన భర్త ఎలాంటి అభ్యంతరం తెలపలేదని పేర్కొన్నారు. ఆయన అంగీకారంతోనే మళ్లీ నటిస్తానని తెలిపారు. వివాహానికి ముందు ఎలాంటి మంచి చిత్రాలను, పాత్రలను ఎంపిక చేసుకున్నానో, ఇప్పడు కూడా అదే బాణీ అనుసరిస్తానని పేర్కొన్నారు. -
పద్మప్రియ ప్రేమ వివాహం
చెన్నై: ప్రముఖ నటి పద్మప్రియ తన చిరకాల మిత్రుడు జాస్మిన్ షాను ప్రేమ వివాహం చేసుకుంది. బుధవారం ముంబైలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. న్యూయార్క్, కొలంబియా యూనివర్శిటీలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో పద్మప్రియ, జాస్మిన్ల మధ్య స్నేహాం చిగురించింది. అదికాస్త ప్రేమగా మారింది. ఆ విషయాన్ని రెండు కుటుంబాలలోని పెద్దలకు తెలిపారు. అందుకు వారి అంగీకరించారు. దాంతో బుధవారం పద్మప్రియ, జాస్మిన్ ఒక్కటయ్యారు. శ్రీను వాసంతి లక్ష్మి, అందరి బంధువయ చిత్రాలలో నటించిన పద్మప్రియ.... ఇప్పటి వరకు దక్షిణాది భాషల్లో 48 చిత్రాలలో నటించింది. హిందీ, బెంగాలీ భాషల్లో ఒక్కొ చిత్రంలో ఆమె నటించారు. పద్మప్రియ నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. వీటితోపాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఒక్కసారి, మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. పద్మప్రియా వివాహం అనంతరం నటిస్తారని ఆమె మీడియా మేనేజర్ వెల్లడించారు. -
తల్లి సంరక్షణకు గౌతమ్
కోడెల కోడలు పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మనవడు గౌతమ్‌ను అతడి తల్లి పద్మప్రియ సంరక్షణలోనే ఉంచుతూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలిసుండేందుకు పద్మప్రియ, ఆమె భర్త శివరామకృష్ణ అంగీకరించిన నేపథ్యంలో విశాఖపలో తగిన ఇల్లు చూసుకుని ఉండాలని, అధిక బరువు (ఓబేసిటీ)తో బాధపడుతున్న గౌతమ్‌కు విశాఖలోనే చిన్నపిల్లల డాక్టర్ వద్ద చికిత్స అందించాలని పేర్కొంది. గౌతమ్‌ను చూసేందుకు (పద్మప్రియ తండ్రి)ని అనుమతించాలని దంపతులకు స్పష్టం చేసింది.అతని తండ్రి శివరామకృష్ణను అత్తమామలు కాని, భార్య కాని నిరోధించడానికి వీల్లేదని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలుకు అక్టోబర్ 10కి వాయిదా వేసింది. ‘నా కొడుకును భర్త కిడ్నాప్ చేశారు.అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించండి’ అంటూ పద్మప్రియ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం తెలిసిందే. కోడెల ఇంట్లో ఉన్న గౌతమ్‌ను కోర్టు ఆదేశంతో శుక్రవారం ఏపీ అడ్వకేట్ జనరల్ పి.వేణుగోపాల్ గౌతమ్‌ను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. -
నా కుమారుడిని కిడ్నాప్ చేశారు
హైకోర్టులో ఏపీ స్పీకర్ కోడెల కోడలు హెబియస్ కార్పస్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు కుమారుడు కె.శివరామకృష్ణ తన నాలుగేళ్ల కుమారుడిని అపహరించారని, తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శివప్రసాదరావు కో డలు పద్మప్రియ బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కోడెల కుమారుడు కె.శివరామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖపట్నం ఎస్పీ, విశాఖపట్నం త్రీటౌన్ సీఐలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘నా భర్త శివరామకృష్ణకు ఇంతకు ముందే పెళ్లైందని, హింస భరించలేకే మొదటి భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని తెలిసింది. వీరి హింస, బాధలు భరించలేక నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో నేను నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాను. 2010 అక్టోబర్ 18న నేను మగబిడ్డకు జన్మనిచ్చాను. ఈ నెల 17న నా తండ్రి ఇంటిలో లేని సమయంలో శివరామకృష్ణ, జయలక్ష్మీ సీఫుడ్స్ అధినేత కె.రమేష్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సూరపనేని కోటేశ్వరరావు, వైజాగ్‌కు చెందిన కోనేరు సురేష్, ఇండో అమెరికన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుమతి, ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రికి చెందిన జితేంద్ర కలిసి మా ఇంటికి వచ్చి నా కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.’ అని ఆమె తన హెబియస్ కార్పస్ పిటిషన్లో పేర్కొన్నారు. -
స్పీకర్ కోడెల మనవడు కిడ్నాప్
అర్ధరాత్రి భర్తే దాడి చేసి కొడుకును కిడ్నాప్ చేసినట్లు భార్య ఫిర్యాదు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు శివరామకృష్ణ బుధవారం అర్ధరాత్రి దౌర్జన్యానికి దిగారు. విశాఖపట్నం త్రీటౌన్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తన భార్య ఇంటిపై దాడి చేశారు. నలుగురితో కలసి ఇంటి తలుపులు పగలగొట్టి అత్తమామలను బెదిరించి తన కుమారుడు గౌతమ్(4)ను కిడ్నాప్ చేసినట్టు భార్య పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009 ఆగస్టులో తనకు శివరామకృష్ణతో వివాహం జరిగిందని, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరిగాయని అందులో పేర్కొన్నారు. కోడెల భార్య, కుమార్తె కూడా తనను వేధించేవారని ఆమె ఆరోపించారు. 2010లో బాబు పుట్టిన తర్వాత కూడా తనను పలుమార్లు ఇంటి నుంచి గెంటేశారని, ఇటీవల కోడెల అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు అధికమయ్యాయని పద్మప్రియ పేర్కొన్నారు. దీంతో ఏడాదిగా విశాఖలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం అర్థరాత్రి శివరామకృష్ణ తన అనుచరులతో దాడి చేసి బాబును కిడ్నాప్ చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ మహేష్, త్రీటౌన్ సీఐ వెంటనే బాధితురాలి ఇంటికి వచ్చి విచారణ ప్రారంభించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
స్పీకర్ కోడెల మనవడు కిడ్నాప్
-
వేధిస్తున్నారని భార్య, అత్త హత్య
సికింద్రాబాద్‌లో ఘటన సాక్షి, హైదరాబాద్: తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారనే కారణంతో ఓ వ్యక్తి తన భార్యను, అత్తను హతమార్చిన ఘటన సికింద్రాబాద్‌లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సికింద్రాబాద్ సెకండ్బజార్కు చెందిన శరవణన్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను 2010లో బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తుండగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పద్మప్రియతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. అయితే కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి గొడవలు రేగాయి. దీంతో ఆమె భర్తతోపాటు అతని కుటుంబ సభ్యులు 15 మందిపై బెంగళూరులో 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టింది. అతన్ని ఉద్యోగం నుంచి కూడా తీసేయించింది. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన శరవణన్ సికింద్రాబాద్‌లోని సెకండ్‌బజార్‌లో ఉంటున్నాడు. పద్మప్రియకు అంతకుముందే మరోవ్యక్తితో పెళ్లి జరిగిన విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. పద్మప్రియ బెంగళూరులో కోర్టుకెళ్లి భర్త తనతో సంసారం చేసేలా ఉత్తర్వులివ్వాలని పిటిషన్ వేసింది. తనకు అనుకూలంగా తీర్పు రావడం తో హైదరాబాద్‌కు వచ్చిన పద్మప్రియ.. భర్తతో కలిసి సెకండ్‌బజార్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది. పోలీసుల జోక్యం తో కొద్దిరోజులు కాపురం సజావుగా సాగింది. అయితే శరవణన్‌తోపాటు అతని కుటుంబసభ్యులతో నిత్యం గొడవ పడేది. దీంతో శరవణన్ తన తల్లితో కలిసి శివాజీనగర్‌లో విడిగా ఉంటున్నాడు. మరోవైపు పద్మప్రియ తన తల్లి పరమేశ్వరి(60)తో కలిసి ఉంటోంది. భార్య నుంచి నిత్యం వేధింపులు ఎదురవుతుండటం, కుటుంబ సభ్యులందరికీ మనశ్శాంతి కరువవడంతో ఆమెను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చిన శరవణన్ తన సోదరుడు అయ్యప్ప, మేనమామ అంగముత్తులతో కలిసి పథకరచన చేశాడు. ఈలోగా బుధవారం రాత్రి 11.45 గంటల సమయంలో అంగముత్తు ఇంట్లో ఉన్న అతని కోసం పద్మప్రియ తన తల్లితో కలిసి వచ్చి గొడవకు దిగింది. అత్త అదే పనిగా తిట్టడంతో ఆగ్రహించిన శరవణన్ భార్య,అత్తను ఇనుపరాడ్‌తో తలపై కొట్టాడు. అనంతరం చున్నీని మెడకు బిగించి చంపాడు. కేసు దర్యాప్తులో ఉంది.