
పద్మప్రియ, జాస్మిన్ షా
చెన్నై: ప్రముఖ నటి పద్మప్రియ తన చిరకాల మిత్రుడు జాస్మిన్ షాను ప్రేమ వివాహం చేసుకుంది. బుధవారం ముంబైలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. న్యూయార్క్, కొలంబియా యూనివర్శిటీలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో పద్మప్రియ, జాస్మిన్ల మధ్య స్నేహాం చిగురించింది. అదికాస్త ప్రేమగా మారింది. ఆ విషయాన్ని రెండు కుటుంబాలలోని పెద్దలకు తెలిపారు. అందుకు వారి అంగీకరించారు. దాంతో బుధవారం పద్మప్రియ, జాస్మిన్ ఒక్కటయ్యారు.
శ్రీను వాసంతి లక్ష్మి, అందరి బంధువయ చిత్రాలలో నటించిన పద్మప్రియ.... ఇప్పటి వరకు దక్షిణాది భాషల్లో 48 చిత్రాలలో నటించింది. హిందీ, బెంగాలీ భాషల్లో ఒక్కొ చిత్రంలో ఆమె నటించారు. పద్మప్రియ నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. వీటితోపాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఒక్కసారి, మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. పద్మప్రియా వివాహం అనంతరం నటిస్తారని ఆమె మీడియా మేనేజర్ వెల్లడించారు.