ఆ విషయం చెప్పను | Padmapriya gets married in a quiet Arya Samaj ceremony | Sakshi
Sakshi News home page

ఆ విషయం చెప్పను

Published Tue, Jan 6 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

ఆ విషయం చెప్పను

ఆ విషయం చెప్పను

 వ్యక్తిగత విషయాలను ఎందుకు చెప్పాలి అంటున్నారు నటి పద్మప్రియ. స్నేహం వేరు, కుటుంబం వేరు. నా కుటుంబ సభ్యుల గురించి, సొంత వ్యవహారాల గురించి ఎవరికీ చెప్పే ప్రసక్తే లేదని, అలా చెప్పడం నాకు ఇష్టం ఉండదని ఈ మలయూళీ భామ స్పష్టం చేసింది. అసలు విషయం ఏమిటంటే, ఈమె ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లికి తమను ఆహ్వానంచ లేదని కొందరు సినీ స్నేహితులు కినుకు వహించారట. దీంతో స్పందించిన పద్మ ప్రియ నా ప్రేమ, పెళ్లి, భర్త తదితర విషయాలను ఎవరికీ చెప్పదలచుకోలేదన్నారు.
 
 ఈ మధ్య అమెరికా నుంచి చెన్నైకు తిరిగి వచ్చిన పద్మప్రియ మాట్లాడుతూ, తాను వివాహమైన వారంలోనే పై చదువుల కోసం అమెరికా వెళ్లానన్నారు. మే 28న పట్టా అందుకోనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతానని తెలిపారు. ఇప్పటికే తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అవకాశాలు వస్తున్నాయని వివరించారు. అయితే, ప్రస్తుతానికి ఏ ఒక్క అవకాశాన్ని అంగీకరించ లేదని తెలిపారు. సినిమాల్లో నటించడానికి తన భర్త ఎలాంటి అభ్యంతరం తెలపలేదని పేర్కొన్నారు. ఆయన అంగీకారంతోనే మళ్లీ నటిస్తానని తెలిపారు. వివాహానికి ముందు ఎలాంటి మంచి చిత్రాలను, పాత్రలను ఎంపిక చేసుకున్నానో, ఇప్పడు కూడా అదే బాణీ అనుసరిస్తానని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement