![Actress Padmapriya: We wanted a Baby](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Padma%20Priya.jpg.webp?itok=V_FPPQ3c)
పద్మప్రియ (Padmapriya Janakiraman).. ఒకప్పుడు మలయాళంలో టాప్ హీరోయిన్. తెలుగులో శీను వాసంతి లక్ష్మి (Seenu Vasanthi Lakshmi Movie), అందరి బంధువయ, పటేల్ సర్ చిత్రాల్లోనూ నటించింది. ఈమె తన చిరకాల మిత్రుడు జాస్మిన్ షాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లై రెండు దశాబ్దాలవుతున్నా వీరికి ఇంతవరకు సంతానం లేదు. ఆ ఒక్క ముచ్చట కూడా తీరిపోయుంటే తన జీవితం మరింత సంతోషమయమై ఉండేదంటోంది పద్మప్రియ.
ఎన్నో చేయాలనుకున్నా..
తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ముచ్చట్లను పంచుకుంది. పద్మప్రియ మాట్లాడుతూ.. ఎన్నో సినిమాలు చేయాలనుకున్నాను. కానీ అదే సమయంలో బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నటిగా నా ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పటికీ మంచి అవకాశాలు అంత త్వరగా వచ్చేవి కావు. అందుకే బ్రేక్ తీసుకున్నాను. అంతేకాదు.. ముప్పై దాటిందంటే హీరోయిన్లు కనుమరుగవుతూ ఉంటారు. అందుకే నా అంతట నేనే సైడ్ అయిపోయా!
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/PADMA.jpg)
పిల్లలు కావాలనుంది
అయినా ఇలాంటి బ్రేక్స్ తీసుకోవడం యాక్టర్స్‌కు అవసరం అని నా అభిప్రాయం. ఇప్పుడైతే నాకు పిల్లలు కావాలనుంది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉంది. ఒకప్పుడు పెళ్లే వద్దనుకున్నాను.. కానీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాను. సినీ ఇండస్ట్రీలోకి రాకూడదనుకున్నాను.. కానీ వచ్చాను. బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా మళ్లీ సినిమాలు చేయొద్దనుకున్నాను కానీ చేశాను. అందుకే జీవితం ఎప్పుడు? ఎలా? ఎటువైపు మలుపు తిరుగుతుందో మనం చెప్పలేం అంటోంది పద్మప్రియ.
సినిమా
ఈమె అమృతం, కరుత పక్షికల్, మిరుగం, పళస్సి రాజాచ తమాషు, ఒరు తెక్కన్ తల్లు కేస్ వంటి మలయాళ చిత్రాలతో పాటు తంగ బీన్‌కల్, క్రాస్‌రోడ్ వంటి తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. 2014లో జాస్మిన్ షాను పెళ్లాడింది.
Comments
Please login to add a commentAdd a comment