padma priya
-
చిత్ర పరిశ్రమలో కలకలం.. సినీ దర్శకుడిపై ఫిర్యాదు
నటి మొబైల్ నంబర్ ఇవ్వకుంటే నీ భార్యను మానభంగం చేస్తానని బెదిరించిన దర్శకుడిపై చాయాగ్రాహకుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. రామాపురంపోలీసుల కథనం మేరకు.. రామాపురం, భారతీవీధికి చెందిన ఎంఎస్ ప్రభు 30 ఏళ్లుగా సినీ చాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు. ఏఎల్ సూర్య ఇతనికి 2006లో ఏఎల్ సూర్య అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. నటి పద్మప్రియతో భారతీయార్ పాటను వీడియోగా రూపొందించి ఇవ్వాల్సిందిగా సూర్య అడిగాడు. ఆ వీడియోలు రూపొందించి ఇవ్వడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే కొంతకాలం తర్వాత దర్శకుడు ఏఎల్ సూర్య తనకు నటి పద్మప్రియను పరిచయం చేయాల్సిందిగా ప్రభును కోరాడు. ఆమె ఫోన్ నంబర్ ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఎందుకని ప్రశ్నించడంతో గొడవ పడ్డాడు. పద్మప్రియ ఫోన్ నంబర్ ఇవ్వకుంటే నీ భార్యను మానభంగం చేస్తానని బెదిరించారని బాధితుడు ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చదవండి: (తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్) -
కొత్త బంగారం.. అయన్‌త్రితము
నవల: నవల: ది అడ్వెంచర్స్ ఆఫ్ చీనా అయన్ రచన: గాబ్రియాలా కాబసోన్ కమారా మూల ప్రచురణ: 2017 స్పానిష్ నుంచి ఇంగ్లిస్: ఫియోనా మాకింటోష్, అయోనా మాకింటైర్ ‘‘మనకు గుర్తున్నదే అసలు జరిగిన విషయమా? లేకపోతే ఏళ్ల తరబడి మళ్లీమళ్లీ తలచుకోవడంతో ఆ జ్ఞాపకం రూపుమారి, జీవం లేకపోయినా తళుకులీనుతున్న వజ్రపురాయిలా మారుతుందా?’’ తన జ్ఞాపకాలకు అసలైన రూపం ఇస్తున్నానా లేదా అని ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ చీనా అయన్’ నవలలోఎపిఫనస్ కథకురాలు చీనా అయన్ వేసుకునే ప్రశ్న ఇది. లాటిన్ అమెరికన్ రచయిత్రి గాబ్రియాలా కాబసోన్ కమారా స్పానిష్ భాషలో రాసిన ఈ నవలను ఫియోనా మాకింటోష్, అయోనా మాకింటైర్ ఇంగ్లీషులోకి అనువదించారు. 19వ శతాబ్దంలోఅర్జెంటీనా తమ దేశంలోని వివిధ రంగాల అభివృద్ధి కోసం యురోపియన్లకు తలుపులు తెరవడంతో వేలాదిగా యురోపియన్లు ఆ దేశంలోకి అడుగుపెట్టారు. వలస యురోపియన్లు అక్కడి భూములని ఆక్రమించి ఆ దేశపు సంచారజాతి ప్రజలైన గౌచోలనూ, ఇండియన్లనూ నిర్బంధ సైనికులుగా తీసుకుని ఆ పనులని బలవంతంగా చేయించారు. ఆ చరిత్రే ఈ నవలకి నేపథ్యం. అనాథ అయిన చీనాని చేరదీసి పెంచిన తల్లిదండ్రులు చివరికి ఆమెని బానిస లాగానే చూస్తారు. నిరాదరణకు గురైన చీనా మరో అనాథని ప్రేమిస్తుంది. తాగిన మైకంలో ఉన్న పెంపుడు తండ్రి, చీనాని పణంగా పెట్టి మార్టిన్ ఫియేరోతో జూదమాడి ఓడిపోతే, పందెం గెలిచిన ఫియేరో, చీనాని పెళ్లి చేసుకుంటాడు. వివాహానంతరం చీనా ప్రేమికుడు హత్యకి గురైనప్పుడు, తన భర్తే ఆ హత్య చేశాడని తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహయత చీనాది. నిర్బంధ సైనికులుగా అందర్నీ తీసుకెళ్లిపోతున్న ఆ కాలంలో ఫియేరోతో సహా పొరపాటున యురోపియన్ అయిన ఆస్కార్‌ని కూడా తీసుకెళ్తారు అధికారులు. పధ్నాలుగేళ్లకే ఇద్దరు పిల్లలకి తల్లి అయిన చీనా– బలవంతపు వివాహం, ప్రేమికుడి హత్య, భర్త నిర్బంధం, పేదరికం, బాధ్యతలతో విసుగుచెంది పిల్లలను తెలిసిన వాళ్లకి అప్పగించి – స్వేచ్ఛాజీవనంలోకి అడుగుపెట్టినప్పుడు ఆస్కార్ భార్య లిజ్ తారసపడుతుంది. భర్తనీ, చూసుకోవలసిన ఎస్టేట్‌నీ వెతుక్కుంటూ బయలుదేరిన లిజ్, తనకు తోడుగా స్పానిష్ మాట్లాడగలిగిన చీనాని రమ్మంటుంది. ఆ ప్రయాణంతో ‘‘నాకు ప్రపంచ ద్వారాలు తెరిచినట్టయింది,’’ అంటుంది చీనా. యూరప్ నుంచి వచ్చి, భూమిని సంపాదించి రైలుమార్గాలు వేయాలనీ, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే ఆలోచనల్లో ఉన్న కల్నల్‌ని కలుస్తుంది లిజ్, చీనాతో కలిసి. మాటల మధ్యలో కల్నల్ అక్కడినుంచి పారిపోయిన కవీ, గాయకుడూ అయిన ఒక నిర్బంధ సైనికుడి గురించి చెబుతూ అతని పాటను వినిపించినప్పుడు, ఆ సైనికుడు తన భర్తే అని అర్థమై, ఇప్పుడు భర్త ఎదురైతే జీవితం మళ్లీ మొదటికొస్తుందేమోనన్న భయం కలుగుతుంది చీనాకి. ఫోర్ట్‌లో దాష్టీకాలకు గురవుతున్న కొంతమందిని తప్పించి, కల్నల్‌కి వీడుకోలు చెప్పి ప్రయాణాన్ని కొనసాగించిన చీనా, లిజ్‌ల అనంతర ప్రయాణం మిగతా కథ. జ్ఞాపకాలకి చరిత్ర, కాలం ఉన్న కారణంగానేమో చారిత్రాత్మక, యాత్రా సాహిత్యాల ధోరణులు రెండూ ఈ నవలలో కనిపిస్తాయి. అర్జెంటీనా సాహిత్యంలో అత్యుత్తమ కావ్యంగా గుర్తింపబడిన ‘ఎల్ గౌచో మార్టిన్ ఫియేరో’ ఈ నవలకి ప్రేరణ. మూలకథని మార్చి చీనా పరంగా, ఆమె గొంతుకి చోటిచ్చి కథని రాయటం ఇందులోని ప్రత్యేకత. ఈ కథ– స్త్రీగా తన లైంగికతని కాపాడుకుంటూ, ప్రపంచాన్ని ఆకళింపు చేసుకుంటూ ఎదిగిన చీనా కథ మాత్రమే కాదు, ఎల్‌జిబిటీక్యు ఆంకాక్షలను స్పృశించిన కథ కూడా. స్పానిష్ భాషలోని మాండలికాలూ, జీవవంతమైన ప్రకృతి వర్ణనలూ, ‘ఎల్ గౌచో మార్టిన్ ఫియేరో’ కావ్యపోకడతో రాసిన కవిత్వమూ అనువదించటానికి చాలా కృషి చేయవలసి వచ్చిందంటారు అనువాదకులు. అణచివేతల జీవితాల్లోనుంచి ఆశావహ దృక్పథంతో కదిలి, రసవంతమైన జీవనాల్లోకి మేల్కొనడం కథావరణమైతే, అణచివేత గురించి సున్నితంగా మాత్రమే చెబుతూ కథను నడపటం రచయిత్రి వైశారద్యం. ఈ నవల ఈ యేడాది బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్‌కి షార్ట్‌లిస్ట్ అవడానికి ఇవన్నీ బలమైన కారణాలు అయివుంటాయి! -పద్మప్రియ -
జీవిత చిత్రంలో ఖాళీలు
నవల : ఇన్‌డెలికసీ రచన : అమీనా కెయిన్ ‘‘మళ్లీ ఒంటరితనం– వింతగా ఉందిప్పుడు. నా మధ్యాహ్నాలన్నీ నాక్కావలసిన దానికంటే ఎక్కువ విస్తారంగా ఉన్నాయి. నాతో నాకు కావలసినంత ఏకాంత సమయం, తోడుగా ఉన్న రచనాన్వేషణలో నాలో నన్ను కనుక్కుంటూ నేను...’’ మనిషి తన చేతనతో మమేకమవడానికీ, తన అస్తిత్వాన్ని గుర్తెరగడానికీ చేసే ప్రయత్నాన్నీ, ప్రయాణాన్నీ ఒక కవితాత్మక కథగా చెప్పగలగటం అమెరికన్ రచయిత్రి అమీనా కెయిన్ రాసిన తొలి నవల ‘ఇన్‌డెలికసీ’లో సాధించడం చూస్తాం. గత నెలలోఎఫ్.ఎస్.జి. ద్వారా ప్రచురింపబడిందీ పుస్తకం. ఒక మ్యూజియమ్‌లోని ఆర్ట్ గాలరీలో పెయింటింగ్స్, గదులూ శుభ్రం చేసే చిరుద్యోగి విటోరియా. గతకాలాల ఇరుకుదనాన్ని పట్టించుకోకుండా, ఉన్నంతలో ఒంటరిగా ధైర్యంగా హాయిగా బ్రతుకుతున్న వ్యక్తి. ఉద్యోగమూ, సంపాదనా తృప్తినివ్వకపోయినా జీవితంలోని స్వేచ్ఛని ఆస్వాదిస్తూ ఉంటుంది. రచయిత్రి కావాలన్న కోరికకు డబ్బూ సమయమూ రెండూ కరువైనా, ప్రతిరోజూ చూసినవాటి గురించి రాసుకుంటూ ఏనాటికైనా ఒక పుస్తకం ప్రచురించాలన్న ఆశతో ఉంటుంది. ఇంతలో, ఆర్ట్ గాలరీ చూడటానికి వచ్చిన ఒక సంపన్నుడు విటోరియాని పెళ్లిచేసుకుంటాడు. వివాహమైన తరవాత విటోరియాకి ప్రేమగా చూసుకునే భర్తతో పాటు తనకంటూ గదీ, రాసుకోవటానికి సమయం, స్వేచ్ఛ దొరుకుతాయి. ఈత కొట్టడం, బాలెరీనాలు చూడటం నేర్చుకోవటం వగైరాలు చేస్తూంటుందామె. కళల పట్ల ఆసక్తీ, తనకేం కావాలో తెలుసుకోవాలన్న తపనా, చూసిన విషయాల గురించి రాసే అలవాటూ ఆమెని వదిలిపెట్టవు. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఏదో అసంతృప్తికి లోనవుతుంటుంది. రచయిత్రులంటేనే చిన్నచూపు ఉన్న భర్తకు తన రాతలపట్ల కూడా గౌరవం లేదని ఆమెకు తెలుసు. దీనికితోడు ఇంటి మెయిడ్ అయిన సొలాంజ్తో ఆమెకు సఖ్యత ఏర్పడదు. తనకున్న తపనకు ఇంటి బాధ్యతలు, భర్త స్నేహితులూ, వాళ్లతో పార్టీలూ అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆమెకు. ఇవన్నీ అర్థం చేసుకోని భర్త వల్ల విటోరియా ఒంటరితనానికి గురై, సంసార జీవితానికి కూడా దూరంగా ఉంటూ, భర్తనుంచి విడిపోవాలని అనుకుంటుంది. విడిపోయినా, మళ్లీ ఉద్యోగం చేసే అవసరం లేకుండా ఉంటే బావుండునని అనుకుంటున్నప్పుడే, భర్తకూ సొలాంజ్కూ మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. వారి బంధానికి పరోక్షంగా కారణం తనే అయినా, భర్తనుంచి విడిపోవడానికే సుముఖత చూపిస్తుంది. మళ్లీ ఒంటరి జీవితం– కానీ, ఈసారి చాలినంత డబ్బు, రాసుకునే తీరికా, ఇతర బాధ్యతలేమీ లేని జీవితం మొదలవడంతో కథ ముగుస్తుంది. విటోరియా ఉద్యోగస్తురాలైనప్పుడూ, వివాహమైనప్పుడూ, భర్తనుంచి విడిపోయిన తరువాతా– ఎప్పూడూ తనదైన పద్ధతిలోనే స్వేచ్ఛామార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. పెయింటింగ్స్ పరిశీలించటం, వాటిలో తన ఆలోచనలనూ ఆశలనూ వెతుక్కోవడం విటోరియాకి ఇష్టమైన వ్యాపకం. ‘‘నేను మ్యూజియంలో పనిచేస్తున్నప్పుడు ఒకోసారి కిటికీలోంచి బయటకి చూస్తూ నిలబడిపోయేదాన్ని. కిటికీ అద్దాల్లో నా వెనక ఉన్న పెయింటింగ్స్ ప్రతిఫలించేవి– నాతో సహా. వాటితోపాటు నన్నలా చూసుకోవటం ప్రత్యేకంగా అనిపించేది. ఇంకోలా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నట్టు, నన్ను నేను సరికొత్తగా చూసుకుంటున్నట్టు,’’ అంటుంది విటోరియా. పెయింటింగ్స్‌లో చిత్రంతో బాటు పక్కనే ఉన్న ఖాళీలూ, ఆ ఖాళీలను నింపిన వర్ణాలు కూడా ఏదో చెప్తున్నట్టే తోచేదామెకు. విటోరియా జీవిత చిత్రంలో పెయింటింగ్స్ ఒక వర్ణంలా కలిసిపోతే, రచనా జీవితంలోని పదాలు అంతరంగపుటావిష్కరణలు. తనలో ఉన్న అసంపూర్ణతల గురించి విటోరియాకి స్పృహ లేకపోలేదు. ఏకపక్షపు నిర్ణయాలతో భర్తని దూరం చేసుకోవడం, వివాహం అక్కర్లేకపోయినా దాన్నుంచి వచ్చే భరణాన్ని మాత్రం ఆశించడం లాంటివి విటోరియాని మరీ ఎక్కువగా ఆదర్శవంతం చేయకుండా, సగటు వ్యక్తి స్థాయిలో నిలిపే వాస్తవ ప్రయత్నం చేస్తుంది నవల. సౌజన్యం కొంతమేరకు కొరవడిన పాత్రతో నవలకి ‘ఇన్‌డెలికసీ’ అన్న పేరూ, వ్యక్తిత్వపు ఛాయల సమతూకం సాధించిందన్న పేరుకి నవలా ఒకదానికొకటి సరిపోయాయి! - పద్మప్రియ -
ప్రియమైన గెలుపు
మనిషి డిజేబుల్డ్ అయినా పర్లేదు.. జీవితం డిజేబుల్డ్ కాకూడదు! సమస్యలు శక్తిని పెంచాలే తప్ప.. ప్రయాణాన్ని ఆపేలా చేయకూడదు! బతుకుబండి పాస్, ఫెయిల్యూర్లతో కాదు.. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో నడవాలి చివరిశ్వాస వరకూ ఆస్వాదించాలి.. ఇది పద్మప్రియ నమ్మి, ఆచరిస్తున్న బాట!! ఆమె.. గాయని.. థియేటర్ ఆర్టిస్ట్.. జీవితం విసిరిన ప్రతి సవాలుకు జవాబు ఇస్తూ ముందుకు వెళ్తున్న ఫిజికల్లీ చాలెంజ్డ్ విజేత... ‘నా పేరు పద్మప్రియ. చూస్తున్నారుగా నన్ను? చక్రాల కుర్చీలేందే కదల్లేను. అయినా మిమ్మల్ని కలుసుకోవాలి.. మీతో మాట్లాడాలి అన్న ఆశ.. ఆ ఇబ్బందులన్నిటినీ అధిగమించేలా చేసి ఇదిగో ఇలా మీ దగ్గరకు చేర్చింది. నాతో ఉన్న ఈ ఇరవైమందీ నా లాంటివాళ్లే. ఒకరు వినలేరు.. మరొకరు మాట్లాడలేరు.. ఇంకొకరు చూడలేరు.. కండరాలు బిగుసుకుపోయి ఒకరు.. అవయవాలన్నీ అచేతనమై మరొకరు.. ఒక్కోరిదీ ఒక్కో సమస్య. అయినా మేం ఎక్కడా ఆగలేదు. ఆత్మహత్య అన్న ఆలోచనే చేయలేదు. ఇదేం బతుకురా దేవుడా అని మా మీద మేం జాలి పడలేదు. ప్రతిరోజూ కొత్త ఉదయాన్ని చూస్తామన్న నమ్మకంతో నిద్రపోతాం. కనిపించిన ఉదయాన్ని కొత్తగా మార్చుకునే ధైర్యంతో నడుస్తాం. అలాగని మాకంతా హాయిగా సాగిపోతోందని అనుకోకండి. మాలో చాలామంది బాల్యం వెక్కిరింతలు, అవహేళనలు, చీదరింపులు, చీత్కారాలతోనే గడిచిపోయింది. వాటినుంచే బలాన్ని తెచ్చుకున్నాం. పోరాటానికి ఆయుధంగా మలచుకున్నాం.. ఈ రోజు మా జీవన పాఠాన్ని మీకు చెప్పి.. మీలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపే స్థాయికి వచ్చాం. గెలుపు అంటే మార్కులు, పరీక్షలో పాస్ అవడం కాదు. గెలుపు అంటే జీవితాన్ని ఆస్వాదించడం. మంచి అయినా.. చెడు అయినా చివరిశ్వాస వరకూ జీవించాలి. భయం ఒక అపోహ..’ కాలేజీ పిల్లలకు చెప్పుకు పోతోంది పద్మప్రియ. ఆమెతోపాటు ఉన్న మరో 20 మంది ఫిజికల్లీ చాలెంజ్డ్ కళాకారులూ తమ జీవితంలోని సవాళ్లను చెప్పుకొచ్చారు. కిందటేడు.. సాంకేతిక పొరపాటు వల్ల ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. దాంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ‘అరే.. ఇంత చిన్న విషయానికే ఆత్మహత్యలా? రేప్పొద్దున జీవితంలో ఇంకెన్ని చూడాలి? మానసికంగా ఎంత బలంగా ఉండాలీ పిల్లలు?’అని కలత చెందింది.. చలించిపోయింది పద్మప్రియ. ఆ పిల్లల్లో ఆత్మబలం కలిగించడానికి తనలా ఫిజికల్లీ చాలెంజ్డ్ కళాకారుల జాబితా ఒకటి తయారు చేశారు ఆమె. తను చేయబోయే పని గురించి వాళ్లకు చెప్పారు. ఆసక్తి, సమయమూ ఉన్న 20 మంది కళాకారులు కూడారు. పద్మప్రియ నాయకత్వంలో తెలంగాణలోని పది జిల్లాల్లోని ప్రతి కళాశాలకు వెళ్లి తమ జీవిత గాథలతో విద్యార్థులను మోటివేట్ చేశారు. తాము పడ్డ అవమానాలు, పొందిన ఆనందాన్ని పంచుకుంటూనే స్కిట్స్, పాటలు, డ్యాన్స్‌తో పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించే ప్రయత్నం చేసి ఫలితం సాధించారు. నేపథ్యం.. పుట్టిపెరిగిందంతా ఖమ్మంలోనే. తల్లి కుసుమ గృహిణి. తండ్రి సత్యం.. ప్రైవేట్ ఉద్యోగి (ఇప్పుడు లేరు). పద్మప్రియకు ఇద్దరు తోబుట్టువులు.. ఒక అక్క, తమ్ముడు. చిన్నప్పుడే పద్మకు పోలియో సోకింది. ఆరేళ్లున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను ఖమ్మంలోనే సెయింట్ మేరీ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. ప్రతి ఎండాకాలం ఒక ఆపరేషన్ చొప్పున పదహారేళ్లొచ్చేప్పటికి ఎనిమిది ఆపరేషన్లతో కూర్చొని.. చంక కర్రల సహాయంతో నడవగలిగే దశకు చేరింది పద్మ. పాటలకు గమకాలు నేర్చుకుందక్కడే.. ‘కాళ్ల మీద నిలబడ్డమే కాదు జీవితంలో నిలబడ్డం నేర్చుకుందీ ఆ క్రిస్టియన్ మిషనరీలోనే. నా తొలి గురువు క్లారా హీటెన్. కథలు, పాటలు నేర్పి, నాలో పాడేకళకు మెరుగులు దిద్దింది ఆవిడే. నాటకాలు, చిన్న చిన్న స్కిట్స్ వేస్తూ నటనలోనూ అక్కడే తర్ఫీదు పొందింది ఆమె. జిల్లా, రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో పాల్గొనడం, ప్రైజ్‌తో హాస్టల్‌కు రావడం సర్వసాధారణంగా ఉండేదామెకు. కృష్ణుడు .. పాండురంగడూ ఖమ్మంలోనే డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానంలో పీజీ డిప్లమా పూర్తిచేసి ..పాటలతో ఫ్యూచర్‌ను నిర్మించుకోవాలనుకొని హైదరాబాద్ చేరింది. ‘మాయాబజార్ (దాసరి దర్శకత్వంలో)’ అనే సినిమా కోసం వంశీ ఇంటర్నేషనల్ నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొంది. పోటీ జరగలేదు.. కాని పాటలు పాడే ప్రోగ్రామ్ జరిగింది శివరాత్రి నాడు కావడంతో భక్తిపాటలను ఆలపించింది పద్మ. ఆమె గాత్రాన్ని మెచ్చిన వంశీ రామరాజు తన ‘వేగేశ్న’ ఫౌండేషన్‌లో ఉద్యోగమివ్వడమేగాక సంగీతం లో శిక్షణనిచ్చే బాధ్యతనూ తీసుకున్నారు. కొలువు చేసుకుంటూనే కర్ణాటక, లలిత సంగీతంలో శిక్షణపొందింది. పద్యగానంలో స్పెషలైజేషన్ చేసింది. మరోవైపు సినిమా ఫంక్షన్స్‌లో పాటలు, నాటకాలతో పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత వంశీ రామరాజు తన వేగేశ్నలోని ఫిజికల్లీ చాలెంజ్డ్ కళాకారులతో దేశమంతా తిరిగి పౌరాణిక నాటకాలు వేయించారు. అందులో కృష్ణుడిగా, పాండురంగడుగా, సత్యభామగా వేసిన పద్మప్రియకూ మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూడు పాత్రలతోపాటు వెంకటేశ్వరస్వామి పాత్రతో సహా పురుష పాత్రలకు పెట్టింది పేరుగా మారింది పద్మప్రియ. పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్.. ‘నీ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కావాలి అంటే నువ్వో సంస్థగానూ మారాలి. నీలాంటి పదిమందికి మార్గం చూపించాలి’ అని తొలి గురువు క్లారా, మలి గురువు వంశీ విజయరామరాజు చెవినిల్లు కట్టుకొని మరీ పోరారు. దాంతో 1999లో పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్ సంస్థను పెట్టింది. 2001లో వేగేశ్న నుంచి బయటకు వచ్చి.. మొత్తం తన సంస్థ మీదే దృష్టి పెట్టింది. ఫిజికల్లీ చాలెంజ్డ్ వాళ్లకోసం టైలరింగ్, కంప్యూటర్ విద్యతోపాటు సంగీత, నాటకాల్లోనూ శిక్షణ ప్రారంభించింది. ఆసక్తి ఉండి అవకాశాల్లేని ఫిజికల్లీ చాలెంజ్డ్ కళాకారులకు తమ సంస్థ తరపున అవకాశాలూ కల్పిస్తూ ఉపాధినిచ్చే ప్రయత్నమూ చేస్తోంది విజయవంతంగా. స్టేజ్షోస్తోపాటు టెలివిజన్‌లోనూ రాణిస్తోంది. విశిష్టప్రతిభా పురస్కారం.. పద్యగానంలో పద్మప్రియను మించినవారు లేరనే కితాబు తెచ్చుకుంది. అందుకే పద్యగానం ప్రాంతీయ కళే అయినా తన ప్రతిభతో ప్రపంచానికి పరిచయం చేసిన తీరుకి ముగ్ధులై 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ‘విశిష్ఠ ప్రతిభా పురస్కారం’తో పద్మప్రియను సత్కరించారు. ఆసియా ఖండంలోనే పద్యనాటకం వేసిన తొలిమహిళగా గుర్తింపునిచ్చారు. యేటికి ఎదురీది నిలబడ్డమే జీవితం అని చాటిన ఆమె శక్తికి 2010లో ‘స్త్రీ శక్తి పురస్కార’మూ తలవంచి ఆమెను వరించింది. ఇంకెన్నో తెలంగాణ రాష్ట్రప్రభుత్వ అవార్డులూ వచ్చాయి. సెన్సార్‌బోర్డ్ సభ్యురాలిగానూ పనిచేసింది. కళాసేవే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంది పద్మ. పిడబ్ల్యూడీ యాక్ట్‌కి సంబంధించి తెలంగాణ అడ్వయిజరీ బోర్డ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధికి సంబంధించి ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ హక్కుల కోసమూ పోరాటం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. – సరస్వతి రమ -
నేటి స్త్రీ కథ కూడా పాతకథేనా?
ఇంతకుముందే చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్పటంలో ఒక ఇబ్బంది ఉంది: కొత్తగా ఉంటే తప్ప ఆ రచన ఆకట్టుకోలేదు. ఫెమినిజం మీద ఇంత సాహిత్యం వచ్చాక, ఇంకో నవల రాయాలంటే ఒక కొత్త ఎత్తుగడ అవసరం. ఆ అవసరం దృష్ట్యా, కథ విస్తరణలో చూపిన నైపుణ్య విభవమే కెనడియన్ రచయిత్రి కర్మా బ్రౌన్ ఐదవ నవల రెసిపీ ఫర్ ఎ పెర్ఫెక్ట్ వైఫ్. ఆలిస్ దంపతులు మాన్హటన్ జీవితపు హడావుడికీ, హుషారుకూ దూరంగా ఉండే గ్రీన్విల్కి చేరతారు. ఎటూ తనకి ఉద్యోగం లేదు కదా అని అయిష్టంగానే ఆలిస్ ఒప్పుకుంటుంది కానీ– ఆ పాతకాలపు ఇల్లూ, పరిసరాలూ ఆమెకి నచ్చవు. వాటికి క్రమంగా అలవాటు పడుతున్నప్పుడు ఆ ఇంటి పాత యజమానురాలైన నెల్లీ వస్తువులు కొన్ని ఆలిస్‌కి తటస్థపడతాయి. 1950ల నాటి నెల్లీ వంటల పుస్తకం, పత్రికలూ, తన తల్లికి రాసి పోస్ట్ చేయని ఉత్తరాలూ కనిపించి ఆలిస్‌లో ఒక కుతూహలాన్ని కలిగిస్తాయి. ఇక్కడినుంచీ నవల నెల్లీ, ఆలిస్‌ల కథనాలతో రెండు పాయలుగా కదులుతుంది. నెల్లీ ఉత్తరాలూ, వంటల పుస్తకం ద్వారా ఆమె జీవితం ఆలిస్‌కి ఆవిష్కృతమవుతుంది. స్వతహాగా స్నేహశీలి అయిన నెల్లీ ఇంటి బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే ఉంటుంది. కానీ శారీరకంగా మానసికంగా హింసిస్తూ, తనకి ఏ మాత్రం విలువనివ్వని భర్తతో ఆమె వైవాహిక జీవితం దుర్భరంగా ఉంటుంది. అతని దెబ్బల్ని డ్రెస్సుల మాటునా, దాష్టీకాన్ని మౌనం చాటునా దాచుకుని భరిస్తూ, అతని అక్రమ సంబంధాన్ని సైతం సహిస్తూ ఉంటుంది. పిల్లలు కావాలన్న కోరిక బలంగా ఉన్న భర్త ఆమె ఇష్టాయిష్టాలనూ, మానసిక పరిస్థితినీ గమనించుకోడు; ఆమె ఉనికికి ఒక గౌరవాన్నీ ఇవ్వడు. ఈ విషయాలన్నీ ఆలిస్‌ని కలవరపెడతాయి. ఉదాహరణకి పిల్లల విషయంలో తన అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోడు భర్త. అన్ని విషయాలలోనూ అతని ఇష్టాల మేరకు సర్దుకుపోవలసిందేనా అన్నది ఆలిస్ ప్రశ్న. అప్పటి నెల్లీ పరిస్థితీ, ఇప్పటి తన పరిస్థితీ ఒకేలా ఉన్నాయనుకుంటుంది. నెల్లీ స్వతంత్రంగా నిలబడటానికి ఏం చేసింది? ఈ స్ఫూర్తితో ఆలిస్ జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి? ఈ విషయాల మీదుగా ఊహించని మలుపుతో ఇద్దరి కథా, నవలా ముగుస్తుంది. ఈ నవల రాయడానికి అరవై ఏళ్ల క్రితం ఉన్న స్త్రీ–పురుష సంబంధాల గురించీ, సాహిత్యంలో వాటి ప్రతిఫలనాల గురించీ రచయిత్రి చేసిన అధ్యయనం నవలలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి– నెల్లీ కథనంతో ఉన్న ప్రతి అధ్యాయమూ ఆనాటి వంటల రెసిపీలతో (చాకొలేట్ చిప్ కుకీస్, మింట్ సాస్ లాంటివి) మొదలవుతుంది. ఆనాటి పుస్తకాల్లో స్త్రీలు ఎలా ఉండాలో చెప్పిన పితృస్వామ్యపు సూక్తులతో (‘భర్త సమస్యలను జాగ్రత్తగా విను. వాటితో పోలిస్తే నీవి చాలా చిన్నవి...’, ‘నీ భర్త నిన్ను సంతోషపెడతాడని ఆశించవద్దు. అతన్ని సంతోషపెట్టు– అందులోనే నీ సంతోషం దాగుంది.’) ఆలిస్ అధ్యాయాలు ప్రారంభమవుతాయి. ‘‘ఆ రోజుల్లో పెళ్లయ్యీ, పిల్లలు లేకపోతే అదో సమస్య. సాంఘికమైన ఒత్తిళ్లు ఆ స్థాయిలో ఉండేవి,’’ అని నవలలో ఒక పాత్ర అంటుంది. ఈ రోజుల్లో కూడా ఒత్తిళ్లు అలానే ఉన్నాయి అనుకుంటుంది ఆలిస్. స్త్రీలు పురోగతి సాధించారనీ, సాధికారతని పొందారనీ అనుకుంటున్నాం కానీ– అలాంటి అపోహలకి లోనుకాకుండా, ఆ ప్రగతి కేవలం ఉపరితల దృశ్యమేనా అని బేరీజు వేసుకోవడం అవసరమని రచయిత్రి అభిప్రాయం. డటన్ పబ్లిషర్స్ ద్వారా గత సంవత్సరం విడుదలయిన ఈ పుస్తకం పాఠకులని బాగా ఆకర్షించింది. -పద్మప్రియ -
ఆ బాబు నీడలు మాకొద్దు
ఒక వికలాంగురాలిగా నా అనుభవ పాఠాలతో చెబుతున్నాను. ప్రభుత్వాలిచ్చే సామాజిక పెన్షన్లను రాజకీయంగా చూడవద్దు. సామాజికంగా దెబ్బతిన్న వర్గాలకు ఇది చేయూత అనుకోండి. వారు భావితరాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని మరవద్దు. అలా ఆలోచించే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నది నా కోరిక. వికలాంగులు, వయో వృద్ధులు, వితంతువుల ఆవేదన నుంచి వచ్చే ఏకైక మాట ఇది. ఒకింత బాసట కావాలని ఆశించే అభ్యర్థన ఇది. గెస్ట్ కాలం: సమాజంలో మెజారిటీ వికలాంగులు దయనీయస్థితిలో ఉన్నారు. వయో వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఈ వర్గాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. వంద కూడా దాటని పెన్షన్ కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లం. వైఎస్ పాదయాత్రలో అనేకమంది ఈ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగురాలిగా నాకూ ఏదో తెలియని అపనమ్మకం ఉండేది. దానికి బలమైన కారణాలూ న్నాయి. చంద్రబాబు తన హయాంలో తొమ్మిదేళ్లు ఉద్యోగ నియామకాలు నిలిపివేశారు. ఫలితంగా ఒక్క వికలాంగుడికీ ఉద్యోగం రాలేదు. ఆయన ఈ ద్రోహం చేసి ఉండకపోతే వికలాంగుల్లో కనీసం 50 శాతం మంది బాగుపడి ఉండేవారు. ఉద్యోగాల్లో చేరి ఉండేవారు. వైఎస్‌కు మేలు చేయాలని ఉన్నా... చంద్రబాబు చర్యలు అడ్డుగా నిలిచాయి. అప్పటికే అనేకమంది ఉద్యోగాల్లో చేరేందుకు వయోపరిమితి దాటిపోయారు. వయో వృద్ధుల పరిస్థితి ఇంతకంటే దారుణం. చంద్రబాబు కాలంలోని వరుస కరవు.. గ్రామీణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసింది. ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలోనే అంతరించాయి. ఖాళీ అయిన ఊళ్లు, వలసలు వెళ్లిన కొడుకులు ఆనాటి పరిస్థితి. దీంతో వయసు ఉడిగిన పెద్దలకు ఆసరా కరవైంది. పూట గడవడమే కష్టమనే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత హైటెక్ మోజులో యువత పట్టణాలకు ఎగబాకారు. అంతిమంగా వృద్ధులు నిరాశ్రయులయ్యారు. వితంతువుల స్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే భర్తలు కోల్పోయిన వారిని 2004కు ముందు పట్టించుకున్నదెవరు? పెన్షన్లు ఇవ్వడం వైఎస్ గొప్పతనమే. పెన్షన్లు పెంచడం, వాటిని నెలనెలా సక్రమంగా ఇవ్వడం వల్ల మాకు కొంతైనా ఊరట కలిగింది. ఆయన తర్వాత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. వికలాంగులు, వయోవృద్ధులకు ఇతర దేశాల్లో ప్రభుత్వాలే చేయూతనిస్తున్నాయి. మన దేశంలో మూడు శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. రాజకీయంగా ఆ మాత్రం కూడా లేదు. వితంతువులు, వికలాంగుల్లో అత్యధికులు నిరుద్యోగులు. వికలాంగుల్లో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉన్నారు. దీనికి ఫ్లోరైడ్ కూడా కారణం కావచ్చు. విద్య, వైద్యం అందరికీ అందాలని వైఎస్ చెప్పేవారు. ఆ దిశగా ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ వంటి వైద్య సదుపాయాలు ఉండొచ్చు. అయితే మహిళా వికలాంగులకు ఇవే చేయూతనిస్తాయని చెప్పలేం. వారి సమస్యలు వేరు. ప్రసూతి సమయంలో వారికి ఉండే ఇబ్బందులు భిన్నం. వయసు మీదపడే కొద్దీ వికలాంగుల ఆరోగ్య పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఔషధాల వినియోగం పెరుగుతుంది. వృద్ధుల పరిస్థితీ ఇదే. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడిచ్చే పెన్షన్‌ను మరింత పెంచాలి. సామాజిక పెన్షనర్లను రాజకీయ ఆయుధంగా వాడుకోకూడదు. ఎన్నికల మేనిఫెస్టోలో వారి గురించి ఆలోచిస్తే చాలు. చంద్రబాబు ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించడం వల్ల ఒకతరం అవిటిదైపోయింది. ఇది గుర్తించి ఊరట కలిగిద్దామనుకున్నారు వైఎస్. తన ప్రయత్నాలు కార్యరూపం దాల్చేలోపే ఆయన లేకుండాపోయారు. ఆ తర్వాత పాలకులు కనీసం ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లినా బాగుండేది. మా సానుభూతి వైఎస్వైపే ఉందనుకున్నారో ఏమో! అన్యాయం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మూడేళ్లుగా ఇవ్వడం లేదు నేను పుట్టుకతోనే వికలాంగుడను. కాలు పనిచేయదు. 75శాతం వికలత్వం ఉన్నట్టు సదరం క్యాంపులో వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు వికలాంగ పింఛన్ మంజూరు చేశారు. ఆయన ఉన్నంత వరకు పింఛన్లు సక్రమంగా ఇచ్చిన అధికారులు మూడేళ్లుగా సరిగా ఇవ్వడం లేదు. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి తిరిగి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - శివకుమార్, కొత్తపల్లి(హెచ్), నార్నూర్ వైఎస్ పుణ్యమాని.. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.75 వృద్ధాప్య పింఛన్ ఇచ్చేవాళ్లు. వైఎస్ పుణ్యమా అని అది రూ.200కు పెరిగింది. దీంతోనే బతుకుతున్నం. మాలాంటి ఎంతో మంది వృద్ధులకు వైఎస్సార్ అన్నం పెట్టిండు. వేలి ముద్రల పేరుతో ఇప్పుడు పింఛన్ ఇచ్చేందుకు పరేషాన్ చేస్తుండ్రు. వేలి ముద్రలు రాక పోవడంతో డబ్బులు సమయానికి దొరకడం లేదు. పోస్టాఫీస్ చుట్టూ తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. పింఛన్ పెంచిన రాజశేఖరరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. - హమీదా బేగం, వాంకిడి, ఆదిలాబాద్ పింఛన్‌తోనే బతుకుతున్నా.. నా భర్త చనిపోయి 20ఏండ్లయింది. ఆసరాగా ఎవరూ లేరు. మొదట్లో రూ.75 పింఛన్ వచ్చేది. రాజన్న వచ్చినంక రూ.200కు పెంచిండు. ఒకటో తారీఖు రాంగనే పంచాయతీకి పోయి పైసలు తెచ్చుకుంట. ఎన్నికల్లో గెలిసేటోళ్లు పింఛన్ పెంచాలి. రూ.700 ఇత్తే అండగా ఉంటది. - బోగ రాజమ్మ, వితంతు పింఛను లబ్ధిదారురాలు, బచ్చన్నపేట, వరంగల్