Relative
-
mahakumbh: 27 ఏళ్ల క్రితం అదృశ్యం.. నేడు అఘోరిగా ప్రత్యక్షం
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా సాగుతోంది. ఈ కుంభమేళాలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.27 ఏళ్ల క్రితం తమ కుటుంబం నుంచి తప్పిపోయిన ఒక వ్యక్తిని కుంభమేళాలో కనుగొన్నామని జార్ఖండ్‌కు చెందిన ఒక కుటుంబం మీడియాకు తెలిపింది. దీంతో తమ 27 ఏళ్ల ఆవేదన ఇప్పుడు తీరిపోయిందని వారు ఆనందంగా చెబుతున్నారు. నాడు ఇంటి నుంచి తప్పిపోయిన గంగాసాగర్ యాదవ్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు. ఇప్పుడాయన అఘోరి సాధువుగా కుటుంబ సభ్యులకు దర్శనమిచ్చారు. ఇప్పుడు అతని పేరు బాబా రాజ్ కుమార్.1998లో గంగాసాగర్ కుటుంబ సభ్యులంతా బీహార్‌లోని పట్నాకు వెళ్లారు. అప్పుడు గంగాసాగర్ అదృశ్యమయ్యాడు. దీంతో అతని భార్య ధన్వ దేవి ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుని వారి కుమారులు కమలేష్, విమలేష్‌లను పెంచిపెద్దచేసింది. గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ‘తమ సోదరుడిని తాము మళ్లీ చూస్తామనే ఆశను కోల్పోయాం. అయితే కుంభమేళాకు వెళ్లిన మా బంధువులలో ఒకరు గంగాసాగర్ ఫోటో తీసి మాకు పంపారు. దీంతో నేను, ధన్వా దేవి, వారి ఇద్దరు కుమారులతో కలిసి కుంభమేళాకు వెళ్లాం.అక్కడ గంగాసాగర్‌ను గుర్తించాం. అయితే అతను తన పూర్వపు గుర్తింపును అంగీకరించేందుకు నిరాకరించారు. పైగా తాను బాబా రాజ్‌కుమార్‌ను అని చెబుతూ, వారణాసికి చెందిన సాధువును అని తెలిపాడు. అయితే తాము ఆయన నుదిటిపై, మోకాలిపై ఉన్న గాయాల గుర్తులును చూశాకనే ఆయనను గంగాసాగర్ యాదవ్‌గా గుర్తించాం. కుంభమేళా ముగిసే వరకు ఇక్కడే ఉంటాం. అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు చేయిస్తాం. అవి సరిపోలకపోతే బాబా రాజ్‌కుమార్‌కు క్షమాపణలు చెబుతాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా -
కర్ణాటకలో యువతిపై హత్యాచారం
బీదర్: కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో ఓ యువతి అత్యాచారం, హత్యకు గురైంది. ప్రధాన నిందితుడైన ఆమె బంధువు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుణతీర్థవాడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల తమ కుమార్తె ఆగస్ట్ 29వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ ఒకటిన∙స్థానిక పాఠశాల వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో అదృశ్యమైన రోజున ఆమెతో ఫోన్లో మాట్లాడిన ముగ్గురిని గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురిలో ఒకరు ఆమెను ఆరోజు కలుసుకున్నట్లు తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఘటనాస్థలానికి కొద్ది దూరంలో తన ఇద్దరు మిత్రులు వాహనంతో కాపలాగా ఉండగా యువతిని రేప్ చేసి, తలపై బండరాయితో మోది చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలు, ప్రధాన నిందితుడు బంధువులవుతారని బీదర్ ఎస్పీ తెలిపారు. హత్యాచారం ఘటనపై బీదర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. -
బంధువు కాదు.. కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): వరుసకు సోదరుడైన పి.గణేష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాజోలు మండలం శివకోడుకు చెందిన బాధిత మహిళ అమలాపురంలోని ఎస్పీ కార్యాలయానికి గురువారం వచ్చి ఫిర్యాదు చేసింది. దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, మానవ హక్కుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావులతో కలిసి బాధితురాలు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఏఎస్పీ లతా మాధురికి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. చదవండి: సంతోషం.. సరదా కబుర్లు.. అంతలోనే ఘోరం.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసు స్టేషన్లో నిందితుడు గణేష్‌పై దిశ కేసు నమోదైందని రాజామణి తెలిపారు. అయిన్పటికీ రాజోలు పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోవడం లేదని వారు ఏఎస్పీకి వివరించారు. నిందితుడిపైనా... కేసు పట్ల సరిగా స్పందించని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని తాము ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రాజామణి, శ్రీనివాసరావు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. -
ఎంపీ బంధువునని రూ.7 లక్షల స్వాహా
మైసూరు: ఉత్తర కన్నడ జిల్లా ఎంపీ అనంతకుమార్ హెగడె బంధువునని చెప్పుకున్న ఒక మహిళ తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని వద్ద సుమారు రూ. 7 లక్షలు తీసుకుని అదృశ్యమైంది. ఈ సంఘటన మైసూరు కువెంపు నగరలో చోటు చేసుకుంది. నిందితురాలు రేఖా హెగడె (32). సుధీర్, మంజుళ అనే దంపతులకు చెందిన ఇంటిలో రేఖా నివాసం ఉంటుంది. తనకు ఎంపి అనంత్ కుమార్ హెగడె దగ్గరి బంధువని చెప్పుకుంది. రూ. 1 కోటితో ఇంటిని కొనుగోలు చేస్తున్నానని, ఇందుకోసం రూ.7 లక్షలు తక్కువ అయ్యాయి, ఇస్తే వెంటనే తిరిగి ఇస్తానని నమ్మబలికింది. దీంతో సుధీర్ దంపతులు ఆమెకు ఆ డబ్బు ఇచ్చారు. మరుసటి రోజే పరారైంది. దీంతో బాధితులు కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘరానా దొంగ అరెస్టు బనశంకరి: విలాసవంతమైన జీవనం కోసం చోరీలకు పాల్పడుతున్న దొంగను సోమవారం బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.18 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ సాదిక్ పట్టుబడిన దొంగ. మంగళూరుకు చెందిన నిందితుడు బెంగళూరు సిటీమార్కెట్‌లో ఉన్న ఒక హోటల్లో క్లీనింగ్ పనిచేసేవాడు. జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతడు దొంగతనాల కేసుల్లో జైలు పాలై, విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడడం గమనార్హం. బెట్టింగ్ కేసులో పట్టివేత క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ఏఎల్ రెండోస్టేజ్ వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసి దాడి చేశారు. నిందితున్ని అరెస్టు చేసి రూ.9.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: స్థలం చూసోద్దామని చెప్పి...కిడ్నాప్ చేసి రూ.10 లక్షల వసూలు) -
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
జియాగూడ: అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి వరుసకు బంధువు అయిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన కులుస్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బస్తీవాసులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గురువారం కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్, ఎస్.ఐ.సత్యనారాయణ తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన దంపతులు కుల్సుంపురా ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ నెల 17న తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఏడేళ్ల పెద్ద కూతురు ఇంటివద్దే ఆడుకుంటోంది. చిన్నారిని అదే ప్రాంతంలో నివాసముంటున్న జితేందర్ చావ్లా సైకిల్ నేర్పిస్తానని మాయమాటలు చెప్పిపై అంతస్తులోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. అయితే సోనుచావ్లా సోదరుడు సన్నీచావ్లా అక్కడే ఉండటంతో గమనించి నిలదీయడంతో నిందితుడు పరారయ్యాడు. ఇదిలా ఉండగా పెద్దలు జాతీయ రహదారి పీలిమండప్ గుడివద్ద పంచాయితీ చేసి సదరు నిందితుడికి ఏడాదిపాటు కుల బహిష్కరణ చేశారు. అయితే గురువారం బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేస్తూ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
దారుణం: పాపను చంపేసి.. గొనెసంచిలో కుక్కి
గిద్దలూరు(ప్రకాశం జిల్లా): ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడు ఆమెకు వరుసకు బాబాయేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి అంతమొందించాడు. మండలంలోని అంబవరంలో ఏడేళ్ల బాలిక డి.ఖాశింబీ గురువారం అదృశ్యమై శుక్రవారం మృతదేహమై గొనెసంచిలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఖాశింబీని ఆమె సమీప బంధువు, వరుసకు బాబాయి అయ్యే సిద్ధయ్య తన ఇంట్లోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశాడు. అనంతరం పాపను చంపేసి మృతదేహాన్ని గొనెసంచిలో కుక్కి గ్రామానికి సమీపంలోని చెట్లోలో పడేశాడు. బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు, బంధువులు గాలిస్తున్నా అతడు పట్టీపట్టనట్లు ఉన్నాడు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి వద్ద బంధువుల ఆందోళన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బంధువులు శనివారం గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దిశ ఘటనలో తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేసినట్లు ఖాశింబీ నిందితుడిని కూడా ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. మహిళా కమిషన సభ్యురాలు రమాదేవి ఆస్పత్రికి వచ్చి బాలిక మృతదేహాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. బాలిక హత్యకు సంబంధించిన వివరాలు బంధువులను అడిగి తెలుసుకున్నారు. సీఐ ఎండీ ఫిరోజ్‌తో మాట్లాడారు. నిందితుడు సిద్ధయ్య ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడని, తరుచూ వేధిస్తుండటంతో భార్య అలిగి కుమార్తెతో సహా పుట్టింటికి వెళ్లినట్లు తమ దర్యాప్తులో తేలిందని మహిళా కమిషన్ సభ్యురాలితో సీఐ చెప్పారు. హత్య కేసుగా నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు వివరించారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సీఐ తెలిపారు. పొదిలి సీఐ యూ.సుధాకర్‌రావు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్ఐలు వైద్యశాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే అన్నా పరామర్శ అంబవరంలో బాలిక హత్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు శనివారం నేరుగా గ్రామానికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సీడీపీఓ లక్ష్మీదేవి, కొమరోలు మహిళా సంఘం అధ్యక్షురాలు వేణమ్మ, వినియోగదారుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు నారాయణరెడ్డిలు ఉన్నారు. -
మరొకరితో చనువుగా ఉంటోందని బీటెక్ విద్యార్థినిపై దారుణం
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: మరొకరితో చనువుగా ఉంటోందని అక్కసుతో ఓ బావ మరదలిని గొంతు నులిమి చంపేసిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం వివరాలు.. హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలవేణి దంపతుల కుమార్తె మంజుల (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి బంధువుల కుమారుడు వరుసకు బావ అయిన భూపతి (21) ఏవీబీపురంలో నివాసముంటున్నాడు. వీరిరువురూ స్నేహంగా ఉండేవారు. ఇటీవల మంజుల మరో వ్యక్తితో చనువుగా ఉంటూ ఫోన్లో మాట్లాడుతోందని భూపతి రెండు రోజుల క్రితం గొడవకు దిగాడు. ఈ నెల 10న తన ఇంటికి మంజులను రప్పించుకొని ఆమె గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నీటిసంప్‌లో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. కానీ.. కాసేపటికి భూపతి తన నిర్ణయాన్ని మార్చుకొని అదేరోజు పోలీసులకు లొంగిపోయాడు. -
ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం
సాక్షి, చెన్నై: తమిళ దర్శకుడు జననాథన్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జననాథన్ సోదరి లక్ష్మి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ (మార్చి ,14న) అకాల మరణంతో షాక్‌లో ఉన్న వారి కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయింది. (ప్రముఖ దర్శకుడు కన్నుమూత) లక్ష్మి హఠాన్మరణంపై మూవీ ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో ఇద్దరు మరణించడం విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా 'లాభం' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జననాథన్ తీవ్ర అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడి కాల్చివేత
పట్నా: బిహార్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ కుమార్ మిశ్రా మేనల్లుడిపై నలుగురు గుర్తు తెలియని దుండగులు శనివారం కాల్పులు జరిపి హతమర్చారు. ఈ ఘటన రోహ్తాస్ జిల్లా పార్సతువా మార్కెట్ సమీపలోని సోహాసా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. సంజీవ్ కుమార్ మిశ్రా(40) మెడిసిన్ కోసం సమీపంలోని మెడికల్‌షాప్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా నలుగురు దుండగులు రెండు బైకుల మీది వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మార్కెట్ ప్రాంతం ఉద్రికత్తంగా మారిపోంది. తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను వారణాసిలోని ఓ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సంతోష్ కుమార్ ఘటన స్థలనికి చేరుకున్నారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేయలని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించాంరు. వందల మంది స్థానికులు సంజీవ్ మిశ్రా మృతికి సంబంధించిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. సంజీవ్ కుమార్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పండిట్ గిరీష్ నారాయణ్ మిశ్రా మనవడు. అతను స్థానికంగా ఓ డిగ్రీ కళాశాల నడుపుతూ.. సామాజిక సేవ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సంతోష్ కుమార్ మిశ్రా కార్గహార్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గత 20 ఏళ్లలో సంజీవ్ కుమర్ కుటంబంలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అతని తండ్రి మహేంద్ర అలియాస్ గుమతి మిశ్రా, మామ చంద్రమా మిశ్రా, తాత పండిట్ కామతా ప్రసాద్ మిశ్రా అందరూ పార్సతువా మార్కెట్లో కాల్చి చంపబడ్డారు. చదవండి: లాయర్ దారుణ హత్య.. కోర్టు ఆవరణలో మాటువేసి -
కోడెల మృతిపై బంధువుల అనుమానం
-
ఘోరం: కవల పిల్లల్ని చంపి ఆపై కారులో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరి మానసిక దివ్యాంగులను మేనమామే హత్యచేశాడు. ఇద్దరు కూడా 12 ఏళ్లలోపు కవలలు కావడం గమనార్హం. ఈ ఘటన చైతన్యపురి పోలీసు పరిధిలోని సత్యనారాయణపురం జరిగింది. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సృజన(12), విష్ణువర్దన్ రెడ్డి(12)లుగా గుర్తించారు. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస రెడ్డి, లక్ష్మీ దంపతుల పిల్లలుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీ తమ్ముడు మల్లికార్జున రెడ్డి మిర్యాలగూడకు వెళ్లారు. పిల్లలకు స్విమింగ్ నేర్పిస్తా అని చెప్పి ఆ కలలను తన కారులో హైదరాబాద్‌లోని సత్యనారయణపురంలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లొకి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి పిల్లలిద్దరిని గొంతు నులిపి చంపేశారు. అనంతరం మరో ఇద్దరితో కలిసి మృత దేహాలను కారులో తరలించడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి ఇంటి యజమాని బయటకు వచ్చి చూడగా కారులో మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారితో చెప్పి వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులను చైతన్యపురి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా పిల్లల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులకు తెలిసే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
పీడబ్ల్యూడీ స్కాంలో కేజ్రీవాల్ బంధువు అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) డ్రెయినేజీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మేనల్లుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వాయవ్య ఢిల్లీ ప్రాంతంలో డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణ బాధ్యతలను రేణు కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ చేపట్టింది. సుమారు రూ.3.1 కోట్ల విలువైన పనులను పీడబ్ల్యూడీ అధికారులతో కుమ్మక్కై ఈ కంపెనీ నాసిరకంగా చేపట్టిందని ఏసీబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేణు కన్స్ట్రక్షన్స్ కంపెనీలో సీఎం మేనల్లుడు వినయ్ బన్సల్‌కు సగం వాటా ఉంది. వినయ్ బన్సల్‌ను గురువారం అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. çఆప్‌ను వేధించడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోపించారు. -
దావూద్ బంధువు పెళ్లి: చిక్కుల్లో మంత్రి, పోలీసులు
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బంధువు పెళ్లికి హాజరైన రాష్ట్ర మంత్రి , నాసిక్ మేయర్, పోలీసు ఉన్నతాధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రధాన అనుచరుడు , వైద్య విద్యాశాఖమంత్రి గిరీష్ మహాజన్ గాంగ్స్టర్ దావూధ్ బంధువుల వివాహానికి హాజరు కావడం దుమారాన్ని రేపింది. అసిస్టెంట్ పోలీసు కమిషనర్, ఇద్దరు సీనియర్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీసు అధికారులు ఈ వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లోని దావూద్ ఇబ్రహీం బంధువు జగ్గి కొంకణి కుమార్తె వివాహం ఆధ్యాత్మిక గురువు ఖతిబ్ కుమారుడితో మే 19న జరిగింది. దావూద్ భార్య ,వధువు తల్లి తోబుట్టువులని నాసిక్ పోలీస్ కమీషనర్ రవీంద్ర సింఘాల్ నిర్ధారించారు. నాసిక్ మేయర్ రంజనా భనసి, డిప్యూటీ మేయర్ ప్రథమేష్ గైట్, బిజెపి శాసనసభ్యులు దేవని ఫరాండే, బాలసాహెబ్ సనాప్, సీమా హిరా, స్థానిక మునిసిపల్ కౌన్సిలర్లు తదితరులు ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. దీంతో ఈ వివాహానికి హాజరైన పోలీసు అధికారులపై రవీంద్ర సింఘాల్ అంతర్గత విచారణ చేపట్టామన్నారు. వీరి స్టేట్మెంట్లను నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే సెలవులో ఉన్న కొంతమంది అధికారులపై అంతర్గత విచారణ పూర్తిచేయడానికి మరో రెండు రోజులు పడుతుందని పోలీసు కమిషనర్ చెప్పారు. అభ్యంతరకరమైన, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నట్లయితే సంబంధిత నివేదికను కోసం మా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ముస్లిం మత పెద్దల ద్వారా ఈ ఆహ్వానాలు ఎంఎల్ఏలకు, పోలీసు అధికారులకు, మరికొంతమంది కార్పొరేటర్లకు అందాయని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో మంత్రులను ప్రశ్నించలేమని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వివాహాలు, సామాజిక కార్యక్రమాలకు హాజరు కావద్దని తాము ఎవరినీ అడ్డుకోలేమన్నారు.అయితే పెళ్లికి హాజరయ్యేంతవరకు ఇది దావూద్ బంధువుల వివాహమని తనకు తెలియదని మంత్రి మహాజన్ చెప్పడం విశేషం. -
దూరపు బంధువు కదా అని ఇంట్లోకి రానిస్తే..
హైదరాబాద్ : దూరపు బంధువు కదా అని ఇంట్లోకి రానిస్తే.. అదను చూసి మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలతో పరారయ్యాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ దూరపు బంధువు కదా అని ఓ యువకుడికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె గొంతు కోసి బంగారు నగలతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు తీరుస్తాను రమ్మని.. చంపేశాడు..
♦ స్నేహితుడితో కలసి బంధువు ఘాతుకం ♦ యువకుడు నాగేశ్వరరావు మృతి కేసును ఛేదించిన పోలీసులు కె.కోటపాడు: మండలంలోని కె.సంతపాలెంకు చెందిన యువకుడు అనపర్తి నాగేశ్వరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లిస్తానని చెప్పి దూరపు బంధువే స్నేహితుడి సాయంతో హతమార్చినట్టు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి వివరాలు రాబట్టారు. కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోడవరం సీఐ ఎస్.కిరణ్‌కుమార్ విలేకరుల ఎదుట నిందితులను ప్రవేశపెట్టి హత్య వివరాలను వెల్లడించారు. కె.సంతపాలెంలో నాగేశ్వరరావు నూడి ల్స్, స్వీట్లు తయారు చేసి అమ్ముతుంటాడు. ఇతనికి సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో గల జయలక్ష్మి వైన్స్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న అమరపిన్నివానిపాలెంకు చెందిన గండేపల్లి నారాయణరావు (29)తో దూరపు బంధుత్వం ఉంది. విశాఖపట్నం వెళ్లి వచ్చే సమయంలో నాగేశ్వరరావు వైన్‌షాపు వద్ద ఆగి నారాయణరావుతో మాట్లాడేవాడు. 9 నెలల క్రితం నారాయణరావు.. నాగేశ్వరరావు నుంచి రూ.9 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో నారాయణరావుకు రైల్వేలో ట్రాక్‌మేన్‌గా ఉద్యోగం వచ్చింది. అరకు సమీపంలోని శివలింగాపురంలో విధులు నిర్వహిస్తున్నాడు. తన అప్పు తీర్చాలని నాగేశ్వరరావు తరచూ అడిగేవాడు. దీంతో రూ.3 లక్షలు వర కూ చెల్లించగా మిగిలిన రూ.6 లక్షలు ఇస్తానని చెప్పి నమ్మించిన నారాయణరావు కె.సంతపాలెం శివారుకు ప్రాంసరీ నోట్లు, బ్యాంక్ చెక్‌ను తీసుకురావాలని ఫోన్లో సమాచారం అందించాడు. పథకం ప్రకారం నారాయణరావు తన స్నేహితుడైన పెందుర్తి మండలం నల్లక్వారీ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కళ్లేపల్లి శివ (23) అలియాస్ సూపర్‌ను ఆశ్రయించి విషయం చెప్పి సహకారం అందించాలని అభ్యర్థించాడు. తనకు రైల్వేలో ఉద్యోగం ఇప్పించాలని గతంలో నారాయణరావును శివ కోరాడు. శివకి ఉద్యోగం ఆశ చూపి నారాయణరావు ఈ హత్యకు ఉపక్రమించేలా చేశాడు. 16వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో గ్రామ శివారులో గల రాజుగారి లేఅవుట్ వద్ద నాగేశ్వరరావు, వీరిద్దరూ కలుసుకున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన నాగేశ్వరరావును లేఅవుట్ లోపలకి తీసుకువెళ్లి మద్యం సేవిస్తూ మాట్లాడసాగారు. కొద్దిసేపు గడిచాక నాగేశ్వరరావు మద్యం తాగుతున్న సమయంలో తమ వెంట తెచ్చిన చెక్కతో శివ తొలిత తలపై మోదాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి తీవ్రంగా కొట్టారు. ప్రాణం పోయేంతవరకు కొట్టి చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన తరువాత నాగేశ్వరరావు తీసుకువచ్చిన బ్యాంక్ చెక్‌తోపాటు బుక్‌ను తీసుకుని నిందితులు అక్కడ నుంచి ఆటోలో పరారు అయ్యారు. నాగేశ్వరరావు ఆరోజు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో భార్య వరలక్ష్మికి నారాయణరావును కలుసుకుని వస్తానని చెప్పి వెళ్లాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకుని విచారించారు. దీంతో హత్య వ్యవహారం బయటపడింది. కె.కోటపాడు, ఎ.కోడూరు ఎస్.ఐలు వి.లక్ష్మణరావు, కరణం ఈశ్వరరావు, ట్రైనీ ఎస్.ఐ భాస్కర్ పాల్గొన్నారు. -
సమస్యల చొక్కా...
ఆత్మబంధువు ఆనంద్ ఆఫీసునుంచి ఇంటికి వస్తూనే విసురుగా బైక్ స్టాండ్ వేశాడు. అంతే విసురుగా ఇంట్లోకి వచ్చాడు. నాన్నా అంటూ దగ్గరకు వచ్చింది బిందు. పట్టించుకోలేదు. సోఫాలో కూర్చున్న నాన్న ఒళ్లో కూర్చోవాలని ప్రయత్నించింది. తీసి పక్కన కూర్చోబెట్టాడు. రోజూ రాగానే ఎత్తుకుని ముద్దాడే నాన్న ఈ రోజెందుకలా ఉన్నాడో అర్థం కాలేదు పాపం ఆ చిన్నారికి. మాట్లాడకుండా వెళ్లి తన పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. ఇంతలో ఇందిర వచ్చి భర్తకు కాఫీ ఇచ్చింది. ఇలా అందుకుని అలా తాగేశాడు. టీవీ ఆన్ చేశాడు. కానీ ఏ చానల్ కుదురుగా చూడటం లేదు. చకచకా మార్చేస్తున్నాడు. ‘‘ఏమండీ.. అత్తయ్యవాళ్లు ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ వస్తారట’’... చెప్పింది ఇందిర. ఆనంద్ మాట్లాడలేదు. ‘‘మీకే చెప్తోంది. మామయ్యవాళ్లు నెక్స్ట్వీక్ వస్తారట’’.. మళ్లీ చెప్పింది ఇందిర. ‘‘వినపడింది.. ఎందుకలా అరుస్తున్నావ్?’’... అన్నాడు ఆనంద్. ‘‘నేను అరిచానా?!! వినపడలేదని మళ్లీ చెప్పానంతే.’’ ‘‘వినపడకపోవడానికి నాకేమైనా చెవుడా?’’ ‘‘నేనామాట అన్లేదండీ బాబూ... వదిలేయండి.’’ ‘‘వదిలేయక ఇక్కడెవరూ పట్టుకుని కూర్చోలేదు.’’ ‘‘ఎందుకంత చిరాకు? ఏమైంది?’’ ‘‘ఏం కాలేదు.’’ ఆనంద్ ఏదో చిరాకులో ఉన్నాడని ఇందిరకు అర్థమై ఆ సంభాషణను అంతటితో వదిలేసింది. రాత్రి భోజనాల సమయంలోనూ ఆనంద్ అలాగే ఉన్నాడు. సరిగా భోంచేయలేదు. రోజూ పాపకు గోరుముద్దలు తినిపించేవాడు. ఇవ్వాళ అలా చేయలేదు. బిందు నిద్రపోయాక నెమ్మదిగా అడిగింది ఏమైందని. ఏం కాలేదంటూ కట్ చేసేశాడు. కానీ ఏదో జరిగిందనీ, మనసులో బాధపడుతున్నా డనీ ఇందిర అర్థం చేసుకుంది. అది ఇంటి వ్యవహారమైతే కాదు, ఆఫీసు వ్యవహారమే అయ్యుండొచ్చు. కానీ అదేంటో తనతో చెప్పించడమెలా?... ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. మర్నాడు ఉదయం కూడా ఆనంద్ పరాగ్గానే ఉన్నాడు. ఇందిర కదిలించలేదు. తనకు కావాల్సినవి చేసి పెట్టింది. తినేసి ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఏం చేయాలా... అని ఆలోచిస్తూ కూర్చుంది ఇందిర.సాయంత్రం ఆనంద్ ఇంటికొచ్చి సోఫాలో కూర్చోగానే కాఫీ తెచ్చి ఇచ్చింది ఇందిర. ఆనంద్ కాఫీ తాగేసి టీవీ చానల్స్ మార్చేస్తున్నాడు. ఇదే చాన్సని బిందును కూర్చోబెట్టుకుని కథ చెప్పడం మొదలుపెట్టింది ఇందిర. ‘‘అనగనగనగా ఒక రాజ్యంలో ఒక మంత్రి ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా చక్కగా పరిష్కారం చూపించేవాడు. అందుకని ఆయన దగ్గరకు రోజూ ఎంతోమంది వచ్చి సమస్యలు చెప్పుకునేవారు. వీటికితోడు రాజ్యానికి సంబంధించిన ఇతర సమస్యలు. ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ఆయనెప్పుడూ చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు. ఇక ఇంటికొస్తే మరీ ప్రశాంతంగా ఉండేవాడు. ఆయనలా ఎలా ఉండగలుగు తున్నాడన్నది ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆ రహస్యం కనుక్కోవాలని ఒక సహోద్యోగి ఆయనకు తెలియకుండా గమనించసాగాడు. మంత్రిగారు రోజువారీ పనులన్నీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. తన ఇంటి దగ్గరకు రాగానే ఒంటిపైనుంచి చొక్కా తీసినట్లుగా తీసి అక్కడున్న చెట్టుకు తగిలించినట్లుగా చేసి ఇంట్లోకి వెళ్లాడు. కానీ నిజానికి చొక్కా ఆయన ఒంటిమీదే ఉంది. ఆయనలా ఎందుకు చేశాడో ఫాలో అవుతోన్న సహోద్యోగికి అర్థం కాలేదు. తల గోక్కుంటూ ఇంటిదారి పట్టాడు. మర్నాడు మంత్రిగారు ఆస్థానానికి రాగానే అతన్ని పిలిచి... ‘‘ఏమిటీ నిన్న సాయంత్రం నా వెంటే వచ్చావ్ మా ఇంటివరకూ?’’ అని అడిగాడు. ‘‘అయ్యా... మీరు గమనించారా? క్షమించండి’’ అన్నాడు సహోద్యోగి. ‘‘అదిసరే.. విషయమేంటో చెప్పు’’ అన్నాడు మంత్రి. ‘‘మీరు రోజూ ఇన్ని సమస్యలను చూస్తున్నా చిరునవ్వుతో ఎలా ఉండగలుగుతున్నారన్నది తెలుసుకోవాలనీ’’ అంటూ నసిగాడు సహోద్యోగి. ఓహ్.. అదా... అంటూ చిరునవ్వు నవ్వాడు మంత్రి. ‘‘అయ్యా.. ఇంతకీ మీరు ఇంటి బయట మీ చొక్కా తీసి తగిలించినట్లు నటించడమేమిటో అర్థంకాలేదు’’ అన్నాడు సహోద్యోగి.‘‘మనం రోజూ బయట సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంటాం. వాటిని, వాటి బరువునీ ఇంటికి తీసుకెళ్తే ఇంట్లోకూడా మనశ్శాంతి కరువవుతుంది. అందుకే చొక్కాను బయటే తగిలించి లోపలకు వెళ్తా’’ అని చెప్పాడు మంత్రి. ‘‘కానీ అసలక్కడ చొక్కానే లేదుగా’’.. అనుమానం వ్యక్తం చేశాడు సహోద్యోగి. ‘‘నిజమే అక్కడ నిజమైన చొక్కా లేదు. మనసులో ఉన్న సమస్యల చొక్కానే అక్కడ తగిలించి వెళ్లా’’... వివరించాడు మంత్రి. సహోద్యోగికి విషయం అర్థమైంది. ఓ చెవి వేసి వింటున్న ఆనంద్‌కు కూడా. కాస్సేపటి తర్వాత ఇందిర దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. ఆఫీసులో తన సమస్యేమిటో పంచుకున్నాడు. ఇందిర కూడా తనకు తోచిన సలహా ఇచ్చింది. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
నాలుగేళ్ల బాలుడిపై బంధువు దాష్టీకం
-
’చట్టం ఎవరికీ చుట్టం కాదు’
-
ఏ జ్ఞానమైనా సరే....
గ్రంథపు చెక్క జ్ఞానం సంపాదించడం వల్ల శాంతి చెడదు. సంపాయించిన జ్ఞానాన్ని విశ్వసించి దాన్ని జీవితం మీదికి తెచ్చుకొని ఆ జ్ఞానం ప్రకారం జీవితాన్ని వంకర తిప్పడం వల్ల కలుగుతాయి అనర్థాలు ఏ జ్ఞానమైనా సరే అది రిలెటివ్. ఓ మూల నుంచి ఓ కోణం నించే అది సత్యం. సంపూర్ణమైన జ్ఞానం ఏదీ కాదు. నీకు సత్యం కనుక అది నాకు సత్యం కానక్కర్లేదు అనే స్తిమితం, విశాలత్వం ఉంది ఈ దేశంలో త్యాగమనేది త్యాగమని తెలియకుండానే జరగాలి. తెలిసి జరిగినప్పుడు తనకీ, ఇతరులకీ విషతుల్యం బోధనలు రెండు విధాలు...తాను నమ్మినది బోధించడం, తాను నమ్మనిది బోధించడం! ద్వేషం ప్రేమకు చాలా సన్నిహితం. అందుకనే మనం ప్రేమిస్తున్నవాళ్ళు అపరాధం చేసినప్పుడు మనకి ఎక్కువ ద్వేషం కలుగుతుంది మనుష్యుడు మృగాల కన్న వివేకవంతుడైనందుకు, మృగాల ఆనందాన్ని త్యజించడానికి కాదు ఆ వివేకాన్ని ఉపయోగించాల్సింది. - చలం ‘విషాదం’ (ఇతర వ్యాసాలు) పుస్తకం నుంచి. -
యూపీలో హోంమంత్రి బంధువు హత్య
లక్నో: కేంద్రం హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ బంధువును ముగ్గురు దుండగులు కాల్చిచంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బంక్ యజమాని అయిన అరవింద్ సింగ్‌ను అతి సమీపంనుండి మెడపై కాల్చి చంపారు. సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళ ఈ సంఘటనపై గ్రామస్తులకు సమాచారం అందించారు. భార్యను ఎయిర్‌పోర్ట్‌లో దించి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు దుండగులు అరవింద్ సింగ్‌ను అటకాయించిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం. దుండగుల్లో ఒకడు అరవింద్ ప్రయాణిస్తున్న కారులోకి చొరబడి కొద్ది నిమిషాలు అతనితో మాటలు కలిపి ఆ తరువాత అతిసమీపం నుండి కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం సంఘటనా స్థలం నుంచి వారు పారిపోయారని చెప్పారు. కాగా ఈ ఘటనలో ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఖాళీ తూటాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఎకే పాండే (రూరల్) తెలిపారు. రాష్ట్రంలో పాలన కొరవడిందని, ప్రతీరోజు జనం చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తర ప్రదేశ్ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. -
అసలేం జరిగింది!
కాకినాడ క్రైం :కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం బంధువు బోనాసు రాజా మృతదేహానికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టుమార్టం నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించరు. అంతే కాకుండా సాయంత్రం ఐదు దాటిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల మేరకు వైద్యులు ఆ నిబంధనలను తుంగలో తొక్కారు. రాత్రికి రాత్రే పోస్టుమార్టం నిర్వహించడంతో రాజా మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గక తప్పదని రంగరాయ వైద్య కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. తోట నరసింహం మంత్రిగా ఉన్న సమయంలో రాజా వ్యక్తిగత సహాయకునిగా పనిచేసేవాడు. ఆ సమయంలో ఉద్యోగాలిప్పిస్తామంటూ భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేశారు. అందుకు రాజా మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో ప్రస్తుతం వారు రాజాపై ఒత్తిడి పెంచారు. అయితే అతడు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అతనిని ఎవరో హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కొంతకాలం నుంచి ఎంపీ తోట నరసింహానికి రాజా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో పరిసరాలను పరిశీలించి వారున అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాత్రూమ్లో షవర్‌కు లుంగీతో ఉరివేసుకోవడం నిజం కాదంటున్నారు. షవర్ అతని బరువును మోయలేదని, ఉరివేసుకుంటే అది విరిగిపోయేదంటున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ముఖంలో పెనుమార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాజా మృతదేహం మాత్రం చాలా ప్రశాంతంగా చనిపోయినట్టు ఉందని, అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనడంలో వాస్తవం లేదంటున్నారు. మెడ వద్ద కూడా పెద్దగా ఉరివేసుకున్న గుర్తులు లేకపోవడం ఆ అనుమానాలు బలం చేకూరుస్తోంది. రాజకీయ పలుకుబడితో పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, వైద్యులు కేసును నీరుగార్చే అవకాశం లేకపోలేదంటున్నారు. అతని ప్రతర్ధులే అతనిని హతమార్చి ఉంటారనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పక్కనే రక్తపు మరకలుండడం కూడా చర్చనీయాంశమైంది. రాజా ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతడి చివరి ఫోన్ కూడా ఓ ప్రముఖ వ్యక్తికి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసులు రంగ ప్రవేశం చేయకుండానే మృతదేహాన్ని ఉరి నుంచి కిందికి దింపేసినట్టు అతడి స్నేహితుడు నల్లా శ్రీనివాస్ చెప్పడం కూడా నమ్మశక్యంగా లేదని సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. రాజా మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని సన్నిహితులు పేర్కొంటున్నారు. -
ఎంపీ తోట నరసింహం బంధువు అనుమానాస్పద మృతి
కాకినాడ క్రైం : కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం సమీప బంధువు కాకినాడలోని ఓ ప్రముఖహోటల్‌లో ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లాడ్జి బాత్రూమ్లో షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అతడి స్నేహితుడు చెబుతుండగా, మరోవైపు పోలీసులు హత్యకు గురైనట్టుగా భావిస్తున్నారు. దీనికి తోడు రాత్రికి రాత్రే పోస్టు మార్టం నిర్వహించడంపై ఈ ఘటన వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉన్నట్టుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం మేనల్లుడైన బోనాసు రాజా (42) సామర్లకోట మండలం కాపవరం వీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఐదు రోజులుగా ఇతడు కాకినాడలోని ఒక ప్రముఖ హోటల్లో రూమ్ నంబర్ 210లో కాకినాడ వెంకట్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడు నల్లా శ్రీనివాస్‌తో కలసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ కలిసి గదిలో టీ తాగారు. కొద్ది సేపటికి రాజాకు ఫోన్ వచ్చింది. ఫోన్లో అవతలి వ్యక్తితో అతను చిరాకుగా మాట్లాడడం శ్రీనివాస్ విన్నాడు. వ్యక్తిగత సమస్య అనుకుని శ్రీనివాస్ బయటకు వెళ్లిపోయాడు. అరగంట తర్వాత వచ్చి చూసే సరికి రాజా గదిలో కనిపించలేదు. పరిసరాల్లో గాలించాడు. బాత్రూమ్ తలుపు కొట్టినా స్పందన లేదు. తలుపు తెరుద్దామని శ్రీనివాస్ ప్రయత్నించడంతో లోపల గడియ పెట్టి ఉండడంతో అది తెరుచుకోలేదు. మరో పావు గంట తర్వాత మరలా తలుపు తట్టాడు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. వారు వచ్చి తలుపు తెరిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో గునపం తెచ్చి తలుపు బద్దలు కొట్టారు. అయితే బాత్రూమ్లో రాజా విగతజీవిగా పడి ఉండడాన్ని వారు గమనించారు. బాత్రూమ్లో షవర్‌కు లుంగీతో ఉరివేసుకుని రాజా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షి నల్లా శ్రీనివాస్ చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి, క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, టూ టౌన్ ఎస్సైలు ఎం.శేఖర్‌బాబు, కేవీఎస్ సత్యనారాయణ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. విషయం తెలుసుకున్న రాజా భార్య అనూష, కుమారుడు ప్రశాంత్, కుమార్తె ఎస్తేర్, తదితరులు కాకినాడ చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ముడుపుల వ్యవహారమే కారణమా? రాష్ర్ట స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రిగా పనిచేసినప్పుడు ఎంపీ నరసింహానికి రాజా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. మంత్రిగా పనిచేసినప్పుడు హోం గార్డులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల నిమిత్తం రూ. లక్షలు చేతులు మారినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రాజా ద్వారానే ఈ ముడుపుల వ్యవహారం సాగినట్టు అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే వారిలో ఏ ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించకపోగా, వసూలు చేసిన సొమ్ములు తిరిగి చెల్లించకపోవడంతో కొంత కాలంగా వివాదం నెలకొంది. నరసింహం ప్రస్తుతం ఎంపీగా ఉన్నందున ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే సొమ్ములు చెల్లించాలంటూ వారు రాజాపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన తనకేమీ సంబంధం లేదన్న ధోరణిలో వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోనాసు రాజా కాకినాడలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోంది. రాజాకు ఎలాంటి అప్పులు లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఎవరో ఏదో చేసి ఉంటారనే అనుమానాలను సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు రేకెత్తిస్తున్న పరిసరాలు స్నేహితుడు చెబుతున్నట్టుగా ఉరివేసేందుకు ఉపయోగించిన షవర్ పెద్ద ఎత్తులో కూడా లేదు. పైగా పోలీసులొచ్చే సరికే మృతదేహాన్ని కిందకు దింపేయడం.. బాత్రూమ్లో రక్తపు మరకలు ఉండడం.. మెడపై ఎలాంటి ఉరి వేసుకున్న ఛాయలు కన్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎంపీ నరసింహం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడం.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడం.. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారనే ఆరోపణలు విన్పిపిస్తున్నాయి.