హైదరాబాద్ : దూరపు బంధువు కదా అని ఇంట్లోకి రానిస్తే.. అదను చూసి మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలతో పరారయ్యాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ దూరపు బంధువు కదా అని ఓ యువకుడికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె గొంతు కోసి బంగారు నగలతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.