![Btech student killed by her close relative over jealousy - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/13/hyd.jpg.webp?itok=6QH2LRZQ)
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: మరొకరితో చనువుగా ఉంటోందని అక్కసుతో ఓ బావ మరదలిని గొంతు నులిమి చంపేసిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ సురేష్ కథనం ప్రకారం వివరాలు.. హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలవేణి దంపతుల కుమార్తె మంజుల (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి బంధువుల కుమారుడు వరుసకు బావ అయిన భూపతి (21) ఏవీబీపురంలో నివాసముంటున్నాడు. వీరిరువురూ స్నేహంగా ఉండేవారు.
ఇటీవల మంజుల మరో వ్యక్తితో చనువుగా ఉంటూ ఫోన్‌లో మాట్లాడుతోందని భూపతి రెండు రోజుల క్రితం గొడవకు దిగాడు. ఈ నెల 10న తన ఇంటికి మంజులను రప్పించుకొని ఆమె గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నీటిసంప్‌లో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. కానీ.. కాసేపటికి భూపతి తన నిర్ణయాన్ని మార్చుకొని అదేరోజు పోలీసులకు లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment