jealousy
-
తమ దగ్గర ఉన్నదే...
మనసంతా అసూయతో నిండి ఉన్నవారు ఎవరిలోను గొప్పతనాన్ని అంగీకరించ లేరు. ఎవరి గురించి అయినా గొప్పవారు అని అనగానే వెంటనే ఏదో ఒక లోపం వారిలో వెతికి, ఆ ఒక్కదాని వల్ల వారు పనికిరాని వారు అని నిర్ధారించేస్తారు. మానవమాత్రులకి ఏదో ఒక చిన్న లోపం, దోషం కాకపోవచ్చు, ఉండే ఉంటుంది. సద్గుణాలని ఎన్ని ఉన్నా పక్కకి పెట్టి, ఆ చిన్న బలహీనతనే పతాక శీర్షికగా చేస్తారు. ‘‘అయ్యా! మీనుండి సహాయం పొందిన వారే మిమ్మలని గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీరు వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేమి?’’ అని ప్రశ్నించిన వారికి ఒక మహానుభావుడు ఇట్లా సమాధానం చెప్పారు. ‘‘ఎవరైనా తమ దగ్గర ఉన్న దానిని మాత్రమే ఇవ్వగలరు కదా! నా దగ్గర ఉన్న దానిని నేను పంచుతున్నాను. వారి దగ్గర ఉన్న దానిని వారు వెలిగక్కుతున్నారు.’’ నిజమే కదా! తమ వద్ద లేని దానిని ఎవరైనా ఎట్లా ఇవ్వగలరు? గుండెల నిండా ప్రేమ, సానుభూతి, ఆప్యాయత, దయ మొదలైనవి ఉన్న వారు వాటినే వ్యక్తీకరించ గలుగుతారు. ద్వేషం, పగ, అసూయ ఉన్న వారు వాటినే ప్రకటించగలుగుతారు. మాటలలో వ్యక్తమయ్యే భావాలే మనిషి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి. వాస్తవాన్ని గ్రహించటానికి అటువంటివారి మాటలని వడగట్టవలసి ఉంటుంది. వాటికి వెంటనే ప్రతిస్పందించకుండా ఉండాలి. వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఒక పాత్రలో దేనినైనా నింపుతూ ఉంటే నిండగానే అది పొంగి పొరలుతూ ఉంటుంది. అదేవిధంగా గుండె అనే పాత్రలో ఏది నిండితే అదే వెలుపలికి ఉబికి వస్తుంది. దానిని తట్టుకోగలగటం కష్టమైన పనే అని చెప్పవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రేమని కూడా తట్టుకోటం కష్టం. అవతలి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాయసంలో పడ్డ ఈగ లాగా గిజగిజ లాడ వలసి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా అనిపించినా ప్రమోదమే కాని, ప్రమాదం ఏమీ ఉండదు. అదే ద్వేషమైతే చెప్పనవసరం లేదు. వాతావరణాన్ని కలుషితం చేయటమే కాదు, కొన్నిమారులు ప్రమాదాలు కూడా తెచ్చి పెడుతుంది. ఇటువంటి వారు సమాజంలో కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. ఎందుకు ఎదుటివారి మీద విషం కక్కుతారో తెలియదు. ఎవరు బాగున్నా వీరికి నిద్రపట్టదు. ఏదో ఒక వంకర మాట అనవలసినదే. ఒకప్పుడు మాటలకే పరిమితం అయిన ఈ వ్యవహారం తరువాత అచ్చులో కనపడేది. ఇప్పుడు ఎలెక్ట్రానిక్ మీడియా వేదిక అయింది. ఇక వాట్సప్, ట్విటర్ వంటి వాటిలో విచ్చలవిడిగా విషబీజాలు వెదజల్లటం చూస్తున్నాం. అసలు బాధాకరమైన విషయం ఏమంటే వీటికే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఆకర్షణ ఒక్కటే కాదు, ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలుసుకుందామనే కుతూహలం కూడా అని కొంతమంది విశ్లేషణ. స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా – వారి మనస్సులన్నీ ప్రతికూల భావనలతో నిండి ఉన్నాయని! ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, తన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా! ఉద్దేశం ఉంటే సరి పోదు. శక్తి ఉండాలి, సంపద కూడా ఉండాలి. అది కూడా ఎంత ఇచ్చినా తనకి తక్కువ కాదు అన్నంత నిండుగా ఉంటేనే సాధ్యం. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు. వస్తుసంపద కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు. మంచివే పెంచుకుందాం. పంచుకుందాం. ఈ రోజు మనతో ఎవరి గురించి అయినా చెడుగా చెపుతున్నారు అంటే, రేపు మన గురించి ఎంతమందితో ఏం చెపుతారో! ఇది గుర్తించి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇట్లా చెప్పేవారికి కాస్త సృజనాత్మకత కూడా ఉంటుంది. ఎదుటివారు నమ్మే విధంగా చక్కని కల్పనలు చేయగలరు. బట్టతలకి మోకాలికి ముడి పెట్టగలరు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు
భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు. పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ. ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది. భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా... అని ఆయన కోపగించుకోలేదు. ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు. నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు. నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బెజోస్ అంతరిక్షయాత్ర: మౌనం వీడిన గూగుల్ సీఈవో పిచాయ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం గ్లోబల్ బిలియనీర్ల అంతరిక్ష యానం హవా నడుస్తోంది. ఇప్పటికే బిలియనీర్, వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చారిత్రక రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోగా మరో బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెలలోనే నింగిలోకి దూసుకెళ్లెందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా టెక్ దిగ్గజం, గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతరిక్షం నుంచి భూమిని చూడటం అంటే తనకు కూడా చాలా ఇష్టమని, త్వరలోనే బెజోస్ నింగిలోకి వెళ్లడం తనకు కొంచెం జెలస్‌గా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మనుషులు సృష్టించిన అత్యంత లోతైన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో బీబీసీ ఇంటర్వ్యూలో పిచాయ్ పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా చివరి సారిగా ఎపుడు ఉద్వేగానికి లోనయ్యారని అడిగినప్పుడు కోవిడ్-19 ఉదృతి సమయంలో ప్రపంచవ్యాప్తంగా మృత దేహాలతో ఉన్న ట్రక్లు క్యూలో ఉన్న దృశ్యాన్ని, అలాగే గత నెలలో భారత దేశంలో నెలకొన్న పరిస్థితి చూసి కన్నీళ్లొచ్చాయని చెప్పుకొచ్చారు. తమిళనాడులో పుట్టి చెన్నైలో పెరిగిన గూగుల్ సీఈఓ తాను అమెరికన్ పౌరుడినే అయినప్పటికీ తనలో భారతమూలాలు చాలా లోతుగా పాతుకుపోయాయన్నారు. భారతీయత తనలో కీలక భాగమని ఆయన పేర్కొన్నారు. భద్రత కోసం ఒకేసారి 20 ఫోన్లు వాడతా వివిధ ప్రయోజనాల నిమితం ఒకేసారి 20 ఫోన్లను ఉపయోగిస్తున్నానని సుందర్ పిచాయ్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీను పరీక్షించేందుకు ఫోన్‌ను నిరంతరం మారుస్తూ ఉంటానని చెప్పారు. పెద్ద టెక్ కంపెనీలను నడిపే సాంకేతిక నిపుణుల వ్యక్తిగత టెక్ అలవాట్లను తెలుసుకోవడం చాలా సాయపడుతుంద న్నారు. దీంతోపాటు తన పిల్లల కోసం కేటాయించే సమయం, స్క్రీన్ సమయం, పాస్వర్డ్ మార్పులు సహా తన టెక్ అలవాట్లను పంచుకున్నారు. అలాగే పన్ను వివాదాస్పద అంశంపై స్పందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపు దారులలో తాము ఒకరమనీ, ముఖ్యంగా యూఎస్‌లో ఎక్కువగా చెల్లిస్తున్నామన్నారు. గత దశాబ్దంలో సగటున 20 శాతానికి పైగా పన్నులు చెల్లించామని తెలిపారు. కాగా నాసా అపోలో మూన్ ల్యాండింగ్ వార్షికోత్సవం సందర్భంగా బ్లూ ఆరిజిన్ అంతరిక్ష విమానం న్యూ షెపర్డ్ వ్యోమనౌక బెజోస్ సుమారు 100 కిలోమీటర్లు లేదా 328వేల అడుగులు ఎగురుతుందని భావిస్తున్నారు. జెఫ్ బెజోస్ అతని సోదరుడు మార్క్ బెజోస్, ఇతర వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి ప్రవేశించ నున్నారు. నిజానికి రోదసీయాత్ర చేసిన తొలి బిలియనీర్‌గా రికార్డు సృష్టించాలని బెజోస్ భావించారు. ఈ వ్యూహాలతో కార్యాచరణలో ఉండగానే అనూహ్యంగా బెజోస్ కంటే ముందే రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో నింగిలోకి వెళ్లి ఆ రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
మరొకరితో చనువుగా ఉంటోందని బీటెక్ విద్యార్థినిపై దారుణం
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: మరొకరితో చనువుగా ఉంటోందని అక్కసుతో ఓ బావ మరదలిని గొంతు నులిమి చంపేసిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం వివరాలు.. హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలవేణి దంపతుల కుమార్తె మంజుల (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి బంధువుల కుమారుడు వరుసకు బావ అయిన భూపతి (21) ఏవీబీపురంలో నివాసముంటున్నాడు. వీరిరువురూ స్నేహంగా ఉండేవారు. ఇటీవల మంజుల మరో వ్యక్తితో చనువుగా ఉంటూ ఫోన్లో మాట్లాడుతోందని భూపతి రెండు రోజుల క్రితం గొడవకు దిగాడు. ఈ నెల 10న తన ఇంటికి మంజులను రప్పించుకొని ఆమె గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నీటిసంప్‌లో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. కానీ.. కాసేపటికి భూపతి తన నిర్ణయాన్ని మార్చుకొని అదేరోజు పోలీసులకు లొంగిపోయాడు. -
వీటికి విశ్వాసంతో పాటు జెలసీ ఎక్కువే!
విశ్వాసం అనే మాట వినబడగానే మనకు వెంటనే శునకాలు గుర్తు వస్తాయి. విశ్వాసఘాతుకానికి పాల్పడేవాళ్లను ‘కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు’ అని తిట్టిపోస్తుంటాం. విశ్వాసం సంగతి సరే, మరి ఈర్షా ,అసూయల సంగతి ఏమిటి? ఇట్టి విషయంపై న్యూజిలాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ అక్లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. శునకాల యజమానుల నుంచి రకరకాల కోణాలలో సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. అంతే కాదు...హైలీ–రియాలిటీ ఆర్టిఫిషియల్ శునకాన్ని తయారుచేశారు. ఒక శునక యజమాని ఈ కృత్రిమ శునకం తలను నిమురుతున్న వీడియోను ఆయన కుక్కగారికి చూపితే అసూయతో ముఖం అటు తిప్పుకుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా అలాగే జరిగింది. పక్కింటి కుక్క గురించి పొగిడినా, ఏదైనా దానికి ఇచ్చినా వాటి ఫేస్‌లో జెలసీ కనిపిస్తుందట! -
అసూయా రాహిత్యం
జ్యోతిర్మయం ఒక వ్యక్తి సజ్జనుడా, దుర్జనుడా అని నిష్కర్షించి చెప్పడానికి కారణంగా నిలిచేది ‘అసూయ’ అనేదే. అసూయా పరులను దుర్జనులని, అసూయా రహితులను సజ్జనులని వ్యవహరిస్తారు. గుణాలను గుణాలుగానే భావిస్తూ గుణవంతులను అభిమానించి ఆదరించి అక్కున చేర్చుకునే సజ్జనులను అందరూ ఆరాధిస్తారు. గుణాలలో దోషాలను ఆరోపించే దుర్జనులకు అందరూ దూరంగా ఉంటారు. భగవంతుడిలో ఉండే కళ్యాణ (శుభ) గుణాలను కీర్తించే, స్మరించే, ఆస్వాదించే, అనుభవించే, ఆనందంగా శ్రవణం చేసే (వినే) అసూయా రహితులైన భక్తులంటే భగవంతునికి ఎంతో ఇష్టము. తనలోని శక్తియుక్తులను శిష్యులకు ధారపోసే సద్గురువుకు కూడా అసూయ అనే దుర్గుణం లేశమాత్రం కూడా లేనట్టి శిష్యుడు అంటేనే అధిక ప్రీతి. గీతాచార్యుడైన శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి కర్తవ్యమును ప్రబోధించే సందర్భములో అర్జునా! ‘‘ప్రవక్ష్యామి అనసూయవే’’ నీలో అసూయ లేనందున నీకు అనేకానేక రహస్యాలను ఉపదేశిస్తాను అని అర్జునుడితో పలికాడు. ఇతరుల అభివృద్ధిని సహించలేకపోవడాన్ని ‘‘ఈర్ష్యా’’ (అక్షాంతిః ఈర్ష్యా) అని అంటారు. ఇట్టి ఈర్ష్య కన్న ప్రమాదకరమైనది అసూయ..... సహృదయ పుంగవులలో ఉండే సద్గుణ సముదాయాన్ని ఆస్వాదించలేని అసూయాపరులు ఏ ఒక్క సద్గుణాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్నింటిలోనూ దోషాలను ఆరోపిస్తారు. ఇష్టం వచ్చినరీతిలో కాకుండా పెద్దల పట్ల వినయ విధేయతలను కలిగివుంటూ కాస్త భయాన్ని, మొహమాటాన్ని, సంకోచాన్ని కలిగివున్న సజ్జనుణ్ణి దుర్జనులు జడుడని వ్యవహరిస్తారు. నియమనిష్టలు కలిగిన వ్యక్తినేమో దంభం కలవాడని అంటారు. సదా చారవంతుడైన వ్యక్తిని నటుడు అని సంబోధిస్తారు. శౌర్యవంతుణ్ణి దయలేనివాడు అని పేర్కొంటారు. సత్యమునే పలుకవలెను అని నియమాన్ని కలిగి పరిమితంగా మాట్లాడేవాడిని మతివిహీనుడని పలు కుతారు. అందరితో ప్రియంగా మాట్లాడేవాడిని దీనుడని, తేజోవంతుణ్ణి గర్విష్టి అని, నేర్పుతో మాట్లాడే వానిని వదరుబోతు అని, దీర్ఘాలోచన పరుడైన వ్యక్తిని శక్తిలేనివాడని ఆక్షేపిస్తారని- ‘‘జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతరతే దంభః శుచే కైతవం శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని తేజస్వి న్యవలిప్తతా ముఖరతా వక్తరి, అశక్తిఃస్థిరే తత్కో నామ భవేత్ సుగుణినాం యో దుర్జనైః నాజ్కితః॥అనే శ్లోకం ద్వారా వెల్లడవుతోంది. అసూయాగ్రస్తులు సజ్జనులను ద్వేషిస్తూ తమ అస్తిత్వానికే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. అసూయారహితులు అందరికీ ఆత్మయులవుతారు. అసూయ మన మది దరిచేరకుండా జాగ్రత్త పడదాం. (వ్యాసకర్త: సముద్రాల శఠగోపాచార్యులు) -
దీపికకు అసూయగా ఉందట!
ముంబై: దీపిక పదుకోన్.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలసి భారీ బడ్జెట్ చిత్రం కొచ్చాడియన్లో దర్శనమివ్వనుంది. ఇంత పాపులారిటీ ఉన్న దీపికకు కంగనా రనౌత్‌ను చూస్తే అసూయగా ఉందట. కంగనా తాజా చిత్రం క్వీన్‌లో ఆమె అద్భుతంగా నటించిందంటూ ప్రశంసించింది. 'క్వీన్ సినిమా చూశా. ఇందులో కంగన అద్భుతంగా నటించింది. కంగన నటన చూసి అసూయ కలిగింది' అని దీపిక చెప్పింది. ఈ చిత్ర దర్శకుడు వికాస్ మహిళల భావోద్వేగాలను చక్కగా తెరకెక్కించారంటూ ప్రశంసించింది.