విశ్వాసం అనే మాట వినబడగానే మనకు వెంటనే శునకాలు గుర్తు వస్తాయి. విశ్వాసఘాతుకానికి పాల్పడేవాళ్లను ‘కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు’ అని తిట్టిపోస్తుంటాం. విశ్వాసం సంగతి సరే, మరి ఈర్షా ,అసూయల సంగతి ఏమిటి? ఇట్టి విషయంపై న్యూజిలాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ అక్‌లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. శునకాల యజమానుల నుంచి రకరకాల కోణాలలో సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.
అంతే కాదు...హైలీ–రియాలిటీ ఆర్టిఫిషియల్ శునకాన్ని తయారుచేశారు. ఒక శునక యజమాని ఈ కృత్రిమ శునకం తలను నిమురుతున్న వీడియోను ఆయన కుక్కగారికి చూపితే అసూయతో ముఖం అటు తిప్పుకుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా అలాగే జరిగింది. పక్కింటి కుక్క గురించి పొగిడినా, ఏదైనా దానికి ఇచ్చినా వాటి ఫేస్‌లో జెలసీ కనిపిస్తుందట!
Comments
Please login to add a commentAdd a comment