faithful
-
Viral Video: శునకం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా
అంకారా: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారేమో.. కానీ కుక్కలు మాత్రం అలాకాదు! అందుకే చాలా మంది శునకాలను తమ కుటుంబంలో ఒక సభ్యునిగా, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. వాటికి స్నానం చేయించటం దగ్గర నుంచి మంచి ఆహారం పెట్టడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. కుక్కలు కూడా తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తూ వారితో ప్రేమగా ఆడుకుంటాయి. ఒక్కోసారి తమ యజమాని కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి. ఆహారం కూడా తినకుండా ఎదురుచూస్తాయి. ఇక యజమాని రాగానే, వారి చుట్టూ తిరుగుతూ.. తోక ఆడిస్తూ.. నాకుతూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటాయి. ఎవరైనా యజమానితో దురుసుగా మాట్లాడినా, కొట్టడానికి వెళ్లినా వారిపై దూకి దాడి చేస్తాయి. కాగా, ఇప్పటికే శునకాలు, తమ యజమానుల పట్ల ప్రదర్శించే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా టర్కీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాలు.. ఇస్తాంబుల్‌లోని బుయుకడా ఐలాండ్‌లోని ఒక మహిళ అనారోగ్యానికి గురై, కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఆ మహిళ ఒక శునకాన్ని పెంచుకునేది. అయితే, ప్రతిరోజు తనతో ఆడుకునే యజమాని లేవకుండా ఒకే దగ్గర ఉండటాన్ని చూసి కుక్క తల్లడిల్లిపోయింది. ప్రతిరోజు తన యజమాని దగ్గరకు వెళ్లడం నోటితో నాకుతూ.. కదిలించటానికి ప్రయత్నించేది. కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బంధువులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ కుక్క కూడా అంబులెన్సు వెనుక పరిగెడుతూ ఆసుపత్రికి చేరుకుంది. ఆ తర్వాత, యజమానిని ఆసుపత్రి గదిలోకి తరలించారు. అయితే, శునకం మాత్రం.. తన యజమాని కోసం ఆసుపత్రి బయట కూర్చుని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ మనుషుల కంటే శునకాలే నయం’, ‘ఆ మహిళ నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి..’, ‘ఆ మహిళ తొందరగా కొలుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
వీటికి విశ్వాసంతో పాటు జెలసీ ఎక్కువే!
విశ్వాసం అనే మాట వినబడగానే మనకు వెంటనే శునకాలు గుర్తు వస్తాయి. విశ్వాసఘాతుకానికి పాల్పడేవాళ్లను ‘కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు’ అని తిట్టిపోస్తుంటాం. విశ్వాసం సంగతి సరే, మరి ఈర్షా ,అసూయల సంగతి ఏమిటి? ఇట్టి విషయంపై న్యూజిలాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ అక్లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. శునకాల యజమానుల నుంచి రకరకాల కోణాలలో సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. అంతే కాదు...హైలీ–రియాలిటీ ఆర్టిఫిషియల్ శునకాన్ని తయారుచేశారు. ఒక శునక యజమాని ఈ కృత్రిమ శునకం తలను నిమురుతున్న వీడియోను ఆయన కుక్కగారికి చూపితే అసూయతో ముఖం అటు తిప్పుకుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా అలాగే జరిగింది. పక్కింటి కుక్క గురించి పొగిడినా, ఏదైనా దానికి ఇచ్చినా వాటి ఫేస్‌లో జెలసీ కనిపిస్తుందట! -
విశ్వాసమంటే ఇదేనేమో!
నర్సంపేట: విశ్వాసం చూపడంలో శునకానికి ఉన్న ప్రత్యేకత మరే జంతువుకు లేదు. అన్నం పెట్టిన యజమాని కోసం ఏ పనైనా చేయగలదు. ఇందుకు నిదర్శనమే వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సంఘటన.. తనను పెంచుకున్న యజమాని కూతురికి గాయమైతే.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడున్న సిబ్బందికి విషయం చెప్పడానికి ప్రయత్నించింది. నర్సంపేటలోని పోశమ్మ వీధికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కుక్కను పెంచుకుంటున్నాడు. గురువారం ప్రసాద్ కుమార్తె అక్షిత (రేణుక) ఇంటి ముందు సైకిల్‌పై నుంచి పడిపోవడంతో పెదవికి తీవ్ర గాయమైంది. దీంతో అక్కడే ఉన్న శునకం పరుగు పరుగున సమీపంలో ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలోకి వెళ్లి అటు ఇటు తిరగడం.. సిబ్బందికి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేసింది. ఇదంతా గమనించిన ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు శునకం ప్రయత్నం అర్థంకాక చూస్తుండి పోయారు. అప్పుడే శునకం యజమాని ప్రసాద్ కూతురును తీసుకుని ఆస్పత్రికి వచ్చేసరికి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నారు. చిన్నారికి గాయమైన విషయాన్ని చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన శనకాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో శునకం కంటతడి పెట్టుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. -
'ఫొటో చూసి అమ్మాయి ఎలాంటిదో చెప్పేస్తారట'
సిడ్నీ: ముఖం చూస్తే చాలు ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయొచ్చు అని అబ్బాయిలు అంటుంటారు. అయితే, కేవలం ముఖం చూడటం ద్వారానే కాకుండా ఆ అమ్మాయి ఫొటో చూసి కూడా తన గుణగణాలేమిటో, నమ్మకస్తురాలా కాదా అనే విషయాలు ఇట్టే చెప్పేయగల సామర్థ్యం సహజ సిద్ధంగానే పురుషుల్లో ఉంటుందని ఆస్ట్రేలియాలోని ఓ అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన సోమన్ థా లివర్స్, అతడి బృందం కలిసి ఈ అధ్యయానికి తెరతీశారు. కొంతమంది పురుషులను తీసుకొని వారిని రెండు భాగాలుగా చేసి వారికి కొందరు మహిళల ఫొటోలను చూపించి వారి వ్యక్తిత్వం గురించి ప్రశ్నించగా పలు ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పారు. రెండు గ్రూపుల పురుషులు కూడా ఆ అమ్మాయిల ఫొటోలను చూసి ఒకే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి పరిశోధకులను ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే వారు చూపించిన ఫొటోలన్నీ అంతకుముందే వారు పరిశీలన చేసిన అమ్మాయిలవి. వారి పరిశీలనలో ఆ అమ్మాయిలు ఎలాంటివారని తెలుసుకున్నారో అలాంటి విషయాలనే ఫొటోలు చూసిన పురుషులు చెప్పడంతో సహజ సిద్ధంగానే వారికి ఆ శక్తి ఉందని అధ్యయనకారులు అంచనాకు వచ్చారు.