'ఫొటో చూసి అమ్మాయి ఎలాంటిదో చెప్పేస్తారట' | Men can identify faithful women from photo! | Sakshi
Sakshi News home page

'ఫొటో చూసి అమ్మాయి ఎలాంటిదో చెప్పేస్తారట'

Published Tue, Sep 22 2015 6:33 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

'ఫొటో చూసి అమ్మాయి ఎలాంటిదో చెప్పేస్తారట'

'ఫొటో చూసి అమ్మాయి ఎలాంటిదో చెప్పేస్తారట'

సిడ్నీ: ముఖం చూస్తే చాలు ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయొచ్చు అని అబ్బాయిలు అంటుంటారు. అయితే, కేవలం ముఖం చూడటం ద్వారానే కాకుండా ఆ అమ్మాయి ఫొటో చూసి కూడా తన గుణగణాలేమిటో, నమ్మకస్తురాలా కాదా అనే విషయాలు ఇట్టే చెప్పేయగల సామర్థ్యం సహజ సిద్ధంగానే పురుషుల్లో ఉంటుందని ఆస్ట్రేలియాలోని ఓ అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన సోమన్ థా లివర్స్, అతడి బృందం కలిసి ఈ అధ్యయానికి తెరతీశారు.

కొంతమంది పురుషులను తీసుకొని వారిని రెండు భాగాలుగా చేసి వారికి కొందరు మహిళల ఫొటోలను చూపించి వారి వ్యక్తిత్వం గురించి ప్రశ్నించగా పలు ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పారు. రెండు గ్రూపుల పురుషులు కూడా ఆ అమ్మాయిల ఫొటోలను చూసి ఒకే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి పరిశోధకులను ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే వారు చూపించిన ఫొటోలన్నీ అంతకుముందే వారు పరిశీలన చేసిన అమ్మాయిలవి. వారి పరిశీలనలో ఆ అమ్మాయిలు ఎలాంటివారని తెలుసుకున్నారో అలాంటి విషయాలనే ఫొటోలు చూసిన పురుషులు చెప్పడంతో సహజ సిద్ధంగానే వారికి ఆ శక్తి ఉందని అధ్యయనకారులు అంచనాకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement