అందరికీ 7–8 గంటల నిద్ర అవసరమని అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిది గంటలసేపు నిద్రపోయిన తర్వాత కూడా, ఉదయం ఇంకా రిఫ్రెషింగ్‌గా లేకుండా, ఇంకా అలసటగా... బద్ధకంగా ఉన్నట్లయితే నిద్ర సరిపోలేదని అర్థం. అయితే స్త్రీల విషయంలోనే! అందరికీ కాదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. వైద్య పరిశోధకులు వివరణాత్మకంగా చెప్పిన విషయమే.
పురుషులు 7–8 గంటల నిద్రలో బాగా పని చేయగలిగినప్పటికీ, మహిళలకు నిద్రకు మరికాస్త ఎక్కువ సమయం అవసరం. మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసుకునే ముందు, నిద్ర గురించి మరికొంత అర్థం చేసుకుందాం.
మంచి నిద్ర ఎందుకు ముఖ్యం?
మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం, జీవక్రియలు, చర్మం, జుట్టు నాణ్యతను, దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. నాణ్యమైన నిద్ర మీ భావోద్వేగాలను మెరుగ్గా నిర్వహించడానికి కూడా మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. కంటినిండా నిద్రపోయేవారికి ఆందోళన, డిప్రెషన్ స్థాయులు తక్కువ గా ఉండటం వల్ల వారు కార్యాలయాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు రుజువైంది.
నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం
ఆర్టెమిస్ హాస్పిటల్‌లోని పల్మోనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ కొటారు, నిద్ర సమయంలో శరీరం కణజాల మరమ్మత్తు, కండరాల పెరుగుదల, హార్మోన్ నియంత్రణ వంటి ముఖ్యమైన ప్రక్రియలకు లోనవుతుందని అంగీకరిస్తున్నారు. ‘దీర్ఘకాలిక నిద్ర లేమి శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇది మన మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది, ఉత్పాదకత తగ్గుతుంది. ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది‘ అని ఆయన చెప్పారు.
పురుషుల కంటే మహిళలకు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని ఇటీవలి పరిశోధనలో తేలింది. ‘మెదడు కోలుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. మహిళల్లో నిద్ర, నిద్ర రుగ్మతలకు సంబంధించి తక్కువ డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, రోజువారీ కార్యకలాపాల నుండి కోలుకోవడానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి‘ అని డాక్టర్ చెప్పారు.
నిద్రకు సంబంధించి స్త్రీ పురుషులలో వ్యత్యాసం చాలా ఎక్కువని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ వివిధ కారణాల రీత్యా పురుషుల కన్నా స్త్రీలకు కేవలం 11 నుంచి 13 నిమిషాల అధిక నిద్ర సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని వారికి కావలసిన అధిక నిద్రను సమస్యలా చేసి చూపడం లేదా వారికి ఎక్కువ నిద్ర కావాలనడాన్ని అంగీకరించకపోవడం వల్ల అసలే నిద్రలేమితో సతమతమవుతున్న మహిళలు మరింత ఒత్తిడికి గురవుతారు. దీని గురించి ఆలోచిస్తూ వారు సరిగ్గా నిద్రపోలేరు. దీంతో సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఇది చాలా సమస్యలను కొనితెస్తుంది.
ఏది ఏమైనప్పటికీ పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ నిద్ర అవసరమే అన్నది నిర్వివాదాంశం. అయితే వారు మరికాసేపు ప్రశాంతంగా పడుకునేందుకు పురుషుల సహకారం పూర్తిగా అవసరం.
వయసును బట్టి నిద్ర అవసరాలు
నవజాత శిశువులు, పసిబిడ్డలకు ఎక్కువ నిద్ర అవసరం. సరైన ఆరోగ్యం, పనితీరు కోసం సగటున, పెద్దలకు సాధారణంగా రాత్రికి 7–9 గంటల నిద్ర అవసరం. వయస్సుతో ΄ాటు నిద్ర అవసరాలు కొద్దిగా తగ్గవచ్చు, వృద్ధులకు ఇప్పటికీ రాత్రికి 7–8 గంటల నిద్ర అవసరం.
Comments
Please login to add a commentAdd a comment