మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం.
అనారోగ్యాలు వేధిస్తుంటాయి!
శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. వికారంగా... వాంతులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్ళు మసక బారుతుంటాయి. కండరాలలో నొప్పి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. హైబీపీ వస్తుంది. ఆస్తమా రోగులకు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి
పండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి.
చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. మెగ్నీషియం లోపానికి వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యానికి గురవుతారు.సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మెగ్నీషియం లోపించదు.
Comments
Please login to add a commentAdd a comment