Purampokku
-
ఉరిశిక్ష ఇతివృత్తంగా పొరంబోకు
ఉరిశిక్ష అవసరం? కాదా? అన్న అంశాన్ని చర్చించే చిత్రంగా పొరంబోకు ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఎస్పీ జననాథన్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఈయన ఫస్ట్‌కాపీ బేస్డ్ మీద యూటీవీకి సంస్థకు చేసి పెట్టారు. ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్, కార్తీకలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ముందుగా దర్శకుడు ఎస్పి జననాథన్ మాట్లాడుతూ పొరంబోకు చిత్రాన్ని ఫస్ట్‌కాపీ విధానంలో యూటీవీ సంస్థకు చేశానని తెలిపారు. దీంతో బాధ్యత పెరిగిన విషయం నిజమేనని అయితే పూర్తి స్వేచ్ఛ లభించిందని అన్నారు. తాను అనుకున్న విధంగా చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపొందించానని తెలిపారు. చిత్ర కథ గురించి చెప్పాలంటే గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఉరిశిక్షకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. వారిలో పలు కమ్యూనిస్టులు ఉన్నారన్నారు. ఇలాంటి అంశాలను సుదీర్ఘంగా చర్చించి తయారు చేసిన కథా చిత్రం పొరంబోకు అని వివరించారు. అసలు ఇలాంటి ఉరిశిక్షలు అవసరమా? కాదా? అన్న విషయాన్ని చర్చించే చిత్రంగా పొరంబోకు ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ఆర్య ఒక విప్లవకారుడి పాత్రను పోషించారని చెప్పారు. విప్లవకారుడనగానే నల్లదుస్తులు, పెరిగిన గడ్డం, మీసాల వేషధారణలతోనే సినిమాల్లో చూపించారన్నారు. దాన్ని మార్చాలనే ఆర్య ఈ చిత్రంలో విభిన్నంగా చూపించమని అన్నారు. కారణం భగత్‌సింగ్ లాంటి విప్లవ వీరులు చాలా అందంగా ఉండేవారన్నారు. అదే విధంగా నటుడు శ్యామ్‌ను పోలీసు అధికారిగాను, విజయ్‌సేతుపతిని ఒక వైవిధ్య భరిత పాత్రలోనూ చూపించామని పేర్కొన్నారు. నటి కార్తీకాను కుయిలి అనే పోరాట యోధిని పాత్రలో నటింప చేశామని చెప్పారు. ఇప్పటి వరకు అందమైన యువతి పాత్రలో నటించిన కార్తీకను ఈ చిత్రంలో యాక్షన్ నాయకిగా చూపించామని తెలిపారు. ఇది మల్టీస్టారర్ చిత్రం కావడంతో మొదట్లో కాస్త భయపడినా ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్ ముగ్గురు ఎలాంటి ఈగో లేకుండా నటించడంతో తాననుకున్నది తెరపై చూపించగలిగానని దర్శకుడు జననాథన్ అన్నారు. -
మారిన పొరంబోకు టైటిల్
పొరంబోకు చిత్రం ఇప్పుడు పొరంబోకు ‘ఎన్గిర పొదువుడమై’గా మారింది. ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఇది. నటి కార్తిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు జాతీయ అవార్డును గెలుచుకున్న ఇయర్కై చిత్రంతో పాటు ఈ, పేరాన్మై లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారన్నది గమనార్హం. యూటీవీ మోషన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చిత్ర దర్శకుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నిజానికి పొరంబోకు అంటే ప్రజలు ఉపయోగానికిసరిపోగా మిగిలిన ప్రభుత్వ భూములన్ని పొరంబోకు భూమి అంటారన్నారు. ఇది తమిళభాషకు చెందిన పదమేనని తెలిపారు. చిత్ర టైటిల్ కూడా విభిన్నంగా ఉందని చాలామంది అన్నారన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలనే పొరంబోకు ఎన్గిర పొదువుడమైగా టైటిల్‌ను మార్చినట్లు చెప్పారు. ఎన్కే ఏకాం బరం చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి నవ సంగీత దర్శకుడు వర్షన్ సంగీత బాణీలు కట్టినట్లు తెలిపారు. చిత్ర ఆడియోను ఈ నెలలో విడుదల చేసి చిత్రాన్ని మే డే సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
కొత్త రకం డ్యాన్స్ చేశా
తమిళ తెరపై ఇంతకుముందెప్పుడూ చూడనటువంటి డాన్స్‌ను, నా నుంచి చూడబోతున్నారంటోంది యువ నటి కార్తీక. కో చిత్రం తరువాత ఈ బ్యూటీ సరైన సక్సెస్‌ను అందుకోలేదు. అవకాశాలు కూడా అంతంత మాత్రమే. అయితే తాజాగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో కార్తీక ఉందట. ఈ ముద్దుగుమ్మ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న పొరంబోకు చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ చిత్రంలో ఈమె పాత్రతో పాటు డాన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. దీని కోసం కార్తీక ఇప్పటి నుంచే డ్యాన్స్ రిహార్శల్స్ చేస్తోందట. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ పొరంబోకు చిత్రంలో తనకు ఆర్యకు మధ్య చాలా డిఫరెంట్ సాంగ్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పింది. కొరియోగ్రఫీ కూడా చాలా టెక్నికల్‌గా ఉంటుందని వివరించింది. ఇలాంటి డాన్స్‌ను ఇంతకుముందు తమిళ తెరపై చూసి ఉండరని అంది. అలాంటి డాన్స్ కోసం తాను కొన్ని రోజులుగా రిహార్శిల్స్ చేస్తున్నట్టు తెలిపిం ది. చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ చిత్రంలో ఆర్య, విజయసేతుపతి, శ్యామ్ ముగ్గురు హీరో లున్నారన్నారు. హీరోయిన్ మాత్రం తానేనని చెప్పింది. ఇక తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చునంది. తన పాత్ర గురించి దర్శకుడు స్కెచ్‌లతో సహా వివరించినప్పుడు హీరో పాత్ర కంటే ఎక్కువగా ఉన్నట్లు భావించానంది. ఇది యాక్షన్ చిత్రం అని పేర్కొంది. దీని కోసం ైబైక్ రైడింగ్ కూడా నేర్చుకున్నానని చెప్పింది. చిత్రంలో తనకు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని అంది. ప్రస్తుతం ‘వా డీల్’చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. పొరంబోకు చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుందని తెలి పింది. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, అయితే ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తుండటంతో కొత్త అవకాశాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నట్లు కార్తీక పేర్కొంది.