ఆటో కింద పడి చిన్నారి దుర్మరణం | child dies of auto accident | Sakshi
Sakshi News home page

ఆటో కింద పడి చిన్నారి దుర్మరణం

Published Tue, Aug 29 2017 10:27 PM | Last Updated on Tue, Sep 12 2017 1:17 AM

child dies of auto accident

కదిరి అర్బన్‌: అభం శుభం తెలియని చిన్నారి ఆటో చక్రాల కిందపడి ప్రాణం కోల్పోయింది. పట్నం గ్రామంలో రాధిక, ఆంజనేయులు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. మంగళవారం ఉదయం తాగునీరు పట్టుకునేందుకు రాధిక ఆటో ట్యాంకర్‌ వద్దకెళ్లింది. ఆమె వెనకాలే కార్తీక (3) వెళ్లింది. బిందెలో నీరు పట్టుకుని తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి వెనకాలే నిల్చుని ఉండిపోయింది. ఇంతలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారివ్వడం కోసం డ్రైవర్‌ ఆటో ట్యాంకర్‌ను వెనక్కు తోలాడు. వెనుకచక్రాల కిందపడిన కార్తీక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement