సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని చర్యలు చేపట్టామని పర్యావరణ శాఖ అధికారి, ఎక్స్ ఆఫీసీయో కార్యదర్శి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమర్‌రాజాను టార్గెట్ చేశామన్నది అవాస్తవమని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమర్‌రాజాకు నోటీసులు ఇచ్చి 2 నెలల సమయం ఇచ్చాం. ఆ తర్వాత మళ్లీ తనిఖీ చేసి కాలుష్యాన్ని నియంత్రించాలని చెప్పాం. పర్యావరణ చర్యలు చేపట్టకముందే రెండోసారి నోటీసులు ఇచ్చాం. హానికరమైన అంశాలు గుర్తించి అమర్‌రాజాకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం.
పరిశ్రమల ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగినా పీసీబీ నియంత్రిస్తుంది. రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ కేటగిరీ పరిశ్రమల్లో ప్రతి నెలా తనిఖీలు చేస్తాం. జనవరిలో 54 పరిశ్రమలు తనిఖీ చేశాం. కొన్ని పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించాం.అందులో భాగంగానే అమర్‌రాజాతో పాటు చాలా ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేపట్టి 54 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 64 పరిశ్రమలకు ఉత్పత్తి ఆపాలని ఆదేశాలు ఇచ్చాం. 50 పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment